Deepika Padukone And Ranveer Singh Divorce Rumours Goes Viral, Check Reasons Inside - Sakshi
Sakshi News home page

Ranveer Singh-Deepika Padukone: దీపికా -రణ్‌వీర్‌లు విడాకులు తీసుకోబోతున్నారా? కారణం ఇదేనా!

Published Fri, Sep 30 2022 1:55 PM | Last Updated on Fri, Sep 30 2022 3:27 PM

Deepika Padukone, Ranveer Singh Divorce Rumours Goes Viral - Sakshi

బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌లో దీపికా పదుకొనె-రణ్‌వీర్‌ సింగ్‌  జంట ఒకటి. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఏ అవార్డు ఫంక్షన్స్‌, సినిమా ఈవెంట్స్‌లో చూసిన వీరిద్దరు చాలా అన్యోన్యంగా కనిపించేవారు. అలాంటి ఈ జంట త్వరలో విడాకులు తీసుకోబోతుందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పమన్నాయి.  దీపికా-రణ్‌వీర్‌ల మధ్య మనస్పర్థలు వచ్చాయని, ప్రస్తుతం వీరు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారంటూ బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

చదవండి: ‘పొన్నియన్‌ సెల్వన్‌’పై ఉమైర్‌ సంధు ఫస్ట్‌ రివ్యూ, మండిపడ్డ సుహాసిని

అలాగే రణ్‌వీర్‌ సింగ్‌ నగ్న ఫొటోషూట్‌ వల్లే వీరిమధ్య విభేదాలు వచ్చాయంటున్నారు. అంతేకాదు ఉమైర సంధూ అనే రివ్యూవర్‌, ఫిలిం క్రిటిక్‌ దీపికా-రణ్‌వీర్‌ల బంధం చెడిందని, త్వరలోనే వారి విడాకుల ప్రకటన రానుందంటూ ట్వీట్‌ చేయడంతో ఈ వార్తలు ఒక్కసారి వైరల్‌గా మారాయి. దీంతో ఈ జంట ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై దీపికా ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ రీసెంట్‌గా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న రణ్‌వీర్‌ తమ విడాకుల రూమర్స్‌పై స్పందించాడు.

చదవండి: పొన్నియన్‌ సెల్వన్‌: ఐశ్వర్యరాయ్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

‘దీపికాతో నాకు 2012లో పరిచయం ఏర్పడింది. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.  ఈ పదేళ్లలో తనపై ఇంకా ప్రేమ పెరిగింది. దీపికా నా లైఫ్‌లోకి వచ్చాక నా జీవితం ఇంకా అందంగా మారింది. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు’ అని స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే ఈ రోజు(శుక్రవారం) ఉదయం దీపికా తన తల్లి ఉజ్జల పదుకొనెతో ఎయిర్‌పోర్ట్‌లో దర్శనం ఇచ్చింది. ఈ వీడియోలో దీపికా చేతికి వెడ్డింగ్‌ రింగ్‌ కనిపించలేదు. అది పట్టేసిన నెటిజన్లు ’హో.. దీపికా వెడ్డింగ్‌ రింగ్‌ తీసేసింది.. అంటే వీరి విడాకుల వార్తలు నిజమేనా?’ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement