సెల్ఫీ వల్ల చాలామంది మనుషుల ప్రాణాలు బలైన సంఘటనలు అనేకం చూశాం. కానీ ఒక సెల్ఫీ వీడియో నిందితుడిని పట్టిచ్చిన వైనం వైరల్‌గా మారింది. ఓ రైలు ప్రయాణికుడి సెల్ఫీ వీడియో మరో ప్రయాణికుడి మరణం వెనకున్ మిస్టరీ ఛేదించిన ఘటన మహారాష్ట్రలోని కళ్యాణ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాలిలా ఉన్నాయి:
బ్యాంకు ఉద్యోగి ప్రభాస్ భాంగే హోలీ వేడుకలకు ఇంటికెళ్లి అనంతరం తిరిగి పూణే వెళ్లేందుకు ఈ నెల 24న సిద్దేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు. కానీ అనూహ్యంగా అతని మృతదేహం విఠల్‌వాడి రైల్వే స్టేషన్‌లో పట్టాలపై దర్శనమిచ్చింది. అయితే జారి పడి దుర్మరణం పాలై ఉంటాడని పోలీసులు తొలుత భావించారు.
అయితే ఇక్కడే అసలు కథ వెలుగులోకిచ్చింది. రైలు విఠల్‌వాడి స్టేషన్ వద్దకు వచ్చేసరికి ప్రభాస్ భాంగే బయట రైలు డోరు దగ్గర నిలబడి ఉన్నాడు. ఇదే అదనుగా భావించిన సెల్‌ఫోన్ దొంగ ఆకాశ్ జాదవ్ హఠాత్తుగా అతని ఫోన్ లాక్కున్నాడు. అతని మొబైల్ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించినపుడు అదుపు తప్పి పట్టాలపై పోయాడు.
అయితే ఈ మొత్తం ఉందంతం మరో రైలు ప్రయాణికుడు జాహిద్ జైదీ సెల్ఫీ వీడియోలో రికార్డు అయింది. జాహిద్ ఫోన్ కొట్టేసేందుకు కూడా ఆకాశ్ జాదవ్ ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు. అది వీడియోలో రికార్డు అయింది.దీనిపై అతను ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దీనిపై విచారించాల్సిందిగా పోలీసులను కోరాడు.ఇది వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానితుడిగా ఆకాశ్ జాదవ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు కూడా నిజం అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అతడి నుంచి ప్రభాస్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని రైల్వే పోలీసు అధికారి పండరీనాథ్ కాండే వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment