International film
-
యాక్షన్ అవార్డ్స్
బాలీవుడ్లో విద్యుత్ జమాల్‌కు యాక్షన్ హీరోగా మంచి పేరుంది. గత ఏడాది జమాల్ నటించిన ‘జంగిల్’ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారాయన. కొన్ని కళరిపయ్యట్టు స్టంట్స్‌ని అద్భుతంగా చేసి యాక్షన్ మూవీ లవర్స్ మనసు గెల్చుకున్నారు జమాల్. ఈ సినిమాకు రెండు ప్రతిష్టాత్మకమైన జాకీచాన్ అవార్డులు వచ్చాయి. చైనాలో జరిగిన జాకీచాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్‌లో భాగంగా ఇండియన్ చిత్రం ‘జంగిల్’కు రెండు అవార్డులు లభించాయి. బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రాఫర్, బెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఫిల్మ్ విభాగాల్లో ఈ అవార్డులు వచ్చాయి. ‘‘దాదాపు 150 చిత్రాలతో పోటీ పడి మా సినిమా అవార్డ్స్ గెలుచుకోవడం ఆనందంగా ఉంది. ఇండియన్ యాక్షన్ సినిమాకు మరోసారి మంచి గుర్తింపు దక్కినట్లుగా ఉంది. మేం చైనాలో స్టార్స్ అయిపోయామనే భావన కలుగుతోంది. క్రిస్ టుక్కర్ (చైనీస్ యాక్షన్ హీరో) కూడా మా యాక్షన్ సీన్స్‌ను మెచ్చుకున్నారు’’ అని పేర్కొన్నారు విద్యుత్. -
ప్రొఫెసర్ కత్రినా కత్తి తప్పితే!
ఇప్పుడు మనం కత్రినా కైఫ్‌ను ‘గ్లామర్ డాల్’గా మాత్రమే పరిమితం చేయలేం. గతంతో పోల్చితే ఆమె నటనలో పరిణతి వచ్చింది. పాత్రలను ఎంచుకోవడంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. నృత్యంలోనూ మంచి ప్రతిభ చూపుతుంది. మార్షల్ ఆర్ట్స్ సూపర్‌స్టార్ జాకీ చాన్ సరసన ‘కుంగ్ ఫూ యోగ’ అనే అంతర్జాతీయ చిత్రంలో కత్రినా నటిస్తుంది. కేవలం గ్లామర్ కోసం కాకుండా హీరోకి సరిసమానంగా కత్రినా పాత్రను తీర్చిదిద్దాడట డెరైక్టర్ స్టాన్లీ టాంగ్. ఈ సినిమాలో ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్న కత్రినా మార్షల్ ఆర్ట్స్‌లో కూడా తన సత్తా చూపనుందట. సల్మాన్‌ఖాన్ ‘ఏక్తా టైగర్’ సినిమాలో కొన్ని యాక్షన్ సీన్లు చేసింది కత్రినా. ఇప్పుడు అంతకంటే ఎక్కువ సీన్లు ‘కుంగు ఫూ యోగ’లో చేయనుందట. దీని కోసం జాకీ చాన్ దగ్గర శిక్షణ కూడా తీసుకోవడానికి ఆసక్తి చూపుతుందట. అంతేనా...మార్షల్ ఆర్ట్స్‌కు సంబంధించిన పుస్తకాలను కూడా తెగ చదివేస్తుందట. వచ్చే సంవత్సరం ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈలోపే కొందరు బాలీవుడ్ డెరైక్టర్లు కత్రినాను దృష్టిలో పెట్టుకొని మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో కథలు రాసుకోవడం మొదలుపెట్టారట!