యాక్షన్ డిజైనర్గా మారుతున్న హీరో | Vidyut Jammwal to get Action Designer credit for Commando 2 | Sakshi
Sakshi News home page

యాక్షన్ డిజైనర్గా మారుతున్న హీరో

Published Tue, Feb 23 2016 2:18 PM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

యాక్షన్ డిజైనర్గా మారుతున్న హీరో - Sakshi

యాక్షన్ డిజైనర్గా మారుతున్న హీరో

శక్తి, ఊసరవెల్లి, తుపాకి లాంటి సినిమాలతో సౌత్ ఆడియన్స్ కు సుపరిచితుడైన విలన్ విద్యుత్ జమాల్. కమాండో సినిమాతో బాలీవుడ్ హీరోగా మారిన ఈ యాక్షన్ స్టార్ ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ  అవుతున్నాడు. ఫోర్స్ సినిమాలో నటనతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న విద్యుత్ జమాల్ తన నెక్ట్స్ సినిమాకు యాక్షన్ డిజైనర్ గా మారుతున్నాడు.

కమాండో సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతున్న కమాండో 2 కు విద్యుత్ యాక్షన్ కొరియోగ్రఫి చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను తొలి భాగాన్ని మించేలా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే తనకున్న మార్షల్ ఆర్ట్స్ టాలెంట్ ను ఉపయోగించి భారీ యాక్షన్ సీక్వన్స్ లను ప్లాన్ చేస్తున్నాడు విద్యుత్ జమాల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement