
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అల్మోరాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో నిండిన ఒక బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బస్సు పౌరీ నుంచి రాంనగర్ వైపు వస్తుండగా ప్రమాదానికి గురైంది. నైనిటాల్ జిల్లా పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఒక కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఒక చిన్న నది ప్రవహించడాన్ని వీడియోలో గమనించవచ్చు.
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. సంఘటనా స్థలంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
जनपद अल्मोड़ा के मार्चुला में हुई दुर्भाग्यपूर्ण बस दुर्घटना में यात्रियों के हताहत होने का अत्यंत दुःखद समाचार प्राप्त हुआ। जिला प्रशासन को तेजी के साथ राहत एवं बचाव अभियान चलाने के निर्देश दिए हैं।
घटनास्थल पर स्थानीय प्रशासन एवं SDRF की टीमें घायलों को निकालकर उपचार के लिए…— Pushkar Singh Dhami (@pushkardhami) November 4, 2024

ఇది కూడా చదవండి: హిందూ ఆలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడి