Vidyut Jammwal
-
నటుడి నగ్న ఫోటోలు.. మీరు అలా ఎందుకు చేయకూడదు?
గతంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నగ్నంగా ఓ మేగజైన్ కవర్ ఫోటోగా ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ విషయంపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అయితే ఆయన బాటలోనే మరో బాలీవుడ్ నటుడు కనిపించి అందరికీ షాకిచ్చాడు. గతేడాది విద్యుత్ జమ్వాల్ తన పుట్టిన రోజు సందర్భంగా హిమాలయల్లో నగ్నంగా కనిపిస్తూ ఉన్న ఫోటోలను పంచుకున్నారు. అతని ఫోటోలపై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్ వచ్చాయి. కొందరు విమర్శించగా.. మరికొందరు మద్దతుగా పోస్టులు పెట్టారు. తాజాగా విద్యుత జమ్వాల్ ఆ ఫోటోలపై స్పందించారు. అలా ఉండడం తనకు చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. విద్యుత్ జమ్వాల్ మాట్లాడుతూ..' నాకు సొంత పనులు చేయడం అంటే చాలా ఇష్టం. నాకు నచ్చినట్లు లైఫ్‌ను ఎంజాయ్ చేయడాన్ని ఆస్వాదిస్తా. ఇష్టమైన పుస్తకాన్ని చదవడం చాలా ఇష్టం. మీరు చూసిన ఈ ఫోటోలు నేను గత 14 ఏళ్లుగా సందర్శించిన వాటిలో ఒక భాగం మాత్రమే. ఈ విషయంలో నేను గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరూ నగ్నంగా ఉండి తమ కోసం సమయం ఎందుకు కేటాయించకూడదు. మీరు అలా చేస్తే ఈ ప్రపంచంలో సిగ్గుపడని ఏకైక వ్యక్తి మీరు మాత్రమే.' అని అన్నారు. మీ నగ్న చిత్రాలపై వచ్చిన కామెంట్స్ బాధించాయా అని ప్రశ్నించగా.. 'ఇలాంటి చిన్న విషయాలు కేవలం దోమ కుట్టినట్లుగా మాత్రమే అనిపిస్తాయని అన్నారు. ఇలాంటి విమర్శలు నన్ను ఏ విధంగా బాధించవని చెప్పారు. ఎందుకంటే అది తన గురించి ఒకరి అభిప్రాయం మాత్రమేనని కొట్టిపారేశారు. కాగా.. విద్యుత్ జమ్వాల్ ప్రస్తుతం క్రాక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. My retreat to the Himalayan ranges - “the abode of the divine” started 14 years ago. Before I realised, it became an integral part of my life to spend 7-10 days alone- every year. pic.twitter.com/HRQTYtjk6y — Vidyut Jammwal (@VidyutJammwal) December 10, 2023 -
పోలీసుల అదుపులో స్టార్ హీరో.. ఫోటో వైరల్
స్క్రీన్‌పై అద్భుతమైన విన్యాసాలు చేయడంలో పేరుగాంచిన నటుడు విద్యుత్ జమ్వాల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరు అగ్రశ్రేణి మార్షల్ ఆర్టిస్టులలో ఒకరిగా ఆయన పేరుపొందారు. లూపర్ క్యూరేట్ చేసిన ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడుగా జమ్వాల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. తాజాగా రిస్కీ స్టంట్స్ చేసినందుకు గాను విద్యుత్ జమ్వాల్‌ను ముంబైలో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) బాంద్రా కార్యాలయంలో ఆయన కూర్చోని ఉన్న ఫోటో ఒకటి షోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కానీ ఆయన ఆరెస్ట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఫోటో షూటింగ్లో భాగమేనని కొందరు అంటున్నారు. కానీ ఆయన అరెస్ట్ అయ్యాడంటూ వస్తున్న వార్తలపై పోలీసులతో పాటు విద్యుత్ జమ్వాల్ కూడా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఈ విషయంపై అధికారికంగా సమాచారం ఇవ్వాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. విద్యుత్ జమ్వాల్ తన తదుపరి చిత్రం 'క్రాక్-జీతేగా తో జీగ' (CRAKK-JEETEGAA... TOH JIYEGAA ) విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. సినిమా ప్రమోషన్ ఇప్పటికే జోరుగా సాగుతోంది. ఫిబ్రవరి 9న విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, నోరా ఫతేహి, అమీ జాక్సన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆదిత్య దత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా కోసం ఆయన రియల్‌గానే కొన్ని స్టంట్స్ చేసిన విషయం తెలిసిందే. వాటిలో కొన్ని ట్రైలర్లో చూపించారు. -
ఒంటి మీద నూలు పోగు లేకుండా కనిపించి షాకిచ్చిన హీరో.. ఎందుకంటే?
టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ చిత్రం శక్తి ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు విద్యుత్ జమ్వాల్. శక్తి మూవీతో అరంగేట్రం చేసిన జమ్వాల్.. ఆ తర్వాత తెలుగులో ఊసరవెల్లి చిత్రంలోనూ నటించారు. అయితే ఆ రెండు పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత బిల్లా-2 తో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. ఫోర్స్ ద్వారా బాలీవుడ్లో అరంగేట్రం చేసిన జమ్వాల్.. కమాండో చిత్రాల సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా దక్కించుకున్నారు. హిందీలో అంజాన్, బాద్షాహో, కమాండో 2, జంగ్లీ, యారా, కమాండో -3 చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం షేర్ సింగ్ రానా, క్రాక్ అనే చిత్రాల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా నిర్మాతగా మారి స్వయంగా సినిమాలు నిర్మిస్తున్నారు. అయితే తాజాగా విద్యుత్ జమ్వాల్ చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. హిమాలయ పర్వతాల్లో నగ్నంగా ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ప్రతి సంవత్సరం 7 నుంచి 10 రోజుల సమయం ఇలా కేటాయించాలని రాసుకొచ్చారు. దాదాపు 14 ఏళ్ల క్రితం మొదలైన హిమాలయాల జర్నీ మళ్లీ ప్రారంభించినట్లు తెలిపారు. ఇది తన జీవితంలో ఓ అంతర్భాగమని తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది చూసి సంచలన డైరెక్టర్ ఆర్జీవీ స్పందించారు. మీలోని జంతువును బయటకు తీసుకురావడం ఇది చాలా సమయానుకూలమని నేను భావిస్తున్నా ...మీరు నిజంగా గ్రీకు దేవుడిలా కనిపిస్తున్నారు .. మీకు కోటి వందనాలు అంటూ రిప్లై ఇచ్చారు.. Hey @VidyutJammwal I think it’s so timely that you have brought out the ANIMAL in you …you are truly looking like a GREEK GOD ..A million salutes to you 🙏🙏🙏🙏🙏 https://t.co/czoiCxeh8n — Ram Gopal Varma (@RGVzoomin) December 10, 2023 My retreat to the Himalayan ranges - “the abode of the divine” started 14 years ago. Before I realised, it became an integral part of my life to spend 7-10 days alone- every year. pic.twitter.com/HRQTYtjk6y — Vidyut Jammwal (@VidyutJammwal) December 10, 2023 -
శివకార్తికేయన్ సినిమా.. రంగంలోకి పాన్ ఇండియా స్టార్లు!
ప్రస్తుతం మంచి రైజింగ్‌లో ఉన్న నటుడు శివకార్తికేయన్. ఇటీవల ఈయన నటించిన మావీరన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఇతడు.. విశ్వ నటుడు కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుండగా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తర్వాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి శివకార్తికేయన్ సిద్ధమవుతున్నారు. కార్తికేయన్‌తో సీతారామం బ్యూటీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను గత సెప్టెంబర్‌లోనే నిర్మాతలు ప్రకటించారు. ఇందులో సీతారామం చిత్రం ఫేమ్ మృణాల్‌ఠాగూర్ కథానాయికగా నటించబోతున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. వీరి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, అదేవిధంగా బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ ముఖ్య పాత్రలు పోషించబోతున్నట్లు తాజా సమాచారం. నటుడు మోహన్‌లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పుడు తుపాకీలో విలన్‌గా.. ఇప్పుడు.. ఇకపోతే విద్యుత్ జమ్వాల్ ఇంతకుముందు విజయ్ కథానాయకుడిగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన తుపాకీ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారన్నది గమనార్హం. కాగా అనిరుధ్ సంగీతాన్ని అందించనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీస్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. చిత్ర షూటింగ్ డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. చదవండి: ‘మంగళవారం’ మూవీ రివ్యూ -
ఇండియా-పాక్ యుద్ధం ఆధారంగా సినిమా, వీడియో చూశారా?
విద్యుత్ జమాల్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ ఫిల్మ్ ‘ఐబీ 71’. దలీప్ తాహిల్, అనుపమ్ ఖేర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రలు పోషించారు. టి–సిరీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై విద్యుత్ జమాల్ నిర్మించిన ఈ చిత్రం మే 12న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఐబీ ఆపరేషన్1: ఇంటెలిజెన్స్ ఇన్ యాక్షన్’ అనే వీడియోను విడుదల చేశారు. ‘‘1971లో ఇండియా – పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగింది. అయితే ఈ వార్‌లో ఇండియా గెలవడానికి కారణమైన ‘ఇంటెలిజెన్స్ బ్యూరో సీక్రెట్ మిషన్స్ ఆధారంగా, వాస్తవ ఘటనలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అని యూనిట్ పేర్కొంది. -
పెళ్లికి ముందే విడిపోయిన హీరో.. ఎంగేజ్మెంట్ రద్దు
ఇండస్ట్రీలో ఈమధ్య ప్రేమ-విడాకులు కామన్ అయిపోయాయి. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. మరికొందరేమో నిశ్చితార్థం చేసుకొని పెళ్లి కాకుండానే బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్ తన ప్రేయసికి బ్రేకప్ చెప్పేశారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఊసరవెల్లి, శక్తి, తుపాకీ సినిమాల్లో నటించిన విద్యుత్ బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కమాండో సీక్వెల్, ఖుదా హాఫీజ్, జంగ్లీ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన విద్యుత్ కొంతకాలంగా నందితా మహ్తానీ అనే ఫ్యాషన్ డిజైనర్‌తో ప్రేమలో ఉన్నాడు. 2021 సెప్టెంబరులో వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతారనుకుంటే ఇలా బ్రేకప్ చెప్పేసి షాక్ ఇచ్చారు. రీసెంట్గా అనన్య కజిన్ పెళ్లికి విడివిడిగా హాజరైన విద్యుత్-నందితా పెడమొహంగా కనిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా బ్రేకప్‌కు సంబంధించిన కొటేషన్స్‌ని షేర్ చేశారు. బీటౌన్ క్యూట్ కపుల్‌గా కనిపించిన ఈ జంట బ్రేకప్ ఫ్యాన్స్‌కు షాకిచ్చినట్లయ్యింది. -
లండన్‌లో సీక్రెట్‌గా హీరో పెళ్లి..!
ఈ మధ్య బాలీవుడ్ లవ్‌బర్డ్స్ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే కత్రీనా కైఫ్-విక్కీ కౌశల్, ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ వంటి స్టార్ జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ఈ జాబితాలోకి మరో హీరో చేరబోతున్నాడు. యాక్షన్ హీరోగా, విలన్‌గా బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న నటుడు విద్యుత్ జమ్వాల్. తాజాగా ఇతడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన గర్ల్‌ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ నందితా మహ్తానీతో ఈ నెలలోనే ఏడగుడు వేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. చదవండి: దాని కోసం నేను ప్రెగ్నెంట్ అని చెప్పాల్సి వచ్చింది: రెజీనా కాగా గతేడాది నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం లండన్ వేకేషన్లో ఉంది. అక్కడే సీక్రెట్‌గా ఈ కపుల్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాల్లో కథనాల వస్తుంటే.. ఇప్పటికే వారి వివాహం జరిగిపోయిందంటూ మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సందేహాలకు త్వరలోనే విద్యుత్ చెక్ పెట్టనున్నాడని సన్నిహితవర్గాల నుంచి సమాచారం. కొద్ది రోజుల్లో తమ వివాహంపై స్వయంగా ప్రకటన ఇవ్వనున్నాడని సమాచారం. కాగా విద్యుత్ జమ్వాల్ కమాండో సీక్వెల్, ఖుదా హాఫీజ్, జంగ్లీ వంటి చిత్రాలతో గుర్తింపు పొందాడు. ఇక తెలుగులో ఎన్టీఆర్ శక్తి, ఉసరవెల్లి చిత్రాల్లో విలన్‌గా నటించాడు. View this post on Instagram A post shared by Nandita Mahtani (@nanditamahtani) చదవండి: అప్పుడు ఇలియానాకు, ఇప్పుడు పూజాకు.. సేమ్ టూ సేమ్.. -
నిశ్చితార్థం అయింది.. పెళ్లి ఎప్పుడో తెలియదు: బాలీవుడ్ నటుడు
దళపతి విజయ్ హీరోగా చేసిన ‘తుపాకి’తో తెలుగు, తమిళ్లో పాపులర్ అయ్యాడు బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్. ఆయన ఇటీవలే ఫ్యాషన్ డిజైనర్ నందితా మహతానీతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ విషయాన్ని ఇద్దరూ కలిసి రాక్ క్లైంబింగ్ చేస్తున్న ఫోటోని పోస్ట్ చేసి మరీ డిఫరెంట్‌గా తెలిపాడు. తాజాగా వారి మ్యారేజ్ ఎలా ఉండబోతోందో వివరించాడు ఈ కమాండో స్టార్. పెళ్లి గురించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘నేను రెగ్యులర్ కాదు. నాకు సంబంధించి ఏ విషయంలో అలా జరిగినా నాకు నచ్చదు. మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుందో నాకు తెలీదు. డేట్ కూడా చెప్పలేను. కానీ ఎలా జరుగుతుందో మాత్రం ఐడియా ఉంది. అది కచ్చితంగా విభిన్నంగా ఉంటుంది. బహుశా 100 మంది అతిథులతో కలిసి స్కైడైవింగ్ చేస్తామేమో. అలా డిఫరెంట్‌గా చేసుకుంటే ఆ కిక్కే వేరు’ అంటూ విద్యుత్ తెలిపాడు. అయితే కమాండో సిరీస్ చిత్రాలు, ఖుదా హఫీజ్ చిత్రాలతో విద్యుత్ జమ్వాల్ బాలీవుడ్లో మంచి గుర్తింపు పొందాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘సనక్’ త్వరలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘హాట్‌స్టార్’ యాప్‌లో అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆయన ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తన సొంత నిర్మాణ సంస్థ మొదటి చిత్రంలో ‘ఐబీ 71’, ‘ఖుదా హాఫీజ్: ఛాప్టర్ II’లో నటిస్తున్నాడు. చదవండి: ఫ్యాషన్ డిజైనర్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ‘తుపాకి’ విలన్ -
ఫ్యాషన్ డిజైనర్‌తో ‘తుపాకీ’ విలన్ ఎంగేజ్మెంట్, ఫొటోలు
బాలీవుడ్ నటుడు, ‘కమాండో’ ఫేం విద్యుత్ జమ్వాల్ (40) ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ విషయాన్ని సోమవారం (సెప్టెంబర్ 13న) ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. ఫ్యాషన్ డిజైనర్ నందితా మహతానీతో తన నిశ్చితార్థం జరిగిందని చెబుతూ, వారిద్దరూ కలిసున్న ఫోటోలను అతను షేర్ చేశాడు. కాబోయే భార్య నందితా చేతులు పట్టుకుని రాక్ క్లైంబింగ్ చేస్తున్న ఫోటోని పోస్ట్ చేసిన విద్యుత్.. ‘ఇది కమాండో మార్గం.01/09/21’ అని క్యాప్షన్ జోడించాడు. అతను వివాహం చేసుకోబోతున్న నందితా వయసు కూడా 40 ఏళ్లే. ఇదే ఫోటోని ఆమె సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి తన సంతోషాన్ని పంచుకుంది. కాగా ఈ నటుడు ‘తుపాకీ’ సినిమాతో తెలుగు, తమిళ్ ప్రేక్షకులకి సుపరిచితుడే. అందులో ప్రతినాయకుడి పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. కాగా ఈ కమాండో హీరో ప్రస్తుతం ‘సనక్’, ‘ఖుదా హఫీజ్ చాప్టర్ II’ వంటి పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నాడు. View this post on Instagram A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal) -
వామ్మో: పాము పిల్లను ముక్కులోకి దూర్చుకుని.. నోట్లో నుంచి
పామును చూస్తేనే భయంతో వణికిపోతారు చాలా మంది. గట్టిగా కేకలు వేస్తూ అది ఉన్న చోటు నుంచి పరుగులు తీస్తారు. కానీ.. అందరూ అలాగే ఉండరు కదా! పాములను పట్టుకోవడమే హాబీగా పెట్టుకుంటారు కొంతమంది. వాటిని అడవుల్లో వదిలిపెట్టి జీవ కారుణ్యాన్ని చాటుకుంటారు. ఇక మరో కేటగిరీ.. వీరు పాములతో విద్యలు ప్రదర్శిస్తూ, గారడీలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియోను నటుడు విద్యుత్ జమాల్ తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇందులో.. ఓ వృద్ధుడు పాము పిల్లను ముక్కు రంధ్రంలో దూర్చుకుని... నోట్లో నుంచి దానిని బయటకు తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో విద్యుత్ జమాల్‌పై కొంతమంది నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ‘‘వీగన్(శాకాహారి) అని చెప్పుకొనే నీ నుంచి ఇలాంటి పోస్టు ఊహించలేదు. అతడు చేసే పని చట్టవిరుద్దం. జీవి ఏదైనా హింసించడం సరికాదు. అయినా.. ఆ మనిషికి వేరే జీవనాధారమే లేదా? నిజంగా ఇది ఏమాత్రం మంచిది కాదు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన విద్యుత్ జమ్వాల్
ఒక్కోసారి సెలబ్రిటీలు పెట్టే పోస్టులు నెటిజన్లకు గిలిగింతలు పెట్టిస్తాయి. సోషల్ మీడియాలో వారు పెట్టే పోస్టులతో ఫాలోవర్స్‌ను ఆట పట్టిస్తుంటారు కొందరు. బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్ ఇటీవల తన సినిమా సెట్లోకి పాము వచ్చిందంటూ, తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి అంటూ ఓ వీడియోని పోస్ట్ చేశారు. కానీ ఆ వీడియో చివర్లో ఎవ్వరూ ఊహించని ఓ ట్విస్ట్ ఉంది. విద్యుత్ జమ్వాల్‌కు సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా రిస్క్‌లు చేయడం బాగా సరదా అని అందరికి తెలిసిన విషయమే. చాలా వరకు ఆయన సినిమాలకు స్వయంగా స్టంట్లు డిజైన్ చేస్తారు. తాజాగా ఆ నటుడుకి అనుకోని పరిస్థితి ఎదురైతే.. అప్పుడు ఏం చేస్తారు.. రీల్ హీరోలాగా ఫైట్ చేస్తారా లేదా వెనుదిరిగి వెళ్లిపోతారా. దీనికి సమాధానమే ఇది అన్నట్టు ఓ వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆయన సినిమా సెట్లోకి ఓ పాము వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. అంటూ ఆసక్తికరంగా మొదలైన వీడియోలో ముగింపుని ఎవ్వరూ ఊహించలేరు. అసలు ఆ వీడియోలో ఏం జరిగిందో, ఆ ట్విస్ట్ ఏంటో చూసేయండి మరి. View this post on Instagram This is how it's done😶 #CountryBoy A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal) on Nov 3, 2020 at 9:22pm PST విద్యుత్ యాక్షన్‌కు ఫ్యాన్స్ రియాక్షన్ ఈ ఫన్నీ వీడియోతో ఫ్యాన్‌ను నవ్వుల్లో ముంచేశాడు విద్యుత్. వారు ఆ వీడియోను ఎంత ఎంజాయ్ చేశారో కామెంట్స్ చూస్తే తెలిసిపోతోంది. అందరిని పిచ్చివాళ్లని చేశావ్‌గా అని ఒక అభిమాని అంటే, పాముని బెల్ట్ చేశావేమో అనుకున్నా.. ఎందుకంటే నువ్వు ఏమైనా చేయగలవ్ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. హాట్ స్టార్‌లో విడుదలైన ఖుదా హఫీజ్ చిత్రంలో చివరిగా కనిపించాడు విద్యుత్. ఆ సినిమా పర్వాలేదు అనిపించేలా ఉన్నా.. ఎప్పటి లాగే విద్యుత్ స్టంట్లకు మంచి మార్కులు పడ్డాయి. ఎమోషన్స్ బాగా పండించినందుకు దర్శకుడు ఫరూక్ కబీర్ కూడా అభినందనలు అందుకున్నాడు. అంతకు ముందు రిలీజైన యారా సినిమా కూడా ప్రేక్షకులను బాగానే అలరించింది. తిగ్మాన్షు దులియా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శృతి హాసన్, అమిత్ సధ్, విజయ్ వర్మ, కెన్ని బసుమత్రి, అంకుర్ వికార్ కీలక పాత్రలు పోషించారు. -
ముందుకు సాగిపోవాలి అంతే: జెనీలియా
‘‘ప్రతీ సినిమా ఎంతో ప్రేమతో, మరెంతో మంది చెమటతో రూపుదిద్దుకుంటుంది. దాని కోసం చాలా మంది తన సర్వస్వాన్ని ధారబోస్తారు. అలాంటి వారు కాస్త గౌరవం కోరుకోవడం సబబే. అలాగే ఓ ఇన్విటేషన్ వస్తుందని ఊహించడం కూడా సరైందే. కనీసం అందుకు సంబంధించిన ఓ చిన్న సమాచారం అందినా బాగుంటుంది. కానీ, కొన్నిసార్లు జీవితమే సరిగ్గా ఉండదు. ముందుకు సాగిపోవాలి అంతే ఫ్రెండ్’’ అంటూ బాలీవుడ్ నటి జెనీలియా డిసౌజా తన స్నేహితుడు, కో- స్టార్ విద్యుత్ జమాల్‌కు అండగా నిలిచారు. కొన్ని సంఘటనలు బాధించేవిగా ఉన్నా వాటిని అలా వదిలేయాలని చెప్పుకొచ్చారు. ఇందుకు బదులిచ్చిన విద్యుత్ జమాల్... ‘మై ఫేవరెట్.. థాంక్యూ’ అంటూ ధన్యవాదాలు తెలిపాడు.( వెండితెరపై ‘1200 కిలో మీటర్ల పయనం’) కాగా లాక్డౌన్ నేపథ్యంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ సంస్థ డిస్నీ హాట్‌స్టార్.. ‘బాలీవుడ్‌కీ హోమ్డెలివరీ’ అంటూ 7 హిందీ సినిమాలను హాట్‌స్టార్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్(కాంచన రీమేక్), అజయ్ దేవగణ్ ‘భూజ్’, అలియా భట్ సడక్-2, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దిల్ బేచారా, అభిషేక్ బచ్చన్ ‘ది బిగ్బుల్’ సినిమాలతో పాటు ద్యుత్ జమాల్ ‘ఖుదా హాఫీజ్’, కునాల్ కేము ‘లూట్ కేస్’ తదితర సినిమాలతో తన ప్రేక్షకులకు వినోదం అందించనుంది. ఈ నేపథ్యంలో అక్షయ్‌కుమార్, అజయ్‌దేవగన్, అభిషేక్ బచ్చన్, ఆలియా భట్‌తో స్టార్ కిడ్, హీరో వరుణ్ ధావన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాడు.(మరేం చేయాలి.. లొంగిపోవాలి అంతే!) ఈ క్రమంలో ఈవెంట్‌కు తమను ఆహ్వానించలేదని, కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని తీవ్ర ఆవేదనకు గురైన విద్యుత్ జమాల్, కునాల్ కేము సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంపై స్పందించిన జెనీలియా సహా ఇతర నెటిజన్లు వీరిద్దరికి మద్దతు పలుకుతూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. స్టార్స్, స్టార్ కిడ్స్‌కు మాత్రమే ఎక్కడైనా సముచిత గౌరవం దక్కుతుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా జెనీలియా, విద్యుత్ జమాల్ ఫోర్స్(వెంకటేష్ ఘర్షణ రీమేక్) సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. My Favourite...Thankyou 🌸 https://t.co/VOxtaaSLfb — Vidyut Jammwal (@VidyutJammwal) June 30, 2020 -
సిలిండర్‌తో నటుడి వింత చేష్టలు!
ముంబై: బాలీవుడ్ యాక్షన్ హీరో, కండల వీరుడు విద్యుత్ జమాల్ ఫుల్ సిలిండర్‌తో ఏకంగా వర్కవుట్లు చేయడం మొదలెట్టాడు. సోషల్ మీడియాలో తరచూ తను చేసే వర్కవుట్ సెషన్ వీడియోలు పోస్ట్ చేసే జమాల్, గురువారం తాజాగా పోస్ట్ చేసిన వీడియోతో అందరిని హడలెత్తిస్తున్నాడు. అంతేకాక తాను ఫుల్ సిలిండర్‌తో చేసిన విన్యాసాలను మీరూ ట్రై చేయండి అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. విద్యుత్ జమాల్ నటుడిగా మాత్రమే కాక, మార్షల్ ఆర్టిస్ట్‌గా, స్టంట్స్మాన్గా బాలీవుడ్లో మంచి పేరుంది. ఆయన నటించిన జంగ్లీ, కమాండో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొల్తాకొట్టినా.. తను చేసిన యాక్షన్ సీన్స్‌కు గాను ప్రతిష్టాత్మకమైన రెండు జాకీచాన్ అవార్డులు వరించాయి. అయితే జమాల్ తాజాగా 'సాకులు చెప్పడం మాని.. ఇలా ఫుల్ సిలిండర్‌తో కలరియపట్టు ట్రై చేయండి. మీ బాడీ ఇలాంటి వర్కవుట్లు చేయగలదని మీ మెదడుకు తెలియదు' అని అంటూ వీడియోను పోస్ట్ చేశారు. Ab yeh karke dekho! For the non-believers, THIS is a FULL cylinder. Ur body is ready to train, ur mind just doesn’t know it. Stop the excuses! #ITrainLikeVidyutJammwal #kalaripayattu #desiworkout pic.twitter.com/8hTZPAHWpU — Vidyut Jammwal (@VidyutJammwal) September 5, 2019 వీడియో చూసిన వారిలో కొంతమంది మెచ్చుకొంటుండగా, మరి కొంతమంది మాత్రం జోక్‌లతో హోరెత్తిస్తున్నారు. ‘ఇలా చేస్తే మమ్మీ చెప్పుతో కొడుతుంది’ అని ఒకరు ఫన్నీగా అంటే, ‘సిలిండర్ బుక్ చేయడం మర్చిపోయా..! గుర్తు చేసింనందుకు థ్యాంక్స్’ అని మరొకరు, అసలు ఇలాంటి వారి వల్లే మాకు అమ్మాయి దొరకడం లేదని వేరొకరు కిర్రాక్ కామెంట్లు పెట్టారు. కానీ కొంతమంది మాత్రం నీకు ఇలా చేయడం వచ్చా..? అని ఛాలెంజ్ విసురుతున్నారు. Ye to koi bhi kar lega , ye kar ke dikhao👇😆🤣 pic.twitter.com/r2kgPst6AK — Bhrustrated (@AnupamUncl) September 5, 2019 -
యాక్షన్ అవార్డ్స్
బాలీవుడ్లో విద్యుత్ జమాల్‌కు యాక్షన్ హీరోగా మంచి పేరుంది. గత ఏడాది జమాల్ నటించిన ‘జంగిల్’ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారాయన. కొన్ని కళరిపయ్యట్టు స్టంట్స్‌ని అద్భుతంగా చేసి యాక్షన్ మూవీ లవర్స్ మనసు గెల్చుకున్నారు జమాల్. ఈ సినిమాకు రెండు ప్రతిష్టాత్మకమైన జాకీచాన్ అవార్డులు వచ్చాయి. చైనాలో జరిగిన జాకీచాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్‌లో భాగంగా ఇండియన్ చిత్రం ‘జంగిల్’కు రెండు అవార్డులు లభించాయి. బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రాఫర్, బెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఫిల్మ్ విభాగాల్లో ఈ అవార్డులు వచ్చాయి. ‘‘దాదాపు 150 చిత్రాలతో పోటీ పడి మా సినిమా అవార్డ్స్ గెలుచుకోవడం ఆనందంగా ఉంది. ఇండియన్ యాక్షన్ సినిమాకు మరోసారి మంచి గుర్తింపు దక్కినట్లుగా ఉంది. మేం చైనాలో స్టార్స్ అయిపోయామనే భావన కలుగుతోంది. క్రిస్ టుక్కర్ (చైనీస్ యాక్షన్ హీరో) కూడా మా యాక్షన్ సీన్స్‌ను మెచ్చుకున్నారు’’ అని పేర్కొన్నారు విద్యుత్. -
బ్యాడ్ లక్
సిల్వర్ స్క్రీన్‌పై యాక్షన్ సన్నివేశాలను చూసి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ యాక్షన్ సీన్స్ వెనక ఆర్టిస్టుల కష్టం దాగి ఉంటుంది. టైమ్ బాగా లేకపోతే యాక్టర్స్‌కి గాయాలు తప్పవు. అలా అదా శర్మ టైమ్ బాగోలేదు. అందుకే ఆమె ‘కమాండో 3’ సెట్లో గాయపడ్డారు. కమాండో ఫ్రాంచైజీలో రూపొందుతున్న థర్డ్ పార్ట్ ఇది. ఇందులో విద్యుత్ జమాల్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లోని ఓ యాక్షన్ సీన్లో భాగంగా కార్ డోర్ క్లోజ్ చేయబోయే ప్రాసెస్‌లో అదా శర్మ గాయపడ్డారు. ఆమె చిటికెన వేలు చితికిపోయింది. ఈ విషయాన్ని అదా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘‘రెండు చేతులకు కలపి తొమ్మిది వేళ్లు ఉన్నా కూడా నన్ను లవ్ చేస్తారు కదూ. దేవుడి దయ వల్ల ఆ మిగిలిన వేలు కూడా ఇంకా నా బాడీలో భాగమై ఉంది’’ అని పేర్కొన్నారు అదా శర్మ. ‘‘నిజానికి అదా శర్మ గాయపడ్డప్పుడు చాలా రక్తం పోయింది. కానీ ఆమె వెంటనే హస్పిటల్‌కి వెళ్లకుండా లొకేషన్లోనే ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని షూట్లో పాల్గొన్నారు. అదాకి ఇలా గాయం కావడం బ్యాడ్‌లక్’’ అని టీమ్ పేర్కొంది. -
బాలీవుడ్ నటుడికి అరుదైన గౌరవం
తెలుగులో శక్తి, ఊసరవెల్లి లాంటి సినిమాల్లో ప్రతినాయక పాత్రల్లో నటించిన బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్‌కు అరుదైన గుర్తింపు లభించింది. బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న జమ్వాల్ తన స్టంట్లతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా భారతీయ సాంప్రదాయ పోరాట కళ కలరియపట్టులో ఎంతో ప్రావీణ్యం ఉన్న విద్యుత్ జమ్వాల్ ప్రపంచంలోని టాప్ సిక్స్ మార్షల్ ఆర్ట్స్ కళాకరుల జాబితాలో స్థానం సంపాదించాడు. అమెరికాకు చెందిన లూపర్ అనే వెబ్ సైట్ ఈ జాబితాను ప్రకటించింది. ఈ లిస్ట్ లో విద్యుత్ జమ్వాల్‌తో పాటు స్కాట్ అడ్కిన్స్, అతీఫ్ క్రౌడర్, ఇల్రామ్ చోయి, మార్కో జిరోర్, యు జింగ్, జానీ ట్రిగ్యుయెన్ లు ఉన్నారు. ‘గొప్ప మార్షల్ ఆర్ట్స్ కళాకారుడు అంటే తెలుసుకోవాల్సింది ప్రత్యర్థిపై దాడి చేయటం కాదు, ఓపికగా ప్రత్యర్థిని దెబ్బతీయటం తెలుసుకోవాల’న్నారు విద్యుత్ జమ్వాల్. ప్రపంచ దేశాల్లో ఎన్నో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు ఇచ్చిన ఈ యువ కళాకారుడు బాలీవుడ్ చిత్రాల్లో హీరోగానూ రాణిస్తున్నాడు. -
పవన్ అభిమానులకు వర్మ క్షమాపణలు
ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో న్యూస్ లో ఉండే రామ్ గోపాల్ వర్మ గత రాత్రి తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. ప్రతీ సందర్భాన్ని వివాదాస్పదం చేస్తూ తన వ్యాఖ్యలతో స్టార్ హీరోల అభిమానులను ఇబ్బంది పెట్టడమే కాదు. కొంత మంది నమ్మకాలను కూడా వెక్కింరించే వర్మ ఇప్పుడు మనసు మార్చుకున్నాడట. ఇక మీదట ఎవరినీ కించపరిచేలా వ్యాఖ్యలు చేయబోనని ఒట్లు కూడా వేశాడు. అంతేకాదు 'నేను దేవుణ్ని నమ్మను కాబట్టి నా మాటలు మీరు నమ్మకపోవచ్చు అందుకే ఈసారి మా అమ్మ మీద, దర్శకుడు స్పీల్ బర్గ్ మీద బాలీవుడ్ మెగాస్టార్ సీనియర్ బచ్చన్ మీద ఒట్టేసి చెపుతున్నా' అంటూ ట్వీట్ చేశాడు. ఇటీవల విద్యుత్ జమాల్, టైగర్ ష్రాఫ్ ల మార్షల్ ఆర్ట్స్ ను పోలుస్తూ వర్మ కొన్ని ట్వీట్లు చేశాడు. అయితే ట్వీట్లపై స్పందించిన విద్యుత్ జమాల్, షావోలిన్ మాంక్ స్టైల్ ను మర్చిపోయి, రామ్ గోపాల్ వర్మ డ్రంకెన్ మాస్టర్ స్టైల్ ను ట్రై చేయండి అంటూ కౌంటర్ ఇచ్చాడు. విద్యుత్ ట్వీట్ తరువాత వర్మ 'నేను మారిపోయాను ఇక ఎవరి మీద వివాదాస్పద ట్వీట్లు చేయను, నన్ను నమ్మండి. నా వల్ల ఇబ్బంది పడ్డవాళ్లంతా నన్ను క్షమించండి' అంటూ ట్వీట్ చేశాడు. అయితే చేసి ఈ ట్వీట్లను కూడా ఎవరూ సీరియస్ గా తీసుకోవటం లేదు. గతంలోనూ ఇలాగే ఇక మెగా ఫ్యామిలీ పై ట్వీట్లు చేయనూ అంటూ ప్రకటించి, తిరిగి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడు వర్మ. Just decided to get off Vodka and also want to apologise to every1 i evr bothered including Lord Ganpati's devotees nd @PawanKalyan 's fans — Ram Gopal Varma (@RGVzoomin) 11 April 2017 For all those who are disbelieving my vow,since I don't believe in God,I hearby swear on my mother,Steven Spielberg and @SrBachchan — Ram Gopal Varma (@RGVzoomin) 11 April 2017 And irrespective of both our motivations and intentions I truly owe my radical changeover to @VidyutJammwal — Ram Gopal Varma (@RGVzoomin) 11 April 2017 In whatever way,whoever wants to see,whichever way,i am a new born now --for better or worse --but I will not be what I was befor ever again — Ram Gopal Varma (@RGVzoomin) 11 April 2017 I truly thank @VidyutJammwal for my changeover nd I want to apologise to Bruce Lee for not understanding him the way Vidyut made me realise — Ram Gopal Varma (@RGVzoomin) 11 April 2017 -
యాక్షన్ డిజైనర్‌గా మారుతున్న హీరో
శక్తి, ఊసరవెల్లి, తుపాకి లాంటి సినిమాలతో సౌత్ ఆడియన్స్ కు సుపరిచితుడైన విలన్ విద్యుత్ జమాల్. కమాండో సినిమాతో బాలీవుడ్ హీరోగా మారిన ఈ యాక్షన్ స్టార్ ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఫోర్స్ సినిమాలో నటనతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న విద్యుత్ జమాల్ తన నెక్ట్స్ సినిమాకు యాక్షన్ డిజైనర్ గా మారుతున్నాడు. కమాండో సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతున్న కమాండో 2 కు విద్యుత్ యాక్షన్ కొరియోగ్రఫి చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను తొలి భాగాన్ని మించేలా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే తనకున్న మార్షల్ ఆర్ట్స్ టాలెంట్ ను ఉపయోగించి భారీ యాక్షన్ సీక్వన్స్ లను ప్లాన్ చేస్తున్నాడు విద్యుత్ జమాల్.