vidyut Jamwal
-
నా సినిమాతో కోట్లు నష్టపోయా.. సర్కస్‌లో చేరా: హీరో
సినిమాలు నిర్మించడమనేది అంత ఈజీ కాదు. ఏమాత్రం తేడా వచ్చినా చేతులు కాలాల్సిందే! బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్ ఆమధ్య క్రాక్ అనే సినిమా తీశాడు. తను హీరోగా నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడింది. ఈ చిత్రం వల్ల ఎంతో నష్టపోయానంటున్నాడు విద్యుత్ జమ్వాల్.సర్కస్‌లో చేరా..తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. క్రాక్ ఫ్లాప్ అవడం వల్ల చాలా డబ్బు నష్టపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు. ఫ్రెంచ్ సర్కస్‌లో జాయిన్ అయ్యాను. 14 రోజులు అక్కడే ఉన్నాను. శరీరాన్ని నచ్చిన యాంగిల్స్‌లోకి వంచుతూ విన్యాసాలు చేసేవారిని కలుసుకున్నాను. ఇలా ఎలా చేయగలుగుతున్నారా? అని ఆశ్చర్యపోయేవాడిని. ఆ సర్కస్ గదిలో అందరికంటే నేనే చిన్నగా ఉండేవాడిని. మూడు నెలల్లోనే..కొద్దిరోజులు వారితో కలిసుండి ముంబై వచ్చేసరికి అంతా మామూలైపోయేది. మూడు నెలల్లోనే నా అప్పులు తీరిపోయాయి. ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా దాన్నుంచి బయటపడే ప్రయత్నాలు వెతుక్కున్నాను అని విద్యుత్ జమ్వాల్ చెప్పుకొచ్చాడు. కాగా క్రాక్ సినిమాలో అర్జున్ రాంపాల్, నోరా ఫతేహి, అమీ జాక్సన్ ముఖ్య పాత్రలు పోషించగా ఆదిత్య దత్ దర్శకత్వం వహించాడు.చదవండి: నేరుగా ఓటీటీకి టాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? -
సహాయం కోసం నాన్నకు ఫోన్ చేశా!
ఒక్కో పాత్రలోకి వెళ్లడానికి ఒక్కో విధంగా వర్క్ చేస్తుంటారు నటీనటులు. రీసెర్చ్ చేయడం, సంబంధిత మనుషులతో మాట్లాడటం, డైలీ రొటీన్ మార్చడం వంటి ఎంతో కృషి ఒక పాత్ర వెనక ఉంటుంది. ‘‘సుకన్య పాత్ర కోసం చాలా రీసెర్చ్ చేశాను అంటున్నారు’’ శ్రుతీహాసన్. ఆమె నటించిన హిందీ చిత్రం ‘యారా’ ఓటీటీలో విడుదల కానుంది. విద్యుత్ జమాల్ హీరో. ఈ చిత్ర కథాంశం 1970లోజరుగుతుంది. ‘‘అప్పటి పాత్రలోకి వెళ్లడానికి మా నాన్న(కమల్ హాసన్) ఇచ్చిన సూచనలు ఉపయోగపడ్డాయి’’ అన్నారు శ్రుతి. దాని గురించి మాట్లాడుతూ – ‘‘ఏ పాత్రని అయినా నా స్టయిల్ లో చేయాలనుకుంటాను. నా పాత్రల గురించి నాన్నతో పెద్దగా చర్చించను. కానీ ‘యారా’లో సుకన్య పాత్ర ఎలా చేయాలో అర్థం కాలేదు. అందుకే సహాయం కోసం నాన్నకు ఫోన్ చేశాను. ‘మనకు పెద్దగా పరిచయం లేని పాత్రలు చేస్తున్నప్పుడు ఆ పాత్రను ముందు అర్థం చేసుకోవాలి. కట్టూబొట్టూ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. ఆ పాత్ర గురించి తెలిసినవాళ్లు ఇలా ఉంది ఏంటి అనుకోకుండా చేయాలి అంటూ నాన్న చాలా సూచనలు ఇచ్చారు. అవి చాలా ఉపయోగపడ్డాయి. ఇలాంటి పాత్రలు పోషించినప్పుడు ‘బాగానే చేసింది’ అనేది కూడా పెద్ద ప్రశంసలాగా ఉంటుంది’’ అని శ్రుతీహాసన్ పేర్కొన్నారు. -
బాలీవుడ్ సినిమాపై ఎన్టీఆర్ ట్వీట్
సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా కనిపించిన యంగ్ హీరో ఎన్టీఆర్ సోషల్ మీడియా పేజ్‌లో ఇంట్రస్టింగ్ ట్వీట్ ఒకటి దర్శనమిచ్చింది. పెద్దగా ఇతర హీరోల సినిమాల గురించి ట్వీట్ చేయని ఎన్టీఆర్ ఈ మధ్య బాబాయ్ హీరోగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి టీంకు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ ఇప్పుడు ఓ బాలీవుడ్ హీరో సినిమాకు విషెస్ చెప్పాడు. సౌత్‌లో విలన్‌గా సోపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా నటించిన విద్యుత్ జమాల్ బాలీవుడ్లో హీరోగా తెరకెక్కిన సినిమా కమాండో. ఈ సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న కమాండో 2 తెలుగులో రిలీజ్ అవుతున్న సందర్భంగా ఎన్టీఆర్ జమాల్‌కు విషెస్ చెప్పాడు. 'నా ప్రియమైన స్నేహితుడు విద్యుత్ జమాల్ హీరోగా తెరకెక్కిన కమాండో 2 తెలుగులో వస్తోంది. అతడికి ఆల్ ద బెస్ట్' అని ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన శక్తి, ఊసరవెల్లి సినిమాల్లో జమాల్ కీలక పాత్రల్లో నటించాడు. Wishing my dear friend @VidyutJammwal the very best for his #Commando2 in Telugu https://t.co/oNIEANH9gb — tarakaram n (@tarak9999) 28 January 2017 -
హిందీ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటోంది
హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల బామ అదాశర్మ. తరువాత సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్న ఈ బ్యూటి ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది. విద్యుత్ జమాల్ హీరోగా తెరకెక్కుతున్న కమాండో 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అదా. ఈ సినిమాలో విజయవాడ నుంచి వచ్చిన తెలుగమ్మాయి పాత్రలో నటిస్తోంది అదాశర్మ. నేటివిటికీ తగ్గట్టుగా సినిమాలో చాలా తెలుగు డైలాగ్స్ కూడా ఉండటంతో ఆ డైలాగ్స్ స్ఫష్టంగా పలకటం కోసం తెలుగు నేర్చుకునే పనిలో ఉంది ఈ బ్యూటి. ప్రత్యేక ట్యూటర్ ని పెట్టుకొని మరి పక్కాగా తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో సక్సెస్ అయితే ఇక అదా తెలుగు సినిమాకు కూడా ఓన్ గా డబ్బింగ్ చెప్పుకోవటం ఖాయం. -
సినిమా రివ్యూ: సికిందర్
నటీనటులు: సూర్య, సమంత, మనోజ్ బాజ్ పాయ్, విద్యుత్ జమ్వాల్, దిలీప్ తాహిల్, రాజ్ పాల్ యాదవ్ ఫోటోగ్రఫి: సంతోష్ శివన్ సంగీతం: యువన్ శంకర్ రాజా ఎడిటింగ్: ఆంథోని నిర్మాత: లగడపాటి శ్రీధర్, సుభాష్ చంద్రబోస్, సిద్దార్థ్ రాయ్ కపూర్ దర్శకత్వం: లింగుస్వామి రాజు భాయ్ (సూర్య) ముంబైలో ఓ మాఫియా డాన్. రాజుభాయ్ ను వెతుక్కుంటూ కృష్ణ (సూర్య) వైజాగ్ నుంచి ముంబైకి చేరుకుంటాడు. ముంబైలో రాజు భాయ్, అతని స్నేహితుడు చందు (విద్యుత్ జమ్వాల్) ల స్నేహం, మాఫియా సామ్రాజ్యం గురించి కృష్ణకు తెలుస్తుంది. రాజు భాయ్ స్నేహితుడు చందును ముంబైని శాసించే ఇమ్రాన్ భాయ్ (మనోజ్ బాజ్ పాయ్) చంపేస్తాడు. తన గ్రూప్ లో కొందరు చేసిన నమ్మక ద్రోహా వల్లే చందు మరణానికి కారణమని రాజుభాయ్ తెలుసుకుంటాడు. అయితే రాజుభాయ్ ని కూడా ఇమ్రాన్ గ్రూప్ కాల్చేస్తుంది. ఇమ్రాన్ గ్రూప్ జరిపిన కాల్పుల్లో గాయపడిన రాజుభాయ్ ఏమయ్యాడు? రాజుభాయ్ ను కృష్ణ కలిశాడా? రాజుభాయ్, కృష్ణను ఎందుకు వెతుక్కుంటూ వచ్చాడు? ఇమ్రాన్ భాయ్ మాఫియా సామ్రాజ్యానికి ఎవరు చెక్ పెట్టారు? తన స్నేహితుడు చందు మరణానికి రాజుభాయ్ ప్రతీకారం తీర్చుకున్నాడా అనే ప్రశ్నలకు సమాధానమే 'సికిందర్' చిత్ర కథ. నటీనటుల, సాంకేతిక వర్గాల పనితీరు: ఎన్నో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్న సూర్య ఈ చిత్రంలో రాజుభాయ్, కృష్ణ అనే రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ఈ చిత్రంలో రాజుభాయ్, కృష్ణ పాత్రలను సూర్య సమర్ధవంతంగా పోషించాడు. రెండు పాత్రల్లోనూ తన మార్కును ప్రదర్శించాడు. గత చిత్రాల్లోని పాత్రలను పోల్చుకుంటే రాజుభాయ్, కృష్ణ పాత్రలు సూర్య కెరీర్ లోనే సాదా సీదా పాత్రలని చెప్పవచ్చు. సూర్య ప్రేయసిగా సమంత నటించింది. ఈ చిత్రంలో సమంత పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు కాని.. ఓ అడుగు ముందుకేసి.. పరిమితుల్లేకుండా గ్లామర్ ను ప్రదర్శించింది. సమంత కొన్ని సన్నివేశాల్లో హాట్ హాట్ గా కనిపించింది. విద్యుత్ జమ్వాల్, మనోజ్ బాజ్ పాయ్, బ్రహ్మనందం పాత్రలు అంతంత మాత్రమే. సంతోష్ శివన్ ఫోట్రోగ్రఫి, యువన్ శంకర్ రాజా సంగీతం, ఆంథోని ఎడిటింగ్ పర్వాలేదనిపించే స్థాయిలోనే ఉంది. సమీక్ష: సూర్య గత చిత్రాలకు కథ, కథనాలే ప్రధానం. అయితే సికిందర్ చిత్ర కథ, కథనాలు గతంలోని సూర్య సినిమాలకు విభిన్నంగా కనిపిస్తుంది. సికిందర్ చిత్రంలో ఎలాంటి కొత్తదనం కనిపించకపోగా... కథనంలో దమ్ములేకపోవడం ప్రేక్షకుల్ని అసహనానికి గురిచేస్తుంది. ఇక రెండవ భాగంలో ఈ సాగతీత ఎక్కువగానే అనిపించింది. సుమారు మూడు గంటల సినిమాలో ఎక్కడా ప్రేక్షకుడు ఫీలయ్యే సన్నివేశాలు, వినోద సన్నివేశాలూ ఎక్కడా కనిపించవు. ఏదో సినిమా నడుస్తుందనే ధోరణి కనిపిస్తుంటుంది. కథ బలహీనంగా ఉండటమనే అంశం మిగితా విభాగాలపై ప్రత్యక్ష ప్రభావం చూపించింది. ఓవరాల్ గా సూర్యను సికిందర్ గా చూపించాలని దర్శకుడు లింగుస్వామి చేసిన ప్రయత్నం అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. సగటు ప్రేక్షకులు ఆదరించడంపైనే సికిందర్ విజయం ఆధారపడి ఉంటుంది. పేలవమైన కథ, కథనాలు సూర్యను సికిందర్ గా నిలబెట్టడం అనేది కష్టమైనదే అని చెప్పవచ్చు. -రాజబాబు అనుముల