
బాలీవుడ్ నటుడు, ‘కమాండో’ ఫేం విద్యుత్ జమ్వాల్ (40) ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ విషయాన్ని సోమవారం (సెప్టెంబర్ 13న) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. ఫ్యాషన్ డిజైనర్ నందితా మహతానీతో తన నిశ్చితార్థం జరిగిందని చెబుతూ, వారిద్దరూ కలిసున్న ఫోటోలను అతను షేర్ చేశాడు.
కాబోయే భార్య నందితా చేతులు పట్టుకుని రాక్ క్లైంబింగ్ చేస్తున్న ఫోటోని పోస్ట్ చేసిన విద్యుత్.. ‘ఇది కమాండో మార్గం.01/09/21’ అని క్యాప్షన్ జోడించాడు. అతను వివాహం చేసుకోబోతున్న నందితా వయసు కూడా 40 ఏళ్లే. ఇదే ఫోటోని ఆమె సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి తన సంతోషాన్ని పంచుకుంది.
కాగా ఈ నటుడు ‘తుపాకీ’ సినిమాతో తెలుగు, తమిళ్ ప్రేక్షకులకి సుపరిచితుడే. అందులో ప్రతినాయకుడి పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. కాగా ఈ కమాండో హీరో ప్రస్తుతం ‘సనక్’, ‘ఖుదా హఫీజ్ చాప్టర్ II’ వంటి పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌లో దూసుకెళ్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment