చాలా కష్టం!
కత్తిలాంటి ఫిజిక్‌తో కుర్రకారుని ఆకట్టుకునే అందాల నాయికలు కత్తి చేతబట్టి ఫైట్లు చేస్తే చూడ్డానికి బాగానే ఉంటుంది. అనుష్క, తమన్నా వంటి తారలు యాక్షన్ బాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదా శర్మ కూడా ఈ లిస్టులో చేరారు. ‘ఫోర్స్’ ఫేమ్ విద్యుత్ జామ్వాల్ హీరోగా మూడేళ్ల క్రితం వచ్చిన ‘కమాండో’కు సీక్వెల్‌గా రూపొందనున్న చిత్రంలో అదాను కథానాయికగా అడిగారట. మొద ట్లో సోనాక్షీ సిన్హాను అనుకున్నా, ఆ తర్వాత ఈ అవకాశం అదాను వరించింది. ఇప్పటివరకూ చేసిన చిత్రాలన్నింటికన్నా కష్టమైన సినిమా ఇదనీ, ఇందులో ఫైట్స్ కూడా చేస్తాననీ అదా పేర్కొన్నారు. దానికోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు.