ఇండియా-పాక్‌ యుద్ధం ఆధారంగా సినిమా, వీడియో చూశారా? | Vidyut Jammwal IB 71 release new promo | Sakshi
Sakshi News home page

ఐబీ 71: సీక్రెట్‌ ఆపరేషన్‌ వీడియో రిలీజ్‌

Published Sat, Apr 29 2023 4:22 AM | Last Updated on Sat, Apr 29 2023 6:33 AM

Vidyut Jammwal IB 71 release new promo - Sakshi

విద్యుత్‌ జమాల్‌ హీరోగా సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్‌ ఫిల్మ్‌ ‘ఐబీ 71’. దలీప్‌ తాహిల్, అనుపమ్‌ ఖేర్, విశాల్‌ జెత్వా ప్రధాన పాత్రలు పోషించారు. టి–సిరీస్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై విద్యుత్‌ జమాల్‌ నిర్మించిన ఈ చిత్రం మే 12న రిలీజ్‌ కానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ‘ఐబీ ఆపరేషన్‌1: ఇంటెలిజెన్స్‌ ఇన్‌ యాక్షన్‌’ అనే వీడియోను విడుదల చేశారు. ‘‘1971లో ఇండియా – పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరిగింది. అయితే ఈ వార్‌లో ఇండియా గెలవడానికి కారణమైన ‘ఇంటెలిజెన్స్‌ బ్యూరో సీక్రెట్‌ మిషన్స్‌ ఆధారంగా, వాస్తవ ఘటనలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement