శివకార్తికేయన్‌ సినిమా.. రంగంలోకి పాన్‌ ఇండియా స్టార్లు! | Mohanlal, Vidyut Jamwal in Sivakarthikeyan's Movie? | Sakshi
Sakshi News home page

Sivakarthikeyan: శివకార్తికేయన్‌ సినిమాలో మాలీవుడ్‌ సూపర్‌స్టార్‌.. బాలీవుడ్‌ నుంచి..

Published Fri, Nov 17 2023 10:02 AM | Last Updated on Fri, Nov 17 2023 10:10 AM

Mohanlal, Vidyut Jamwal in Sivakarthikeyan Movies - Sakshi

ప్రస్తుతం మంచి రైజింగ్‌లో ఉన్న నటుడు శివకార్తికేయన్‌. ఇటీవల ఈయన నటించిన మావీరన్‌ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఇతడు.. విశ్వ నటుడు కమల్‌ హాసన్‌ తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా రాజ్‌ కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. తర్వాత ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో నటించడానికి శివకార్తికేయన్‌ సిద్ధమవుతున్నారు.

కార్తికేయన్‌తో సీతారామం బ్యూటీ
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను గత సెప్టెంబర్‌లోనే నిర్మాతలు ప్రకటించారు. ఇందులో సీతారామం చిత్రం ఫేమ్‌ మృణాల్‌ఠాగూర్‌ కథానాయికగా నటించబోతున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌, అదేవిధంగా బాలీవుడ్‌ నటుడు విద్యుత్‌ జమ్వాల్‌ ముఖ్య పాత్రలు పోషించబోతున్నట్లు తాజా సమాచారం. నటుడు మోహన్‌లాల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అప్పుడు తుపాకీలో విలన్‌గా.. ఇప్పుడు..
ఇకపోతే విద్యుత్‌ జమ్వాల్‌ ఇంతకుముందు విజయ్‌ కథానాయకుడిగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించిన తుపాకీ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారన్నది గమనార్హం. కాగా అనిరుధ్‌ సంగీతాన్ని అందించనున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీస్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. చిత్ర షూటింగ్‌ డిసెంబర్‌ ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.

చదవండి: మంగళవారం’ మూవీ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement