Is Vidyut Jammwal To Marry Designer Nandita Mahtani In London, Know Details Inside - Sakshi
Sakshi News home page

Vidyut Jammwal Marriage: లండన్‌లో సీక్రెట్‌గా బాలీవుడ్‌ ‍హీరో పెళ్లి..!

Published Thu, Jul 14 2022 12:39 PM | Last Updated on Thu, Jul 14 2022 1:49 PM

Is Vidyut Jammwal to Marry Designer Nandita Mahtani in London - Sakshi

ఈ మధ్య బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే కత్రీనా కైఫ్‌-విక్కీ కౌశల్‌, ఆలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ వంటి స్టార్‌ జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ఈ జాబితాలోకి మరో హీరో చేరబోతున్నాడు. యాక్షన్‌ హీరోగా, విలన్‌గా బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న నటుడు విద్యుత్‌ జమ్వాల్‌. తాజాగా ఇతడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన గర్ల్‌ఫ్రెండ్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌ నందితా మహ్తానీతో ఈ నెలలోనే ఏడగుడు వేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. 

చదవండి: దాని కోసం నేను ప్రెగ్నెంట్‌ అని చెప్పాల్సి వచ్చింది: రెజీనా

కాగా గతేడాది నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం లండన్‌ వేకేషన్‌లో ఉంది. అక్కడే సీక్రెట్‌గా ఈ కపుల్‌ పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్‌ మీడియాల్లో కథనాల వస్తుంటే.. ఇప్పటికే వారి వివాహం జరిగిపోయిందంటూ మరోవైపు  వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సందేహాలకు త్వరలోనే విద్యుత్‌ చెక్‌ పెట్టనున్నాడని సన్నిహితవర్గాల నుంచి సమాచారం. కొద్ది రోజుల్లో తమ వివాహంపై స్వయంగా ప్రకటన ఇవ్వనున్నాడని సమాచారం. కాగా విద్యుత్‌ జమ్వాల్‌ కమాండో సీక్వెల్‌, ఖుదా హాఫీజ్‌, జంగ్‌లీ వంటి చిత్రాలతో గుర్తింపు పొందాడు. ఇక తెలుగులో ఎన్టీఆర్‌ శక్తి, ఉసరవెల్లి చిత్రాల్లో విలన్‌గా నటించాడు. 

చదవండి: అప్పుడు ఇలియానాకు, ఇప్పుడు పూజాకు.. సేమ్‌ టూ సేమ్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement