రియో డి జనీరో : అమెజాన్ అడవుల్లో ఓ భారీ తిమింగలం మృతదేహం లభ్యమైంది. 36 అడుగుల పొడవున్న ఈ తిమింగలాన్ని హంప్‌బ్యాక్ జాతికి చెందిందిగా గుర్తించారు. బ్రెజిల్‌లోని మరాజో ఐలాండ్‌లో తిమింగలం మృతదేహం లభ్యమైంది. సముద్రం నుంచి తిమింగలం మృతదేహం ఉన్న ప్రాంతం 15 మీటర్ల దూరంలో ఉంది. సముద్రంలో చనిపోయిన తర్వాత భారీ అలలకు తిమింగలం ఇక్కడికి కొట్టుకొని వచ్చి ఉంటుందేమో అన్న కోణంలో బయాలజిస్టులు దర్యాప్తు చేస్తున్నారు. దీని వయసు సంవత్సరం కూడా లేదని, దీని మృతిపై దర్యాప్తు చేస్తున్న బిచో డాగువా ఇన్‌స్టిట్యూట్ సభ్యులు చెబుతున్నారు. ఏడాది వయసు కూడా లేని ఈ భారీ సైజు తిమింగలం ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment