Jungle
-
అడవుల్లో సైతం అవలీలగా వెళ్లే వెహికల్ ఇదే (ఫోటోలు)
-
అడవిలో చెట్టుకు గొలుసులతో కట్టేసి దీన స్థితిలో విదేశీ మహిళ: ఇది భర్త పనేనా?
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని అడవిలో దుర్భర పరిస్థితుల్లో 50 ఏళ్ల మహిళను గుర్తించారు. చెట్టుకు ఇనుప గొలుసుతో కట్టివేసి దీన స్థితిలో ఉండగా పోలీసులు గుర్తించారు. సోనుర్లి గ్రామంలో శనివారం సాయంత్రం ఒక గొర్రెల కాపరి ఆమె కేకలు విని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.లలితా కయీగా బాధిత మహిళను గుర్తించారు. అమెరికా పాస్‌పోర్ట్ ఫోటోకాపీతో పాటు తమిళనాడు చిరునామాతో ఆధార్ కార్డ్, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మహిళను సావంత్వాడి (కొంకణ్)లోని ఆసుపత్రికి, ఆపై సింధుదుర్గ్‌లోని ఓరోస్‌లోని ఆసుపత్రికి తరలించారు. తరువాత ఆమె మానసిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, అధునాతన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుండి బయటపడిందనీ, కానీ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోందన్నారు. దీనికి సంబంధించి ఆమె వద్ద మెడికల్ ప్రిస్క్రిప్షన్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు.ఆధార్ కార్డు, యూఎస్ పాస్‌పోర్ట్ ఆధారంగా ఆమె ఆచూకీని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసు బృందాలు తమిళనాడు, గోవా తదితర ప్రాంతాల్లోవాకబు చేస్తున్నట్టు అధికారి తెలిపారు. పోలీసులకు లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆమె వీసా గడువు ముగిసింది. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వారితో సంప్రదిస్తున్నామని వాస్తవానికి అమెరికాకు చెందినదని. గత పదేళ్లుగా దేశంలో ఉంటోందని భావిస్తున్నామని వెల్లడించారు.అంతేకాదుఎంతకాలం నుంచి ఇక్కడ బంధించబడి ఉందో తెలియదనీ, రెండు రోజులుగా ఏమీ తినక పోవడంతో, స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో కూడా లేదనీ చెప్పారు. తమిళనాడుకు చెందిన ఆమె భర్త ఆమెను అక్కడ కట్టేసి పారిపోయి ఉంటాడని భావిస్తున్నామన్నారు. -
గిరిజనుల తరఫున పోరాటం: రాహుల్
ధన్‌బాద్: గిరిజన ప్రజలకు నీరు, అడవి, భూమి(జల్–జంగిల్–జమీన్)పై హక్కుల ను, గిరిజన యువతకు ఉపాధిని కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆదివారం ఆయన జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో జరిగిన రోడ్ షోలో ప్రసంగించారు. రాష్ట్రంలో జోడో యాత్ర మూడో రోజుకు చేరుకుంది. జిల్లాలోని తుండిలో శనివారం రాత్రి బస చేసిన రాహుల్ ఆదివారం గోవింద్పూర్ నుంచి తిరిగి యాత్రను మొదలుపెట్టారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం కాకుండా కాపాడటం, యువతకు గిరిజనులకు న్యాయం దక్కేలా చేయడమే యాత్ర ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆర్థిక అసమానతలు, నోట్లరద్దు, జీఎస్టీ, నిరుద్యోగం వంటి సమస్యలు దేశంలోని యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం యాత్ర తిరిగి కొనసాగి బొకారో జిల్లాలోకి ప్రవేశించింది. బొకారో వైపు సాగుతూ గోధార్ కాళి బస్తీ వద్ద ఆయన బొగ్గు గని కార్మికులు, వారి పిల్లలతో ముచ్చటించారు. మధ్యాహ్నానికి యాత్ర బొకారో చేరుకుంది. భోజనానంతరం జెనామోర్ నుంచి మొదలైన యాత్ర రామ్‌గఢ్ జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలోని గోలా వద్ద జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. -
అమెజాన్ అడవుల్లో గ్రేట్ ఎస్కేప్
-
ఫ్యామిలీతో కలిసి అడవుల్లో ఎంజాయ్ చేస్తున్న అనసూయ (ఫొటోలు)
-
టూరిస్ట్‌లపైకి అమాంతం జంప్ చేసిన పులి...నెటిజన్లు షాక్
ఇంతవరకు ఎన్నో వైరల్ వీడియోలు చూసి ఉంటాం. సింహాలు మనుషులపై అకస్మాత్తుగా దాడిచేసిన పలు ఘటనలు గురించి విన్నాం. ఎన్నో సార్లు టూరిస్టుల వాహనాలకు అడ్డంగా నుల్చుని ఉండటం లేదా కారుపైకి ఎక్కేందుకు చేయడం చూసి ఉంటాం. కానీ ఇక్కడొక పులి టూరిస్టుల వెహికల్ని చూసి ఒకేసారి చంపి తినేద్ధాం అన్నంత వేగంగా టూరిస్టులపైకి దూకేస్తుంది. ఈ ఘటన చూస్తే ఎవరికైనా ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనవుతుంది. కానీ అది టూరిస్టులపై ప్రేమతోనే అలా దూకింది. వాహనంలో ఉన్న వారందర్నీ ప్రేమగా ఆలింగనం చేసుకుంటూ అందులో ఉన్న టూరిస్టులందర్నీ చుట్టేసింది. అది చేసిన పని వింతగానూ కాస్త ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది. సింహం వాహనంలో ఉన్న వారితో ఎంత ప్రేమగా మమేకమవుతుందో చూస్తే కచ్చితంగా షాక్‌గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఆ వీడియోను చూసేయండి. New wildlife experience 😬 pic.twitter.com/1J74oTKgWW — OddIy Terrifying (@OTerrifying) November 8, 2022 (చదవండి: షాకింగ్ వీడియో: పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా కదిలిన ట్రైన్.. తర్వాత ఏం జరిగిందంటే..) -
జంగిల్ సఫారీ కొత్త కొత్తగా..!
నల్లమల పర్యావరణ ప్రేమికులకు శుభవార్త..సరికొత్త హంగులతో జంగిల్ సఫారీ కనువిందు చేయనుంది. పులుల సంతానోత్పత్తి కోసం మూడు నెలల పాటు జంగిల్ సఫారీ, ఇష్టకామేశ్వరి యాత్రలకు అధికారులు బ్రేక్ వేశారు. తిరిగి శనివారం నుంచి ఈ యాత్రలు ప్రారంభం కానున్నాయి. విరామ సమయంలో రోబోటిక్ టెక్నాలజీతో మ్యూజియం, లక్షలాది రూపాయలతో విద్యుద్దీకరణ, ఫన్ ఆర్చరీ క్లబ్, పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు కొత్తగా పగోడాలు ఇలా పర్యాటకులకు కనువిందు చేసేలా పలు ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ప్రయాణం సరికొత్త అనుభూతులను నింపనుంది. పెద్దదోర్నాల(ప్రకాశం జిల్లా):నల్లమల అభయారణ్యం ఈ పేరు వింటేనే ప్రకృతి ప్రేమికుల మనస్సు పులకిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, ఎత్తైన పర్వతాలు, సుందర మనోహర లోయలు, ఆకాశాన్ని అందేలా మహా వృక్షాలు కనువిందు చేస్తాయి. తుమ్మలబైలు వద్ద ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ ఎన్నో వింతలు విశేషాలను పంచుతుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని పచ్చిక బయళ్ల నడుమ వన్యప్రాణులను వీక్షిస్తూ వాహనాలలో అభయారణ్యంలో పర్యటిస్తుంటే ఆ ఆనందమే వేరు. పులుల సంతానోత్పత్తి కాలంలో అవి అడవిలో ప్రశాంతంగా సంచరించేందుకు వీలుగా పర్యాటకానికి మూడు నెలలు బ్రేక్ పడింది. తిరిగి శనివారం నుంచి సఫారీ ప్రారంభం కానుంది. ఈ మూడు నెలల్లో పర్యాటకుల కోసం అడవిలో ముఖ్య ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రోబోటిక్ టెక్నాలజీతో మ్యూజియం: రోబోటిక్ టెక్నాలజీతో సరికొత్త మ్యూజియాన్ని సిద్ధం చేస్తున్నారు. పెద్దపులులు, చిరుత పులులు, జింకలు, నీల్గాయ్లు, తోడేళ్లు, రైలు ఎలుగులు, వేటకుక్కలు, పాములు ఇలా ఎన్నో వన్యప్రాణుల ఆకృతులను ఏర్పాటు చేయనున్నారు. ఏ వన్యప్రాణి ప్రతిమ ముందు నిలబడితే ఆ వన్యప్రాణికి సంబంధించి పూర్తి వివరాలు, విశేషాలు మనకు రోబోటిక్ టెక్నాలజీ ద్వారా స్పీకర్లలో వినేలా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా విశాఖపట్నం, హైదరాబాద్‌ల్లో తయారు చేస్తున్నారు. దీంతో పాటు పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు సరికొత్తగా పగోడాలను ఏర్పాటు చేశారు. అందులో యాత్రికులు పలహారాలను, మధ్యాహ్న భోజనాలు చేసే అవకాశం ఉంది. సీతాకోక చిలుకలు, తాబేళ్ల ఆకారాల్లో కూర్చునేందుకు ప్రత్యేక సీట్లు, చిన్నారులను ఆకట్టుకునే కొత్త కొత్త ఆకృతులు, అధునాతన టాయిలెట్లు ఇలా ఎన్నో నూతన సొగబులు సిద్ధం చేశారు. జంగిల్ సఫారీలో భాగంగా పులి చెరువు, నరమామిడి చెరువు ప్రాంతాల్లో స్వేచ్ఛగా సంచరించే పెద్దపులితో పాటు, చిరుతలు, కృష్ణ జింకలు, దుప్పులు, నెమళ్లు జిప్సీలలో ప్రయాణించే పర్యాటకులకు అనీర్వచనీయమైన అనుభూతికి ఇస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో పాటు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన ఇష్టకామేశ్వరి యాత్రను సైతం అధికారులు శనివారం ప్రారంభించనున్నారు. జంగిల్ సఫారీలో ప్రయాణం కొనసాగుతుంది ఇలా.. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలోని 24వ కిలోమీటరు వద్ద నున్న గొర్లెస్ కాలువగా పిలిచే ప్రాంతం నుంచి రెండు విలాసవంతమైన వాహనాల్లో ఈ ప్రయాణం మొదలవుతుంది. లోతట్టు అటవీ ప్రాంతంలోని నరమామిడి చెరువు, వ్యూపాయింట్, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా తిరిగి ముఖద్వారం వద్దకు చేరుకోవటంతో పర్యటన ముగుస్తుంది. సుమారు 14 కిలోమీటర్ల మేర 1.30 గంటల పాటు జరిగే ఈ ప్రయాణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అడవిలో ప్రయాణించేందుకు ప్రత్యేకంగా జిప్సీ ఏర్పాటు చేశారు. ఆరుగురు మాత్రమే కూర్చునే వీలుంటుంది. జిప్సీకి ఒక ట్రిప్పునకు రూ.2400 వసూలు చేస్తారు. సఫారీకి అధునాతన హంగులు జంగిల్ సఫారీకి అధునాతన హంగులను సమకూరుస్తున్నాం. రోబోటిక్ టెక్నాలజీతో కూడిన వన్యప్రాణుల ఆకృతులను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాం, సందర్శకుల విశ్రాంతికి పగోడాలు, టాయిలెట్లు సిద్ధం చేశాం. చిన్నారుల కోసం ఆకట్టుకునేలా ఎన్నో ఏర్పాట్లు చేశాం. – విశ్వేశ్వరరావు, రేంజి అధికారి, పెద్దదోర్నాల -
జంగిల్ సఫారీ.. ఆనందాల సవారీ
రాజంపేట: శేషాచలం అటవీ ప్రాంతమైన రాజంపేట–రాయచోటి అటవీ మార్గంలోని తుమ్మలబైలులో రెడ్‌ఉడ్ జంగిల్ సఫారీని 2010లో ఏర్పాటుచేశారు. ఇపుడు వనవిహారం పేరుతో రూ.10లక్షల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకులకు అనువుగా మారుస్తున్నారు. వన్యప్రాణుల గురించి అవగాహన కల్పించే విధంగా హోర్డింగ్స్‌ను కూడా ఏర్పాటుచేస్తున్నారు. ఎర్రచందనం చెట్ల సముహంలో వనవిహారం ఆద్యంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. సేద తీరేందుకు ఏర్పాటు చేసిన అతిథి గృహం, పిల్లలు ఆడుకోవడానికి నెలకొల్పిన పార్కు అదనపు ఆకర్షణగా ఉంటాయి. తెల్లదొరల కాలం నుంచే.... తెల్లదొరల కాలం నుంచి తుమ్మలబైలు అతిథిగృహాన్ని పర్యాటకపరంగా ఏర్పాటు చేసి ఉన్నారు. వేసవి విడిదిగా అక్కడే కాలం గడిపేవారు. అటవీ అందాలను ఆస్వాదించేందుకు వీలుగా తెల్లదొరలు సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం అవి కాలగర్భంలో కలిసిపోయాయి. తర్వాత అటవీశాఖ తుమ్మలబైలు ప్రాంతాన్ని రెడ్‌వుడ్ జంగిల్ సఫారీ పేరుతో అభివృద్ధి చేసి తొలిసారిగా శేషాచలం అటవీ అందాలను పర్యాటకులకు చూపించనున్నారు. శేషాచలం ఇలా.. రాజంపేట డివిజన్లో అరుదైన జంతువులకు నిలయమైన శేషాచలం అటవీ ప్రాంతం విస్తీర్ణం 82,500 ఎకరాల్లో ఉంది. ఎర్రచందనం విస్తారంగా కలిగి ఉన్న దీనిని కేంద్రంఇప్పటికే బయోస్పెయిర్‌గా ప్రకటించింది..ఈ ప్రాంత అందాలను పర్యాటకులు వీక్షించేలా ఎకో టూరిజం కింద రెడ్‌వుడ్ జంగిల్ సఫారీని రూపుదిద్దారు. ప్రధానంగా రెడ్‌వుడ్ జంగిల్ సఫారీలో చిరుత, ఎలుగుబండ్లు, నెమళ్లు, రోసికుక్కలు, అడవిపందులు, జింకలు, కొండగొర్రెలు, కణితులు ఉంటాయి. డిసెంబరు మాసంలో ఏనుగులు సంచరిస్తాయి. పర్యాటకులకు అనుకూలంగా.. అటవీ అందాలను వీక్షించేందుకు అనుకూలంగా రెడ్‌వుడ్ జంగిల్ సఫారీలో ఏర్పాట్లు చేశారు. దీని ముఖద్వారం నుంచి తుమ్మలబైలు బంగ్లా, చిల్డ్రన్స్ పార్కు, ఐరన్‌వాచ్‌టవర్, సేదతీరేందుకు సౌకర్యాలు, వాచ్‌టవర్‌ను ఏర్పాటుచేశారు. జంగిల్ సఫారీ వాహనం కూడా సిద్ధం చేస్తున్నారు. దెబ్బతిన్న రోడ్డును బాగు చేస్తున్నారు. రెడ్‌వుడ్ జంగిల్ సఫారీలో 30 కిలోమీటర్ల మేర అటవీ ప్రయాణం ఆహ్లాదకరంగా కొనసాగుతుంది. మల్లాలమ్మ కుంట సాకిరేవు ఏరియాలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఉన్నతాధికారులు సైతం సేదతీరే..సఫారీ నిత్యం బిజీగా విధులు నిర్వహించే జిల్లా ఉన్నతాధికారులు పర్యటించి ఊరటపడుతుంటారు. జిల్లా కలెక్టర్లు, వివిధ జిల్లా అధికారులు జంగిల్ సఫారీలో పర్యటించి ఆహ్లాదకర అటవీ అందాలను వీక్షించి మానసిక ఉల్లాసాన్ని గడుపుతున్నారు. పర్యాటకులకు అనుమతితో సఫారీకి వెళుతుంటారు. ఇందుకోసం గతంలో వాహనాలను కూడా అందుబాటులో ఉంచేది. వనవిహారం స్కీం.. వనవిహారం స్కీం కింద గత ఏడాది రూ.5లక్షలతో అతిథిగృహం పునరుద్ధరించారు. ట్రీమచ్, రోడ్లు, మల్లెలమ్మ కుంట వద్ద అభివృద్ధి చేశారు. ఈ ఏడాది కూడా రూ.10లక్షలతో అభివృద్ధి చేసేందుకు ప్రతి పాదనలు సిద్ధం చేస్తున్నారు. ఏనుగులు రాకుండా కంచెను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకుల కోసం వసతి సౌకర్యాలు, సోలార్ విద్యుత్‌ను ఏర్పాటుచేస్తున్నారు. పర్యాటకులు రూ.10 లు ప్రవేశ రుసుంతో సఫారీలో పర్యటించవచ్చు. అది కూడా సాయంత్రం 5గంటల వరకు తిరిగి బయటికిరావాల్సి ఉంటుంది. రాత్రి వేళలో ఉండేందుకు వీలులేని పరిస్థితి. జంగిల్ సఫారీ వాహనం రూ.2 లక్షలతో మరమ్మతులు చేసి పర్యాటకుల తిరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రెడ్‌వుడ్ జంగిల్ సఫారీ అభివృద్ధికి చర్యలు రూ.10లక్షలతో తుమ్మలబైలు అటవీ ప్రాంతంలో రెడ్‌వుడ్ జంగిల్ సఫారీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. ట్రీమచ్‌లు ఏర్పాటుచేశాం. ఏనుగులు రాకుండా కంచెను బలోపేతం చేస్తున్నాం. సోలార్ వెలుగులు తీసుకొచ్చాం. పర్యాటకులకు వసతి సౌకర్యాలు పునరుద్ధరిస్తున్నాం. రూ.3లక్షలతో జంగిల్ సఫారీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఎర్రచందనం, జంతువుల గురించి పర్యాటకులకు తెలిసే సైన్‌బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. –నరసింహారావు, ఇన్చార్జి డీఎఫ్ఓ, రాజంపేట -
జంగిల్ సఫారీలో కృతి
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంగిల్ సఫారీలో షికారు చేస్తోంది. వైల్డ్ అనిమల్స్తో కలిసి డిజైనర్ వేర్స్‌లో స్పెషల్ ఫోటో షూట్ జరిపింది. తెలుగులో మహేశ్ సరసన నంబర్ 1 నేనొక్కడే సినిమాలో నటించిన కృతి.. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. అక్షయ్ కుమార్‌తో వరుసగా చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది కృతి. అంతకు ముందు బరేలీకి బర్ఫీ, లుకా చుప్పి చిత్రాలతో బాక్సాఫీస్ హిట్లు అందుకుంది కృతి. క్రేజీ ప్రాజెక్ట్ ఆదిపురుష్‌లో ప్రభాస్ సరసన హీరోయిన్గా ఎంపికైంది కృతి. -
జంగిల్లో ఏం జరిగింది?
‘ఇప్పటివరకూ ఎన్నో హారర్ చిత్రాలు చూసి ఉంటారు. ఇప్పుడు సరికొత్త హారర్ చిత్రం తీసుకొస్తున్నాం’ అంటోంది ‘జంగిల్’ చిత్రబృందం. ఆది, వేదిక హీరోహీరోయిన్లుగా కార్తీక్ విఘ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ చిత్రం ‘జంగిల్’. ‘అది శ్వాసిస్తుంది. అది దాక్కొని ఉంటుంది. అది వేటాడుతుంది’ అన్నది క్యాప్షన్. మహేశ్ గోవిందరాజ్, అర్చనా చందా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘మా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం. అలాగే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం. కార్తీక్ విఘ్నేష్ దర్శకత్వ ప్రతిభ, కెమెరా, నేపథ్య సంగీతం మా సినిమాకు ప్రత్యేక ఆకర్షణ’’ అన్నారు. ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్స్: ఎస్ సత్యమూర్తి, సురేశ్ కుమార్, కెమెరా: గౌతమ్ జార్జ్, సంగీతం: జోస్ ప్రాంక్లిన్. -
టూరిస్ట్ బస్‌ను వెంటాడిన పులి
-
బస్‌ను వెంటాడిన టైగర్..
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నందన్వన్ జంగిల్ సఫారిలో ఓ పులి టూరిస్ట్ బస్‌ను వెంటాడిన ఘటనపై ఇద్దరు పార్క్ అధికారులను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. భద్రతా ప్రోటోకాల్ పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై వేటు వేసింది. జంగిల్ సఫారీలో భాగంగా టూరిస్టుల బృందం కొట్లాడుకుంటున్న రెండు పులల వద్దకు రాగానే వాటిలో ఒక పులి అనూహ్యంగా తమ బస్సు కిటికీకి ఉన్న కర్టెన్ను లాగేందుకు ప్రయత్నించింది. బస్‌పై దాడికి పులి ప్రయత్నించడంతో బస్‌ను వేగంగా నడపాలని ఓ టూరిస్టు డ్రైవర్‌ను కోరాడు. బస్సు వేగంగా ముందుకెళ్లడంతో దాని వెనుకే పులి దూసుకువెళ్లడం ప్రయాణీకులను బెంబేలెత్తించింది. దీనికి సంబంధించిన వీడియో సీనియర్ అధికారుల దృష్టికి రావడంతో బస్ డ్రైవర్, టూరిస్ట్ గైడ్లను విధుల నుంచి తొలగించారు. చదవండి : పిల్లోడిపై దూకేందుకు ప్రయత్నించిన పులి -
అడవిలోని అనుభూతి కలిగించే జంగల్ క్యాంపు
మహేశ్వరం: నగరవాసులకు మానసికోల్లాసంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం జంగల్ క్యాంపులో లభిస్తుందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మహేశ్వరం మండలం హర్షగూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మజీద్‌గడ్డ రిజర్వు ఫారెస్టులో 450 ఎకరాల విస్తీర్ణంలో రూ.4.34 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ‘జంగల్ క్యాంపు’ను ఇంద్రకరణ్‌రెడ్డి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంగల్ పార్కులో వినోదంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉందన్నారు. ఇక్కడ అడ్వెంచర్ క్యాంపు థీమ్‌తో సుందరంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. నగరవాసులు కుటుంబంతో వచ్చి రోజంతా గడిపేందుకు అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలియజేశారు. జంగల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జంగల్ క్యాంపు ప్రత్యేకతలు ఫైర్ (చలికి కాచుకునే ప్రదేశం) క్యాంపును పరిశీలిస్తున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, అధికారులు నగర ఉద్యాన యోజన, కంపా, అటవీశాఖ నిధులతో జంగల్ క్యాంపును అభివృద్ధి చేసినట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలియజేశారు. ప్రధానంగా అడ్వెంచర్ జోన్, జంగల్ క్యాంపు సెక్టార్లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాకింగ్, రన్నింగ్ సైక్లింగ్ ట్రాక్‌లతో పాటు క్యాంపింగ్ సౌకర్యాలు, సాహస క్రీడలు, చిన్నపిల్లలకు ప్రత్యేకంగా ఆటస్థలం, గజీబోలు, మల్టీపర్పస్ షెడ్స్, కుటుంబంతో గడిపేందుకు పిక్నిక్ స్పాట్లు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పార్కులో వంట చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా స్థలాలు ఉన్నాయన్నారు. సందర్శకుల రక్షణ చర్యలో భాగంగా క్యాంపింగ్ ఏరియా చుట్టూ చైన్‌లింక్డ్ ఫెన్సింగ్, పాములు చొరబడకుండా ప్రూఫ్ ట్రెంచ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ పార్కులో ఉన్న రోడ్లకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ అటవీవీరుల పేర్లను పెట్టి వారి త్యాగాలకు స్మరించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి వివరించారు. నగరవాసులకు వరం హైదరాబాద్ శివారులో మంచి వాతావరణం కల్పించేందుకు జంగల్ క్యాంపు పార్కును ఏర్పాటు చేశామని, ఈ పార్కు నగరవాసులకు వరంగా మారిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఇతర నగరాల మాదిరిగా హైదరాబాద్ కాంక్రీట్ జంగల్‌గా మారొద్దనే ఉద్దేశంతో అర్బన్ ఫారెస్టు పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తన నియోజకవర్గంలో జంగల్ క్యాంపును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మరిన్ని అర్బన్ పార్కులను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. అంతకు ముందు మంత్రులు జంగల్ క్యాంపును ప్రారంభించి, అడ్వెంచర్ జోన్‌ను పరిశీలించారు. అనంతరం సాహస క్రీడలను పరిశీలించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, కలెక్టర్ హరీష్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి శోభ, జిల్లా అటవీశాఖ అధికారి భీమ, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, డివిజనల్ ఫారెస్టు అధికారి శివయ్య, మంఖాల్ ఫారెస్టు రేంజ్ అధికారి విక్రంచంద్ర తదితరులు ఉన్నారు. -
యాక్షన్ అవార్డ్స్
బాలీవుడ్లో విద్యుత్ జమాల్‌కు యాక్షన్ హీరోగా మంచి పేరుంది. గత ఏడాది జమాల్ నటించిన ‘జంగిల్’ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారాయన. కొన్ని కళరిపయ్యట్టు స్టంట్స్‌ని అద్భుతంగా చేసి యాక్షన్ మూవీ లవర్స్ మనసు గెల్చుకున్నారు జమాల్. ఈ సినిమాకు రెండు ప్రతిష్టాత్మకమైన జాకీచాన్ అవార్డులు వచ్చాయి. చైనాలో జరిగిన జాకీచాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్‌లో భాగంగా ఇండియన్ చిత్రం ‘జంగిల్’కు రెండు అవార్డులు లభించాయి. బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రాఫర్, బెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఫిల్మ్ విభాగాల్లో ఈ అవార్డులు వచ్చాయి. ‘‘దాదాపు 150 చిత్రాలతో పోటీ పడి మా సినిమా అవార్డ్స్ గెలుచుకోవడం ఆనందంగా ఉంది. ఇండియన్ యాక్షన్ సినిమాకు మరోసారి మంచి గుర్తింపు దక్కినట్లుగా ఉంది. మేం చైనాలో స్టార్స్ అయిపోయామనే భావన కలుగుతోంది. క్రిస్ టుక్కర్ (చైనీస్ యాక్షన్ హీరో) కూడా మా యాక్షన్ సీన్స్‌ను మెచ్చుకున్నారు’’ అని పేర్కొన్నారు విద్యుత్. -
అడవిలో భారీ తిమింగలం మృతదేహం
రియో డి జనీరో : అమెజాన్ అడవుల్లో ఓ భారీ తిమింగలం మృతదేహం లభ్యమైంది. 36 అడుగుల పొడవున్న ఈ తిమింగలాన్ని హంప్‌బ్యాక్ జాతికి చెందిందిగా గుర్తించారు. బ్రెజిల్‌లోని మరాజో ఐలాండ్‌లో తిమింగలం మృతదేహం లభ్యమైంది. సముద్రం నుంచి తిమింగలం మృతదేహం ఉన్న ప్రాంతం 15 మీటర్ల దూరంలో ఉంది. సముద్రంలో చనిపోయిన తర్వాత భారీ అలలకు తిమింగలం ఇక్కడికి కొట్టుకొని వచ్చి ఉంటుందేమో అన్న కోణంలో బయాలజిస్టులు దర్యాప్తు చేస్తున్నారు. దీని వయసు సంవత్సరం కూడా లేదని, దీని మృతిపై దర్యాప్తు చేస్తున్న బిచో డాగువా ఇన్స్టిట్యూట్ సభ్యులు చెబుతున్నారు. ఏడాది వయసు కూడా లేని ఈ భారీ సైజు తిమింగలం ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ఆత్మవిమర్శ కోసం అడవికి!
ముంబై: యువకుడిగా ఉన్న రోజుల్లో తాను ప్రతీ దీపావళికి ఐదు రోజులపాటు అడవిలోకి ఒంటరిగా వెళ్లి ఆత్మవిమర్శ చేసుకునేవాడినని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆ అలవాటు కారణంగానే తనకు ఇప్పటికీ జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లను ఎదుర్కొనే శక్తి లభిస్తోందని తెలిపారు. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే ఫేస్బుక్ పేజీకి ఇచ్చిన ఇంట ర్వ్యూలో మోదీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ వివరాలను ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ బుధవారం ప్రచురించింది. అందులో కొంత భాగాన్ని మోదీ తన ట్విట్టర్ ఖాతాలోనూ పోస్ట్ చేశారు. ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ ‘ఈ విషయం ఎక్కువ మందికి తెలియదు. ఆ రోజుల్లో ప్రతీ దీపావళికి నేను ఐదు రోజులపాటు దూరంగా వెళ్లే వాణ్ని. అడవిలో ఏదో ఒక చోట, ఎక్కడైతే స్వచ్ఛమైన నీరు తప్ప మనుషులు ఉండరో అక్కడకు చేరుకునే వాణ్ని. ఇన్నాళ్లూ ఏం చేశాను, ఇకపై ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏ పని చేయాలి తదితర అన్ని విషయాలపై అంతర్మథనం చేసుకునే వాడిని. నేను వెళ్లిన చోట వార్తా పత్రికలు కానీ, రేడియో కానీ ఉండేది కాదు. ఇక టీవీ, ఇంటర్నెట్ ఆ రోజుల్లో అసలు లేనే లేవు’ అని అన్నారు. యువత సమయం కేటాయించుకోవాలి ఈనాటి యువత కాస్తంత తీరిక కూడా లేకుండా తమ జీవితాన్ని గడుపుతున్నప్పటికీ, వారు కూడా ఎప్పుడో ఒకసారి కొంత సమయాన్ని కేటాయించుకుని అంతర్మథనం చేసుకోవాలని మోదీ కోరారు. అలా చేయడం వల్ల యువత ఆలోచనా దృక్పథం మారుతుందనీ, వారికా వారే బాగా అర్థమవుతారనీ, మరింత ఆత్మవిశ్వాసం రావడంతోపాటు ఇతరులు మీ గురించి ఏమనుకున్నా చలించని మనస్తత్వం అలవడుతుందన్నారు. ఏం చేయాలో తెలీక హిమాలయాలకు.. చిన్నతనంలోనే తాను రెండేళ్లపాటు హిమాలయాలకు వెళ్లిన విషయంపై కూడా మోదీ చెప్పారు. ‘నేను జీవితంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఏ మార్గాన్నీ ఎంచుకోలేదు. అంతా అస్పష్టతే. నేను ఎక్కడికి వెళ్లాలో నాకే తెలీదు. ఏం చేయాలో తెలీదు. ఎందుకు చేయాలో తెలీదు. కానీ ఏదో ఒకటి చేయాలన్నది మాత్రమే నాకు అప్పుడు తెలుసు. కాబట్టి నాకు నేనుగా భగవంతుడికి అంకితమయ్యాను. 17 ఏళ్ల వయసులోనే హిమాలయాలకు వెళ్లాను. ఆ తర్వాత దేవుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లాను’ అంటూ మోదీ తన గతం గురించి గుర్తుచేసుకున్నారు. ‘నా జీవితం ఎటు వెళ్లాలో నిర్ణయమవ్వని దశ అది. అయినా అనేక ప్రశ్నలకు జవాబులు దొరికాయి. ప్రపంచాన్ని, నన్ను నేను అర్థం చేసుకున్నా. రామక్రిష్ణ మిషన్‌లో కా లం గడిపా. నాలో నేనే ఏదో కొత్తది కను గొన్నా. బ్రహ్మ ముహూర్తంలోనే, వేకువ జాము న3–3.45 మధ్యలో నిద్రలేచి, గడ్డకట్టే నీటితోనే హిమాలయాల్లో స్నానం చేసే వాడిని. శాంతి, ఏకాంతం, ధ్యానాన్ని ఒక జలధార శ బ్దంలోనూ మనం పొందొచ్చని అర్థం చేసుకున్నా. ప్రకృతి తరంగాలతో ఎలా మమేకమవ్వాలో అక్కడి సాధువులు నేర్పారు’ అని చెప్పారు. ఎర్రకోటలో నేతాజీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మోదీ -
‘ప్రతి ఏడాది అడవిలో 5 రోజులుండేవాడిని’
న్యూఢిల్లీ : ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా ఉన్నప్పుడు వంట చేయడమే కాక పాత్రలను కూడా శుభ్రం చేసివాడినంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోదీ. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే ఫేస్బుక్ పేజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను యువకుడిగా ఉన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. మోదీ మాట్లాడుతూ.. ‘పదిహేడేళ్ల వయసులో హిమాలయాలకు వెళ్లి దాదాపు రెండేళ్లపాటు అక్కడే గడిపాను. ఈ పర్యట వల్ల నాలో చాలా మార్పు వచ్చింది. హిమాలయాల నుంచి వచ్చిన తర్వాత నా జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. మోదీ మాట్లాడుతూ.. ‘ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత అహ్మదాబాద్ వెళ్లాను. అంత పెద్ద నగరంలో జీవించడం అదే మొదటిసారి. అక్కడ ఉన్న మా బంధువుల క్యాంటీన్లో కొన్ని రోజులు పనిచేశాను. అదే సమయంలో ఆర్ఎస్ఎస్లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా మారాను. అప్పుడే ప్రజల జీవితాల గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. ఇతరులతో కలిసి ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని శుభ్రం చేయడం.. టీ,ఆహారం తయారు చేయడం, పాత్రలు శుభ్రం చేయడం లాంటి పనులన్ని చేసేవాడిన’న్నారు. అయితే రోజువారి కార్యక్రమాలలో పడిపోయి జీవితంలో సంపాదించుకున్న ప్రశాంతతను కోల్పోకూడదని భావించేవాడిని. అందుకే కొన్ని రోజుల పాటు అడవిలోకి వెళ్లి ఒంటరిగా గడిపేవాడనని తెలిపారు మోదీ. ఈ విషయం గురించి మోదీ మాట్లాడుతూ.. ‘యువకుడిగా ఉన్నప్పుడు ఏటా దీపావళి సమయంలో ఐదు రోజుల పాటు అడవిలోకి వెళ్లిపోయి, ఎవ్వరూ లేని చోటుకు వెళ్లి ప్రశాంతంగా గడిపేవాడిని. దీనికోసం స్వచ్ఛమైన నీరు ఉన్న చోటును ఎంచుకునేవాడిని. అంతేకాక 5 రోజులకు సరిపడా ఆహారం వెంట తీసుకెళ్లేవాడిని. ఈ ఐదు రోజులు రేడియో, దినపత్రికలు ఏమీ లేకుండా గడిపేవాడినని తెలిపారు మోదీ. ఇలా చేయడం వల్ల తనకు ఎంతో మేలు జరిగిందని.. తనను తాను మెరుగుపరుచుకోవడానికి ఎంతో ఉపయోగపడిందన్నారు మోదీ. అయితే కొద్ది రోజుల తర్వాత తాను అడవికి వెళ్తున్నానే విషయం మిగతా వారికి తెలిసి పోయిందన్నారు. దాంతో వారు నన్ను ఎవరిని కలవడానికి వెళ్తున్నావు అని అడిగేవారు. అందుకు నేను ‘నన్ను నేను తెలుసుకునేందుకు వెళ్తున్నాను’ అని చెప్పేవాడినని తెలిపారు మోదీ. యువతకు కూడా ఇదే సలహా ఇచ్చారు మోదీ. రోజువారీ హడావుడి జీవితాలకు విరామం ఇచ్చి.. కొంత సమయం మీతో మీరు గడిపితే అది ఎంతో ఉపయోగపడుతుందంటూ మోదీ యువతకు సలహా ఇచ్చారు. అప్పుడే నిజమైన ప్రపంచంలో జీవించడం మొదలుపెడతారన్నారు. అప్పడు మీపై మీకు నమ్మకం పెరుగుతుందని, ఇతరులు మీ గురించి ఏం చెప్తున్నారో అర్థం చేసుకోగలుగుతారని సూచించారు. మీకు మీరే ప్రత్యేకమని, ఎవరో ఏదో చేస్తారని ఎదురుచూడొద్దని మోదీ పేర్కొన్నారు. -
అడవుల్లో అద్భుతాన్ని కనిపెట్టిన బాలుడు!
మెక్సికో: శాటిలెట్ ఫొటోల ఆధారంగా ఓ బాలుడు అద్భుతాన్ని ఆవిష్కరించాడు. దట్టమైన అడవుల్లో నిక్షిప్తమైన, ఎవ్వరికీ కనపడకుండా మరుగున పడిపోయిన మయన్ నగరాన్ని గుర్తించాడు. మాయ నాగరికతకు చెందిన చరిత్ర ఆధారంగా పరిశోధనలు చేశాడు. సెంట్రల్ అమెరికాకు చెందిన మెక్సికన్ పర్వత ప్రాంతంలో వేల ఏళ్ళనాడు మరుగున పడిపోయిన నగరాన్ని 15ఏళ్ళ విలియమ్స్ గడౌరీ గుర్తించాడు. ఇప్పటివరకూ పరిశోధకుల కంట కూడ పడని దట్టమైన అడవులు, కొండలు, గుట్టల్లో దాగి ఉన్న ఆ అద్భుత 'మాయ' నగరాన్ని శాటిలెట్ చిత్రాల ద్వారా గుర్తించిన బాలుడు... ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. ప్రాచీన కళలు, సంస్కృతి ప్రతిబింబించే కట్టడాలు, అద్భుత నిర్మాణాలు ఇప్పుడా నగరంలో బయటపడి, వేల యేళ్ళ చరిత్రకు ఆనవాళ్ళుగా మారాయి. 2014 సంవత్సరంలోనూ పురావస్తు శాఖ వారు రెండు పురాతన పట్టణాలను కనుగొన్నారు. అయితే అప్పట్లో అడవుల్లో దాగి ఉన్న ఈ నగరాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. తాను చదివిన ఓ పుస్తకం ఆధారంగా ఆ అదృశ్య నగరాన్ని గుర్తించినట్లు విలియమ్స్ గడౌరీ చెప్తున్నాడు. మాయ నాగరికత నాటి నిర్మాణాలన్ని మారుమూల ప్రాంతాలు, దట్టమైన అడవులు, పర్వతాల నడుమే ఉన్నట్లు తెలుసుకున్న అతడు... అలా ఎందుకు నిర్మించేవారో తెలుసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ విషయంపై అధ్యయనాలు ప్రారంభించాడు. ఆ కాలంలో ప్రజలు నక్షత్రాలను ఎక్కువగా పూజించేవారని తెలుసుకుని ఆదిశగా అధ్యయనాలను మొదలు పెట్టాడు. నక్షత్రాల ఆధారంగా నగరాలను గుర్తించవచ్చన్న కోణంలో అడుగులు వేశాడు. గడౌరీ అనుకున్నట్లుగానే ఇప్పటిదాకా గుర్తించిన నగరాలన్నీ 22 నక్షత్ర సమూహాల స్థానంలోనే ఉన్నట్లు గుర్తించాడు. కానీ ఇంతకు ముందు పరిశోధకులు గుర్తించిన వాటిలో ఓ నగరం మిస్ అయినట్లు తెలుసుకున్న అతడు.. గూగుల్ ఎర్త్ ఆధారంగా పరిశోధనలు కొనసాగించి, రాడార్ శాట్-2 ఉపగ్రహ చిత్రాలద్వారా అడవుల్లో దాగిఉన్న అద్భుతాన్ని కనుగొన్నట్లు తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మానవమాత్రులు అడుగు పెట్టలేని అ మారుమూల యుకాతాన్ అడవుల్లోని నగరానికి తాను.. కాక్ చి అని గాని, మౌత్ ఆఫ్ ఫైర్ అనిగాని కొత్త పేరు పెట్టాలని కూడ భావిస్తున్నాడు. అయితే ఆ నగరం మానవ నిర్మితంగానే కనిపిస్తోందని, అయితే ప్రపంచం ఈ నంగరం ద్వారా కొత్త ఆవిష్కణను చూసే అవకాశం ఉందని న్యూ బ్రున్స్విక్ విశ్వవిద్యాలయం రిమోట్ సెన్సింగ్ లేబొరేటరీకి చెందిన డాక్టర్ ఆర్మాండ్ లా రాక్యూ చెప్తున్నారు. శాటిలెట్ చిత్రాల్లోని ఒక ఫొటో అక్కడి నిర్మాణాలు చతురస్రాకారంలో పిరమిడ్ ను పోలి ఉన్నట్లుగా తెలుస్తోందని చెప్తున్నారు. విలియమ్స్ కనుగొన్న పద్ధతిలో మాయన్ నగరం ఆధారంగా పురాతత్వవేత్తలు మరిన్ని నగరాలను కూడ గర్తించే అవకాశం ఉందన్నారు. తన కొత్త ఆవిష్కరణలను సైంటిఫిక్ జనరల్ లో ప్రచురించిన విలియమ్స్... 2017 లో జరిగే బ్రెజిల్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించనున్నట్లు కూడ తెలుస్తోంది. -
ధీర... ధీర... ధీర... మనసాగ లేదురా!
శివాజీ, తానాజీ అడవి దారిలో వెళ్తున్నారు. అకస్మాత్తుగా వాళ్ళపై మొఘలాయి సైన్యం దాడి చేసింది. కొంచెం దగ్గర్లోనే సింహ్‌గఢ్ కోట. అక్కడకు వెళ్లగలిగితే ఫిరంగులతో సైన్యాన్ని పేల్చిపారేయొచ్చు. అందుకే తానాజీ ఒంటరిగా సైన్యాన్ని ఎదుర్కొంటూ, శివాజీని కోటలోకి పంపించాడు. ఇక్కడ తానాజీ ‘ఒకటీ... రెండూ... మూడు’ అని లెక్కపెడుతూ, శత్రువుల్ని వరుసపెట్టి నరికేసి, తానూ చనిపోయాడు. అప్పుడు శివాజీ వచ్చి, ‘గఢ్ మిల్గయా, మగర్ సింహ్ చలాగయా’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఇదో మరాఠీ సినిమా. చూసి థ్రిల్లయిపోయాడు విజయేంద్రప్రసాద్. తానాజీ పాత్ర ఆయనను చాలాకాలం వెంటాడుతూనే ఉంది. తానాజీ లాంటి వీరుడు మళ్లీ పుడితే? విజయేంద్ర ప్రసాద్ మైండ్‌లో కథ పురుడు పోసుకుంటోంది. సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా సాగర్ దర్శకత్వంలో ‘జగదేకవీరుడు’ సినిమా. దీనికి విజయేంద్ర ప్రసాద్ కథ ఇవ్వాలి. కొడుకు రాజమౌళి స్టోరీ అసిస్టెంట్. ఈ కథ చేస్తుంటే అనుక్షణం తానాజీ గుర్తొస్తున్నాడు. ఓ రాజమాత. ఆమెను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే ఓ బాడీగార్డ్. రాజమాతపై ఓ వందమంది యోధులు ఎటాక్ చేస్తే, ఎదురొడ్డి పోరాడి, అసువులు బాశాడు బాడీగార్డ్. మళ్లీ 400 ఏళ్ల తర్వాత పుట్టాడు. రాజమాత కూడా మళ్లీ పుట్టింది. మేధా పాట్కర్ లాంటి సోషల్ వర్కర్లా ఎదిగిన ఆమె ముఖ్యమంత్రి కావడం కోసం బాడీగార్డ్ ఎంతో పోరాడి, ఆమె లక్ష్యాన్ని నెరవేరుస్తాడు.క్లుప్తంగా ఇదీ కథ. దర్శక నిర్మాతలకు నచ్చలేదు. దాంతో ఇంకో రైటర్ ఎంటర య్యాడు. ఇక్కడ రాజమౌళిని మాత్రం ఈ కథ హాంట్ చేస్తూనే ఉంది. చిరంజీవి ఇల్లు - అక్కడ్నుంచీ చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపిస్తోంది. చిరంజీవి, అల్లు అరవింద్, రామ్‌చరణ్, రాజమౌళి... నలుగురే కూర్చుని ఉన్నారు. ‘‘సారీ సర్! చరణ్ లాంచింగ్ ప్రాజెక్ట్ చేయలేను. మీ అబ్బాయి ఫస్ట్ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉంటాయి. నేను ఎంతవరకు నెరవేర్చ గలనో చెప్పలేను. సెకండ్ సినిమా అయితే ఓకే’’ అని చెప్పేశాడు రాజమౌళి. కట్ చేస్తే - రామ్ చరణ్ ఫస్ట్ సినిమా ‘చిరుత’ పూరి జగన్నాథ్ డెరైక్షన్‌లో తయారైంది. హండ్రడ్ డేస్ ఫిల్మ్. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్. ఇప్పుడు చరణ్ సెకండ్ ఫిల్మ్ రాజమౌళి చేతిలో ఉంది. చిరంజీవి ఇల్లు... సేమ్ ఫోర్ మెంబర్స్. రాజమౌళి కాన్సెప్ట్ చెబుతున్నాడు. వందమంది యోధుల్ని ఓ మగధీరుడు ఎంత వీరోచితంగా తెగ నరుకుతున్నాడో కళ్లకు కట్టినట్టుగా చెబుతున్నాడు. చిరంజీవి అదిరిపోయాడు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఆయన రాజమౌళితో ఒకటే చెప్పారు. ‘‘చిరంజీవి నాకెన్నో హిట్స్ ఇచ్చారు. ఆయనకో అద్భుతమైన కానుక ఇవ్వాలి. అలాగే నా మేనల్లుడు... హిస్టరీలో నిలిచిపోవాలి. ఎంత ఖర్చయినా ఫర్లేదు. నీ ఇష్టం’’ రాజమౌళికి ఫుల్ ఫ్రీడమ్ గ్రాంటెడ్. రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చున్నారు. ‘‘పదిహేనేళ్ల క్రితం కథ అది. నీకింకా గుర్తుందా?’’ ఆసక్తిగా అడిగారు విజయేంద్ర ప్రసాద్. ‘‘అవును నాన్నా! ఎప్పటికైనా ఆ బాడీగార్డ్ కథతో సినిమా చేద్దామని కాచుకుని కూర్చున్నా. ఇప్పుడు టైమ్ కుదిరింది. చరణ్ హార్స్ రైడింగ్ స్పెషలిస్టు. తనకు ఇలాంటి కథే కరెక్టు’’ చెప్పాడు రాజమౌళి.‘‘చిరంజీవిగారి ‘ఘరానా మొగుడు’లోని ‘బంగారు కోడిపెట్ట’ సాంగ్‌ని ఇందులో రీమిక్స్ చేద్దాం’’ కీరవాణిగారి భార్య శ్రీవల్లి ఐడియా ఇది. ఆ ఫ్యామిలీస్‌లో వల్లి మాటే వేదం. వదినగారి ఐడియాకు రాజమౌళి గ్రీన్ సిగ్నల్. కథ రెడీ అవుతోంది. కొంత జానపదం. కొంత సాంఘికం. పునర్జన్మల నేపథ్యం. రాజమాత కాస్తా రాజకుమారి అయిపోయింది. చరణ్ ఇమేజ్‌కి, బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా కథలో మలుపులు. ఓపెనింగ్ సీన్ నుంచే అటెన్షన్ డ్రా అవ్వాలి. రాజమౌళి తన రైటర్స్ టీమ్‌తో కూర్చుని వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ తీసిన టీవీ సీరియల్స్ అన్నీ వాచ్ చేస్తున్నాడు రాజమౌళి. హిచ్‌కాక్ టేకింగ్ స్టయిల్ చాలా డిఫరెంట్. కాన్సెప్ట్ ఏంటో ఫస్ట్ సీన్లోనే చెప్పేస్తాడు. ఆ తర్వాత ఆసక్తికరంగా చిక్కుముళ్లు వేస్తూ, విప్పుతూ ఉంటాడు. ఈ నేరేటివ్ స్టయిల్ రాజమౌళికి విపరీతంగా నచ్చేసింది. అదే ఫాలో అయితే..? అంతే... ఓపెనింగ్ సీన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. హీరో హీరోయిన్లు ఫస్ట్ సీన్లోనే పర్వతాలపై నుంచి పడి చనిపోతారు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఫైనల్‌గా ‘మగధీర’ స్టోరీ రెడీ. రాజకుమారి మిత్రవింద. అదిరిపోయే అందం. అలాంటి హీరోయినే కావాలి. రాజమౌళి కళ్లు వెతుకుతున్నాయి. తమన్నా... ఇలా చాలామంది. ఎవ్వరూ కనెక్ట్ కావడం లేదు. ఆయన వ్యూ ఫైండర్లో కాజల్ అగర్వాల్ కనబడింది. ‘యమదొంగ’లో ఫస్ట్ కాజల్‌నే అడిగారు. డేట్లు కుదర్లేదు. ఇప్పుడామె రెడీ.