రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నందన్‌వన్ జంగిల్ సఫారిలో ఓ పులి టూరిస్ట్ బస్‌ను వెంటాడిన ఘటనపై ఇద్దరు పార్క్ అధికారులను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. భద్రతా ప్రోటోకాల్ పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై వేటు వేసింది. జంగిల్ సఫారీలో భాగంగా టూరిస్టుల బృందం కొట్లాడుకుంటున్న రెండు పులల వద్దకు రాగానే వాటిలో ఒక పులి అనూహ్యంగా తమ బస్సు కిటికీకి ఉన్న కర్టెన్‌ను లాగేందుకు ప్రయత్నించింది. బస్‌పై దాడికి పులి ప్రయత్నించడంతో బస్‌ను వేగంగా నడపాలని ఓ టూరిస్టు డ్రైవర్‌ను కోరాడు. బస్సు వేగంగా ముందుకెళ్లడంతో దాని వెనుకే పులి దూసుకువెళ్లడం ప్రయాణీకులను బెంబేలెత్తించింది. దీనికి సంబంధించిన వీడియో సీనియర్ అధికారుల దృష్టికి రావడంతో బస్ డ్రైవర్, టూరిస్ట్ గైడ్‌లను విధుల నుంచి తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment