
బాలీవుడ్‌లో విద్యుత్ జమాల్‌కు యాక్షన్ హీరోగా మంచి పేరుంది. గత ఏడాది జమాల్ నటించిన ‘జంగిల్’ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారాయన. కొన్ని కళరిపయ్యట్టు స్టంట్స్‌ని అద్భుతంగా చేసి యాక్షన్ మూవీ లవర్స్ మనసు గెల్చుకున్నారు జమాల్. ఈ సినిమాకు రెండు ప్రతిష్టాత్మకమైన జాకీచాన్ అవార్డులు వచ్చాయి. చైనాలో జరిగిన జాకీచాన్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ వీక్‌లో భాగంగా ఇండియన్ చిత్రం ‘జంగిల్’కు రెండు అవార్డులు లభించాయి.
బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రాఫర్, బెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఫిల్మ్ విభాగాల్లో ఈ అవార్డులు వచ్చాయి. ‘‘దాదాపు 150 చిత్రాలతో పోటీ పడి మా సినిమా అవార్డ్స్ గెలుచుకోవడం ఆనందంగా ఉంది. ఇండియన్ యాక్షన్ సినిమాకు మరోసారి మంచి గుర్తింపు దక్కినట్లుగా ఉంది. మేం చైనాలో స్టార్స్ అయిపోయామనే భావన కలుగుతోంది. క్రిస్ టుక్కర్ (చైనీస్ యాక్షన్ హీరో) కూడా మా యాక్షన్ సీన్స్‌ను మెచ్చుకున్నారు’’ అని పేర్కొన్నారు విద్యుత్.
Comments
Please login to add a commentAdd a comment