షేర్‌ఖాన్ పాత్రకు స్క్రిప్టు దశలోనే శ్రీహరి పేరు లాక్ చేసేశాడు రాజమౌళి. విలన్ పాత్రకు మాత్రం కొత్తవారినే వెతుకుతున్నాడు. దేవ్‌గిల్. ‘కృష్ణార్జున’ సినిమాలో యాక్ట్ చేశాడు. పెద్ద పేరు లేదు. ఈ క్యారెక్టర్‌కి బానే ఉంటాడు కానీ, హార్స్ రైడింగ్ అంటే దడ, వణుకు. ఇది తనకు గోల్డెన్ చాన్స్ అని దేవ్గిల్కు తెలుసు. అందుకే వదులుకోకూడదు. రాత్రింబవళ్లు హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ చేశాడు. రాజమౌళి ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నీ ఒకెత్తు. ఇదొక ఎత్తు. అన్‌కాంప్రమైజింగ్ టీమ్ కావాలి. గ్రాఫిక్స్ అదిరిపోవాలంటే వీఎఫ్ఎక్స్ టీమ్ బ్రహ్మాండంగా కుదరాలి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా! రాజమౌళి తలుచుకుంటే టీమ్‌కు కొరతా! కెమెరామ్యాన్ సెంథిల్, ఆర్ట్ డెరైక్టర్ రవీందర్‌రెడ్డి, ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్, వీఎఫ్ఎక్స్ హెడ్ కమల్ కణ్ణన్, స్టయిలింగ్ రమా రాజమౌళి. వీళ్లందరికీ పెద్ద దిక్కు మ్యూజిక్ డెరైక్టర్ కీరవాణి. వర్క్ స్టార్ట్! షూటింగ్లో చాలాభాగం ఆర్ఎఫ్సీలోనే. కొన్ని రియల్ లొకేషన్స్, కొంత గ్రాఫిక్స్. ఉదయ్‌గఢ్ కోట కట్టాలి. ఇరాన్ నుంచి ఓ ఎక్స్పర్ట్ వచ్చాడు. గద్ద షేప్‌లో డిజైన్ ఇచ్చాడు. కొద్దిభాగం సెట్ వేయడానికే త్రీ మంత్స్ పట్టింది. మొత్తం కోట సెట్ వేయాలంటే ఆరు నెలల పైనే అవుతుంది. అంత టైమ్ వేస్టు. గ్రాఫిక్స్ వాళ్లకు అప్పగిస్తే వాళ్లే చూసుకుంటారు. పీటర్ హెయిన్ ఫుల్ డేట్స్ తీసేసుకున్నాడు రాజమౌళి. ఫైట్లు అలా ఇలా ఉండకూడదు. కళ్లు చెదిరిపోవాలి. ముఖ్యంగా వందమంది యోధులతో ఫైటింగ్ సీక్వెన్స్. దీనికైతే షూటింగ్‌కి ముందే బోలెడంత గ్రౌండ్ వర్క్. ప్రాక్టీస్ సెషన్స్. ఈ సినిమాలో బోలెడన్ని రిస్కీ షాట్స్. పీటర్ హెయిన్ ఎక్కడా తగ్గడం లేదు. బైక్‌ను గాల్లోకి లేపే సీన్ తీస్తున్నారు. చరణ్‌కు చేసి చూపిస్తున్నాడు పీటర్ హెయిన్. ఫస్ట్ టేక్ ఓకే. కానీ చిన్న చేంజ్. సెకండ్ టేక్ చేసి చూపిస్తున్నాడు పీటర్ హెయిన్. బైక్‌తో గాల్లోకి లేచాడు. 80-90 అడుగుల ఎత్తు. ఎక్కడో చిన్న మిస్టేక్. స్ల్పిట్ సెకండ్. అంత పైనుంచి ఫోర్స్‌గా ఢామ్మని కిందపడ్డాడు. ఎన్ని ఎముకలు విరిగిపోయాయో... అసలు బతికే చాన్సుందా..? ‘కిమ్స్’లో చేర్చారు. ప్రాణభయం లేదు. కానీ ఫోర్ మంత్స్ బెడ్ మీద నుంచి కాలు దించితే కష్టమన్నారు డాక్టర్లు. పీటర్ హెయిన్ మొండోడు. నెలకే తిరిగొచ్చాడు. అదే బైక్ షాట్ మళ్లీ తీశాడు. ‘కాలభైరవ’ పాత్ర కోసం చరణ్ ఫుల్ ప్రిపేర్డ్‌గా ఉన్నాడు. బాడీ పెంచాడు. లుక్‌లో రాజసం తీసుకొచ్చాడు. నిజంగా యోధానుయోధుడిలాగానే తయార య్యాడు. రాజమౌళి చెప్పింది తు.చ. తప్పకుండా చేస్తున్నాడు. ‘మగధీర’ను అతను ఫుల్‌గా ఓన్ చేసేసుకున్నాడు. రాజస్థాన్ ఎడారిలోని లొకేషన్స్ కోసం వెళ్లినప్పుడు తగిలింది బాదల్. సింహం లాంటి గుర్రం. కన్నుమూసి తెరిచేలోపు ఆమడ దూరం పరిగెడుతుంది. కానీ జగమొండి. అస్సలు మాట వినదు. చరణ్ ఆ గుర్రానికి ఫ్యాన్ అయి పోయాడు. ‘‘ఈ గుర్రం నాక్కావాలి’’ అన్నాడు. దాంతోనే షూటింగ్. వాటర్ ఫాల్స్ నుంచి జంప్ చేసే షాట్లో కొంచెం వైల్డ్‌గా రియాక్టయ్యింది. చరణ్ లిగ్మెంట్కు గాయమైంది. రెండు నెలలు బెడ్ రెస్ట్. రాజమౌళి ఓ తపస్సులా షూటింగ్ చేస్తున్నాడు. సినిమా బిగినింగ్‌లో హీరో హీరోయిన్లు పర్వతాల నుంచి పడిపోయే సీన్ కోసమైతే చాలా వర్క్ చేశాడు. షాట్ బై షాట్ రాసుకుని... రీ-రికార్డింగ్‌తో సహా స్టోరీ బోర్డ్ చేసి, గ్రాఫిక్స్ వాళ్లకు ఇచ్చాడు. షూటింగే ఓ యజ్ఞం అనుకుంటే, పోస్ట్ ప్రొడక్షన్ అంతకు మించిపోయింది. వీఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్కు సంబంధించి బోలెడంతమంది ఫ్రీ లాన్సర్స్ పనిచేస్తున్నారు. అందరికీ పీస్ వర్క్‌లు. మళ్లీ వాళ్లందర్నీ కో-ఆర్డినేట్ చేయడం. వర్క్ అంతా ఒకే చోట జరిగితే ఓకే కానీ, రకరకాల ప్లేసుల్లో... రకరకాల మనుషులతో చేయించుకోవడమంటే నిజంగా నరకం. కానీ రాజమౌళి భరిస్తున్నాడు. చివరిక్షణం వరకూ మంచి ఫలితం కోసం పోరాడుతూనే ఉన్నాడు. రిలీజ్‌కు రెండ్రోజుల ముందు కూడా కొన్ని షాట్స్ నచ్చక బెటర్ చేయించుకున్నాడు. రిలీజ్ ముందురోజు రాత్రే హైదరాబాద్ బంజారాహిల్స్ సినీమ్యాక్స్ లో ప్రివ్యూ వేశారు. పిన్‌డ్రాప్ సెలైన్స్. తుపాను ముందర ప్రశాంతత అంటే ఇదేనేమో! ఆ తర్వాత తుపాను ఆగలేదు. పాత రికార్డులన్నీ చెల్లాచెదురు. వంద రోజుల వరకూ హౌస్‌ఫుల్సే. 223 థియేటర్లలో హండ్రడ్ డేస్. కోట్లకు కోట్ల వసూల్. అమ్మో... అమ్మో... అమ్మో! తెలుగు సినిమాకు ఇంత డబ్బా!? నిజమే! అద్భుతాలు కొన్నిసార్లే జరుగుతాయి. -
సినీమృగాయణం!
నేడు జంతు హక్కుల దినోత్సవం ఆ రోజు అడవిలో జంతువులన్నీ చేరి సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాయి. ‘‘సినిమా సక్సెస్ కావాలంటే నేనో, నా గురించి పాటో ఉండి తీరాల్సిందే’’ అంది కోడి. ‘‘అదెలా?’’ అడిగింది బాతు. ‘‘ఓసోసీ పిల్లకోడి పెట్టా... అనీ, బంగారు కోడి పెట్ట వచ్చెనమ్మా... అనే పాటల వల్లనే ఆ సినిమాలు హిట్టయ్యాయి. ఆ సెంటిమెంట్ కొద్దే మగధీరలో కోడి పాట మళ్లీ పెట్టారు. దీన్నిబట్టి కోళ్లు అంటేనే బ్లాక్‌బస్టర్ ఫార్ములా అని తెలీడం లేదూ!’’ అంది కోడి. ‘‘చాల్లే ఊరుకో... బంగారూ బాతుగుడ్డూ... అంటూ మా జాతిని తలుచుకోబట్టే వేటగాడు హిట్టయ్యింది. ఫో... ఫో... నీ బోడి గొప్పలూ, నువ్వూనూ’’ అంటూ ఈసడించింది బాతు. ‘‘మీ ఇద్దరూ తప్పే... ఓసోసీ పిల్లకోడి పెట్టా... అన్న పల్లవిలో వెంటనే ‘నా వయ్యారీ పావురాయి పిఠ్ఠా’ అంటారు ఎన్టీఆర్. అంటే కోడి ఫోర్సు సరిపోక పావురాళ్లను వాడుకున్నారన్నమాట’’ అంటూ తన గొప్ప చెప్పుకుంటూ వాదనకు దిగింది పావురాయి పిట్ట. ఈలోపు సరసరా పాక్కుంటూ వచ్చింది నాగుపాము. ‘‘సినిమా బ్లాక్‌బస్టర్ కావాలంటే నాగుపాము ఉండి తీరాల్సిందే. ‘నోము’ లాంటి అలనాటి చిత్రాల నుంచి ‘నగీనా’ లాంటి సినిమాల వరకూ అన్నింట్లో నేనుండాల్సిందే. అనకొండ అనీ... అది మాకు దూరబ్బంధువులే! సాక్షాత్తూ హాలీవుడ్ వాళ్లూ మా రిలేటివ్ అయిన దాన్ని పెట్టి సినిమాలు తీస్తుంటారు తెల్సా’’ అంటూ కస్సు ‘బుస్సు’మంది పాము. ‘‘విలన్ అబద్ధాలకు నీ రెండు నాల్కలను ఉదాహరణగా చూపిస్తారు. ఫో... ఫో... నీ గొప్పలూ నువ్వూనూ’’ అంటూ విసుక్కున్నాయి పిట్టలు. ‘‘అలనాటి రాజుల సినిమాల నుంచి ఇవ్వాళ్టి మగధీర వరకూ హార్స్ ఉందంటే సినిమాలో ఫోర్స్ ఉన్నట్లే’’ అన్నాయి గుర్రాలు. ఇంతలో గాండ్రిస్తూ సీన్లోకి ఎంటరైంది పులి. ‘‘ఆగండాగండి. ఎంత పెద్ద హీరో అయినా నాతో పోల్చుకోవాల్సిందే. ‘పులితో ఫొటో దిగాలనుకున్నావనుకో కాస్త రిస్కయినా పర్లేదు గానీ... చనువిచ్చింది కదా అని పులితో ఆడుకున్నావనుకో...’ అంటూ నాతో గేమ్సాడితే జరిగే పరిణామాలను చెప్పకనే చెబుతాడు హీరో’’ అంటూ తన గొప్పల్ని చెప్పింది పులి. ‘‘ఆపండెహె మీ గోల. మీ అందరికంటే నేనే గొప్ప. మాతో పోల్చుకుంటూ హీరో ఏమంటాడో తెల్సా... ‘అడవిలో సింహం... ఇక్కడ నేనూ సేమ్ టు సేమ్ రా. అది గెడ్డం చేసుకోదు... నేను గెడ్డం చేసుకుంటానంతే’ అంటాడు. దీన్నిబట్టి తెలిసేదేమిటి? సింహం ప్రస్తావన ఉంటేనే సినిమాకు సింహబలమొస్తుందన్నమాట’’ గొప్పలు పోయింది సింహం. ఈలోపు బొద్దింక గొంతు సవరించుకుంది. అంతే... అక్కడున్న జంతువులన్నీ ఒక్కసారిగా నవ్వాయి. ‘‘నీకు ఇక్కడ మాట్లాడే సీన్ లేదు. ఫో’’ అంటూ కసురుకున్నాయి జంతువులు. ‘‘మీరంతా మీ ఇండివిడ్యువల్ గొప్పలు చెప్పుకొన్నారు. నేనలా కాదు... ప్రేమే నా మార్గం. సీన్లో నేను కనబడీ కనబడగానే హీరోయిన్ ఎగిరి హీరో అక్కున చేరి ముద్దుముద్దుగా...‘బొద్దింక... అదంటే నాకు భయం’ అంటుంది. అంతే...! అప్పటివరకూ హీరో హీరోయిన్ల మధ్య సెలైంట్‌గా లేటెంట్గా ఉన్న ప్రేమ కాస్తా పెల్లుబికి డ్యుయెట్‌లా పారుతుంది. ఇలా పాట పెట్టడానికి డెరైక్టర్‌కి అవకాశం ఇచ్చేది ఎవరో తెల్సా? నేనే’’ అంటూ మీసాలు తిప్పింది బొద్దింక. ఆ మాటకొస్తే... తన టైటిల్ తోనే తనపై ఫుల్ లెంత్ సినిమా తీశారని ఈగా, ఐశ్వర్యా రాయ్ మెప్పు కోసం సాక్షాత్తూ రోబోయే తమను పట్టుకోడానికి అవస్తలు పడ్డాడని దోమలు సైతం సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాయి. ‘‘ఇలా ఎవరి గొప్పలు వాళ్లమే చెప్పుకుంటూ పోతే ఎలా? మన గొప్పను సినీరంగమూ గుర్తించాలి కదా. అందుకు ఏం చేయాలో నక్కను అడుగుదాం. అందరిలోకీ తెలివైనది అదేకదా’’ అని ఒక నిర్ణయానికి వచ్చాయి జంతువులన్నీ. సరే అని నక్క తన సలహా ఇలా చెప్పింది... ‘‘మొన్న హుద్‌హుద్ తుఫాను వచ్చినప్పుడు పరిశ్రమలోని పెద్ద సార్లూ, పెద్ద స్టార్లూ, చిన్న నటులంతా ‘మేము సైతం’ అంటూ సహాయం చేశారు కదా. మరి వాళ్ల సినిమాల హిట్ల కోసం మనం సైతం కష్టపడుతున్నాం కదా. కాబట్టి జంతుహక్కుల కోసం వాళ్లు ఏదైనా చేస్తారేమో చూద్దామా? ఎందరు స్టార్లు... సినిమాల్లో తమకు అండగా ఉండే ఈ జంతువుల సంక్షేమం కోసం పాటుపడతారో లేక సామాన్య జనాలే జంతువులకు సాయం చేసి నిజజీవితంలో రియల్ హీరోలవుతారో చూద్దాం! అంటూ ఓ ఊళ వేసింది నక్క. - యాసీన్