అందమైన రంగవల్లులతో ఆకట్టుకున్న మహిళలు, బాలికలు
నాయ్‌గావ్ ‘పద్మశాలీ’మహిళా మండలిలో ముగ్గుల పోటీలు
సాక్షి, ముంబై: దాదర్ నాయ్‌గావ్‌లోని ‘పద్మశాలీ యువక సంఘం’మహిళా మండలి ఆధ్వర్యంలో సోమవారం మహిళలకు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. మండలి కార్యదర్శి చెరిపల్లి పరమేశ్వరి, కోశాధికారి పేర్ల గీతాంజలి ప్రారంభించిన ఈ పోటీలకు రితిక దేశ్‌ముఖ్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
మహిళలు, బాలికలు ఎంతో ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్న అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. పోటీల విజేతలకు సంక్రాంతి ( జనవరి 14వ తేదీ) రోజున జరిగే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి మహేశ్వరం చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి ఉపాధ్యక్షురాలు జిల్ల శారద, కార్యదర్శి చెరిపల్లి పరమేశ్వరి, సహకార్యదర్శులు బిట్ల సోని, కోశాధికారి పేర్ల గీతాంజలి, ఏలే తేజశ్రీ అడ్డగట్ల ఐశ్వర్య, చెదురుపు పద్మ, దొంత ప్రభావతి, ఇదం పద్మ, కైరంకొండ లక్షి్మ, కండ్లపెల్లి కవిత, కస్తూరి సావిత్రి, మహేశ్వరం సాక్షి, పగుడాల రోహిణి, ధర్మకర్తల మండలి చైర్మన్ కోడి చంద్రమౌళి, ట్రస్టీ తిరందాసు సత్యనారాయణ, కార్యవర్గ అధ్యక్షులు గంజి సీతారాములు, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం చంద్రశేఖర్, దోర్నాల మురళీధర్, పుట్ట గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment