Commando 2
-
నిశ్చితార్థం అయింది.. పెళ్లి ఎప్పుడో తెలియదు: బాలీవుడ్ నటుడు
దళపతి విజయ్ హీరోగా చేసిన ‘తుపాకి’తో తెలుగు, తమిళ్లో పాపులర్ అయ్యాడు బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్. ఆయన ఇటీవలే ఫ్యాషన్ డిజైనర్ నందితా మహతానీతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ విషయాన్ని ఇద్దరూ కలిసి రాక్ క్లైంబింగ్ చేస్తున్న ఫోటోని పోస్ట్ చేసి మరీ డిఫరెంట్‌గా తెలిపాడు. తాజాగా వారి మ్యారేజ్ ఎలా ఉండబోతోందో వివరించాడు ఈ కమాండో స్టార్. పెళ్లి గురించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘నేను రెగ్యులర్ కాదు. నాకు సంబంధించి ఏ విషయంలో అలా జరిగినా నాకు నచ్చదు. మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుందో నాకు తెలీదు. డేట్ కూడా చెప్పలేను. కానీ ఎలా జరుగుతుందో మాత్రం ఐడియా ఉంది. అది కచ్చితంగా విభిన్నంగా ఉంటుంది. బహుశా 100 మంది అతిథులతో కలిసి స్కైడైవింగ్ చేస్తామేమో. అలా డిఫరెంట్‌గా చేసుకుంటే ఆ కిక్కే వేరు’ అంటూ విద్యుత్ తెలిపాడు. అయితే కమాండో సిరీస్ చిత్రాలు, ఖుదా హఫీజ్ చిత్రాలతో విద్యుత్ జమ్వాల్ బాలీవుడ్లో మంచి గుర్తింపు పొందాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘సనక్’ త్వరలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘హాట్‌స్టార్’ యాప్‌లో అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆయన ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తన సొంత నిర్మాణ సంస్థ మొదటి చిత్రంలో ‘ఐబీ 71’, ‘ఖుదా హాఫీజ్: ఛాప్టర్ II’లో నటిస్తున్నాడు. చదవండి: ఫ్యాషన్ డిజైనర్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ‘తుపాకి’ విలన్ -
కమాండో 2 ట్రైలర్ విడుదల
-
హిందీ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటోంది
హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల బామ అదాశర్మ. తరువాత సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్న ఈ బ్యూటి ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది. విద్యుత్ జమాల్ హీరోగా తెరకెక్కుతున్న కమాండో 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అదా. ఈ సినిమాలో విజయవాడ నుంచి వచ్చిన తెలుగమ్మాయి పాత్రలో నటిస్తోంది అదాశర్మ. నేటివిటికీ తగ్గట్టుగా సినిమాలో చాలా తెలుగు డైలాగ్స్ కూడా ఉండటంతో ఆ డైలాగ్స్ స్ఫష్టంగా పలకటం కోసం తెలుగు నేర్చుకునే పనిలో ఉంది ఈ బ్యూటి. ప్రత్యేక ట్యూటర్ ని పెట్టుకొని మరి పక్కాగా తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో సక్సెస్ అయితే ఇక అదా తెలుగు సినిమాకు కూడా ఓన్ గా డబ్బింగ్ చెప్పుకోవటం ఖాయం. -
డేర్ డెవిల్!
పిట్టగోడ మీద నిలబడటమంటేనే పెద్ద సాహసం. ఇక.. యోగా చేస్తే? ప్రాణాలతో చెలగాటమాడినట్లే. గుండె నిండా ధైర్యం ఉన్నవాళ్లే ఆ సాహసం చేయగలుగుతారు. అలాంటివాళ్లను ‘డేర్ డెవిల్’ అనాల్సిందే. ఇప్పుడు చాలామంది అదా శర్మను ఇలానే అంటున్నారు. దానికి కారణం పిట్టగోడ మీద ఆమె చేసిన యోగానే. యోగా అంటే విశాలమైన ప్రాంతంలో చేస్తారు. దాదాపు ఒక్క అడుగు వెడల్పు ఉన్న పిట్టగోడ మీద అదా యోగా చేశారు. ఎందుకీ రిస్క్ అనుకుంటున్నారా? హిందీలో ‘కమాండో 2’ అనే చిత్రంలో నటిస్తున్నారామె. ఈ చిత్రంలో రిస్కీ ఫైట్స్ చేస్తారు. దానికోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. పిట్టగోడ మీద చేసే రిస్కీ ఫైట్స్ కోసమే ఇలా యోగా ప్రాక్టీస్ చేశారు. చేసే పని మీద ఎంతో ప్రేమ, అంకితభావం ఉంటేనే ఈ రేంజ్లో రిస్క్ తీసుకుంటారు. పిట్టగోడ మీద తాను చేసిన విన్యాసాలను షూట్ చేసి, ఆ వీడియో, ఫొటోలను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు అదా శర్మ. పిల్లలెవరైనా తనను ఆదర్శంగా తీసుకుని, ట్రై చేస్తారేమోనని భావించారేమో... ‘ఇంట్లో ఇలాంటివి ట్రై చేయొద్దు’ అని పేర్కొన్నారు. ఈ పిట్టగోడ ఉన్నది 24వ అంతస్తులో. అక్కణ్ణుంచి కింద చూస్తేనే కళ్లు తిరుగుతాయ్. దమ్మున్న వాళ్లు చేస్తారేమో కానీ... యోగా ఎవరు చేస్తారమ్మా?... అదా.. అదరగొట్టేశావ్! -
నేల మీద... గాల్లో తేలుతూ..!
మంచి పాత్ర దొరకాలే కానీ, దానికోసం ఎంతైనా కష్టపడతానంటున్నారు అదా శర్మ. ‘హార్ట్ ఎటాక్’ నుంచి మొన్నటి ‘క్షణం’ వరకూ గ్లామరస్ పాత్రలు ఎక్కువగా చేసిన అదా ఇప్పుడు తనలో మరో కోణాన్ని చూపించనున్నారు. హిందీ చిత్రం ‘కమాండో 2’లో పవర్ఫుల్ అదాని చూడబోతున్నాం. ఈ చిత్రంలో ఈ బ్యూటీ డ్యూయెట్లు పాడతారో లేదో కానీ, ఫైట్లు మాత్రం చేస్తారు. అది కూడా రిస్కీ ఫైట్స్ అన్న మాట. అందుకే కసరత్తులు చేస్తున్నారు. ఈ పాత్ర కోసం జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్నారు. ఆ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఫొటోలు కూడా దిగారు. నేల మీద మాత్రమే కాదు.. గాల్లో కూడా అదా రిస్కులు చేసేస్తున్నారు. దీన్నిబట్టి ‘కమాండో 2’లో అదా అదరిపోయే ఫైట్స్ చేస్తారని ఊహించవచ్చు. ఈ చిత్రంతో పాటు హిందీలో ‘జగ్గా జాసూస్’లో కూడా అదా నటిస్తున్నారు. ‘‘నా మటుకు నేను ఏ పాత్రకైనా న్యాయం చేయాలనుకుంటా. అది గ్లామరస్ అయినా.. పవర్ఫుల్ అయినా. ఒకే రకం పాత్రలకే పరిమితం కాను. అలాగే నాకు భాష గురించి కూడా పట్టింపు లేదు. ఎక్కడ మంచి అవకాశాలొస్తే అక్కడ చేస్తా’’ అని అదా శర్మ పేర్కొన్నారు. -
చాలా కష్టం!
కత్తిలాంటి ఫిజిక్‌తో కుర్రకారుని ఆకట్టుకునే అందాల నాయికలు కత్తి చేతబట్టి ఫైట్లు చేస్తే చూడ్డానికి బాగానే ఉంటుంది. అనుష్క, తమన్నా వంటి తారలు యాక్షన్ బాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదా శర్మ కూడా ఈ లిస్టులో చేరారు. ‘ఫోర్స్’ ఫేమ్ విద్యుత్ జామ్వాల్ హీరోగా మూడేళ్ల క్రితం వచ్చిన ‘కమాండో’కు సీక్వెల్‌గా రూపొందనున్న చిత్రంలో అదాను కథానాయికగా అడిగారట. మొద ట్లో సోనాక్షీ సిన్హాను అనుకున్నా, ఆ తర్వాత ఈ అవకాశం అదాను వరించింది. ఇప్పటివరకూ చేసిన చిత్రాలన్నింటికన్నా కష్టమైన సినిమా ఇదనీ, ఇందులో ఫైట్స్ కూడా చేస్తాననీ అదా పేర్కొన్నారు. దానికోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు. -
యాక్షన్ డిజైనర్‌గా మారుతున్న హీరో
శక్తి, ఊసరవెల్లి, తుపాకి లాంటి సినిమాలతో సౌత్ ఆడియన్స్ కు సుపరిచితుడైన విలన్ విద్యుత్ జమాల్. కమాండో సినిమాతో బాలీవుడ్ హీరోగా మారిన ఈ యాక్షన్ స్టార్ ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఫోర్స్ సినిమాలో నటనతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న విద్యుత్ జమాల్ తన నెక్ట్స్ సినిమాకు యాక్షన్ డిజైనర్ గా మారుతున్నాడు. కమాండో సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతున్న కమాండో 2 కు విద్యుత్ యాక్షన్ కొరియోగ్రఫి చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను తొలి భాగాన్ని మించేలా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే తనకున్న మార్షల్ ఆర్ట్స్ టాలెంట్ ను ఉపయోగించి భారీ యాక్షన్ సీక్వన్స్ లను ప్లాన్ చేస్తున్నాడు విద్యుత్ జమాల్.