పాస్‌పోర్ట్, వీసా, తమిళనాడు చిరునామా ఆధార్
ఆమె ఆధారాల కోసం ప్రయత్నిస్తున్న పోలీసులు
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని అడవిలో దుర్భర పరిస్థితుల్లో 50 ఏళ్ల మహిళను గుర్తించారు. చెట్టుకు ఇనుప గొలుసుతో కట్టివేసి దీన స్థితిలో ఉండగా పోలీసులు గుర్తించారు. సోనుర్లి గ్రామంలో శనివారం సాయంత్రం ఒక గొర్రెల కాపరి ఆమె కేకలు విని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
లలితా కయీగా బాధిత మహిళను గుర్తించారు. అమెరికా పాస్‌పోర్ట్ ఫోటోకాపీతో పాటు తమిళనాడు చిరునామాతో ఆధార్ కార్డ్, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మహిళను సావంత్‌వాడి (కొంకణ్)లోని ఆసుపత్రికి, ఆపై సింధుదుర్గ్‌లోని ఓరోస్‌లోని ఆసుపత్రికి తరలించారు. తరువాత ఆమె మానసిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, అధునాతన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుండి బయటపడిందనీ, కానీ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోందన్నారు. దీనికి సంబంధించి ఆమె వద్ద మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
ఆధార్ కార్డు, యూఎస్ పాస్‌పోర్ట్ ఆధారంగా ఆమె ఆచూకీని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసు బృందాలు తమిళనాడు, గోవా తదితర ప్రాంతాల్లోవాకబు చేస్తున్నట్టు అధికారి తెలిపారు. పోలీసులకు లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆమె వీసా గడువు ముగిసింది. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వారితో సంప్రదిస్తున్నామని వాస్తవానికి అమెరికాకు చెందినదని. గత పదేళ్లుగా దేశంలో ఉంటోందని భావిస్తున్నామని వెల్లడించారు.
అంతేకాదుఎంతకాలం నుంచి ఇక్కడ బంధించబడి ఉందో తెలియదనీ, రెండు రోజులుగా ఏమీ తినక పోవడంతో, స్టేట్‌మెంట్ ఇచ్చే పరిస్థితిలో కూడా లేదనీ చెప్పారు. తమిళనాడుకు చెందిన ఆమె భర్త ఆమెను అక్కడ కట్టేసి పారిపోయి ఉంటాడని భావిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment