పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి? | Ranveer Singh Deletes Wedding Pics from instagram | Sakshi
Sakshi News home page

Ranveer Singh: స్టార్ హీరో ఇన్ స్టాలో పెళ్లి ఫొటోలు డిలీట్.. ఏం జరుగుతోంది?

Published Tue, May 7 2024 4:48 PM | Last Updated on Tue, May 7 2024 5:07 PM

Ranveer Singh Deletes Wedding Pics from instagram

సినిమా ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకోనుందా? అవును సోషల్ మీడియాలో ఇప్పుడు కొత్తగా ఈ చర్చే నడుస్తోంది. ఎందుకంటే సదరు హీరో ఇన్ స్టాలో ఉండాల్సిన పెళ్లి ఫొటోలు కనిపించట్లేదు. దీంతో పలు అనుమానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అసలు ఏమై ఉంటుందబ్బా అని అభిమానులు, నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఇందులో నిజమెంత?

(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)

హీరోహీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ఎప్పటినుంచో ఉన్నదే. అయితే వీళ్లలో కొందరు కలిసి ఉంటుంటే.. మరికొందరు మాత్రం మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి బాలీవుడ్ కపుల్ రణ్‌వీర్ - దీపిక చేరబోతున్నారా అనే సందేహం వస్తోంది. ఎందుకంటే రణ్‌వీర్ తన ఇన్ స్టా ఖాతాలోని పెళ్లి ఫొటోల్ని డిలీట్ చేశాడు. దీంతో లేనిపోని అనుమానాలు వచ్చాయి.

దీపిక ఇన్ స్టాలో ఉన్నాయి కానీ రణ్‌వీర్ ఖాతాలో మాత్రం పెళ్లి ఫొటోలు కనిపించట్లేదు. అయితే దీపికతో కలిసున్న మిగతా ఫొటోలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాదన్నట్లు దీపిక ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఇలాంటి టైంలో విడాకులు రూమర్ అనేది నమ్మేలా అనిపించట్లేదు. పెళ్లి పిక్స్ కనిపించకుండా పోవడం బహుశా ఏదో పొరపాటు వల్ల అయ్యిండొచ్చని వీళ్ల ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ విషయమై క్లారిటీ రావాలంటే రణ్‌వీర్ స్పందించాల్సిందే. 

(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement