హిందీ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటోంది | Adah Sharma learn telugu for hindi film | Sakshi
Sakshi News home page

హిందీ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటోంది

Published Sun, Nov 13 2016 12:50 PM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM

హిందీ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటోంది

హిందీ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటోంది

హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల బామ అదాశర్మ. తరువాత సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్న ఈ బ్యూటి ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది. విద్యుత్ జమాల్ హీరోగా తెరకెక్కుతున్న కమాండో 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అదా.

ఈ సినిమాలో విజయవాడ నుంచి వచ్చిన తెలుగమ్మాయి పాత్రలో నటిస్తోంది అదాశర్మ. నేటివిటికీ తగ్గట్టుగా సినిమాలో చాలా తెలుగు డైలాగ్స్ కూడా ఉండటంతో ఆ డైలాగ్స్ స్ఫష్టంగా పలకటం కోసం తెలుగు నేర్చుకునే పనిలో ఉంది ఈ బ్యూటి. ప్రత్యేక ట్యూటర్ ని పెట్టుకొని మరి పక్కాగా తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో సక్సెస్ అయితే ఇక అదా తెలుగు సినిమాకు కూడా ఓన్ గా డబ్బింగ్ చెప్పుకోవటం ఖాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement