Railyway
-
మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు: సెల్ఫీ వీడియో పుణ్యమే!
సెల్ఫీ వల్ల చాలామంది మనుషుల ప్రాణాలు బలైన సంఘటనలు అనేకం చూశాం. కానీ ఒక సెల్ఫీ వీడియో నిందితుడిని పట్టిచ్చిన వైనం వైరల్‌గా మారింది. ఓ రైలు ప్రయాణికుడి సెల్ఫీ వీడియో మరో ప్రయాణికుడి మరణం వెనకున్ మిస్టరీ ఛేదించిన ఘటన మహారాష్ట్రలోని కళ్యాణ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి: బ్యాంకు ఉద్యోగి ప్రభాస్ భాంగే హోలీ వేడుకలకు ఇంటికెళ్లి అనంతరం తిరిగి పూణే వెళ్లేందుకు ఈ నెల 24న సిద్దేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు. కానీ అనూహ్యంగా అతని మృతదేహం విఠల్వాడి రైల్వే స్టేషన్లో పట్టాలపై దర్శనమిచ్చింది. అయితే జారి పడి దుర్మరణం పాలై ఉంటాడని పోలీసులు తొలుత భావించారు. అయితే ఇక్కడే అసలు కథ వెలుగులోకిచ్చింది. రైలు విఠల్వాడి స్టేషన్ వద్దకు వచ్చేసరికి ప్రభాస్ భాంగే బయట రైలు డోరు దగ్గర నిలబడి ఉన్నాడు. ఇదే అదనుగా భావించిన సెల్‌ఫోన్ దొంగ ఆకాశ్ జాదవ్ హఠాత్తుగా అతని ఫోన్ లాక్కున్నాడు. అతని మొబైల్ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించినపుడు అదుపు తప్పి పట్టాలపై పోయాడు. అయితే ఈ మొత్తం ఉందంతం మరో రైలు ప్రయాణికుడు జాహిద్ జైదీ సెల్ఫీ వీడియోలో రికార్డు అయింది. జాహిద్ ఫోన్ కొట్టేసేందుకు కూడా ఆకాశ్ జాదవ్ ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు. అది వీడియోలో రికార్డు అయింది.దీనిపై అతను ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దీనిపై విచారించాల్సిందిగా పోలీసులను కోరాడు.ఇది వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానితుడిగా ఆకాశ్ జాదవ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు కూడా నిజం అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అతడి నుంచి ప్రభాస్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని రైల్వే పోలీసు అధికారి పండరీనాథ్ కాండే వెల్లడించారు. -
రైలు ప్రమాద ఘటనలో లోకో పైలట్ మధుసూదన్ రావు మృతి
-
ఎండకు రైలు పట్టాలే కాలిపోయినయ్
లండన్: భానుడి భగభగలకు.. ఏకంగా రైలు పట్టాలే కాలిపోయిన ఘటన ఇంగ్లండ్‌లో చోటు చేసుకుంది. వాండ్స్‌వార్త్ రోడ్, లండన్ విక్టోరియా మధ్య సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని సౌత్‌ఈస్ట్రన్ రైల్వే ఎండీ స్టీవ్ వైట్ ట్విటర్ ద్వారా ప్రకటించాడు. అయితే సకాలంలో సిబ్బంది స్పందించి మంటలను ఆర్పేసినట్లు ఆయన వెల్లడించారు. ఇక స్టీవ్‌ట్వీట్‌కు.. సిబ్బంది కూడా స్పందించారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు సవాల్‌గా మారనున్నాయని తెలిపారు. పట్టాలపై మరీ పొడి వాతావరణం ఉండడంతో ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. యూకేలో 34 డిగ్రీల సెల్సియస్ దాటితే.. ఇలాంటి పరిస్థితులు నెలకొనడం గమనార్హం. Thank you to @NetworkRailSE and the London Fire Brigade for responding promptly to a lineside fire this morning and allowing services to safely resume to Victoria 👇 pic.twitter.com/9ZYibliuyF — Steve White (@SteveWhiteRail) July 11, 2022 -
ఎల్‌హెచ్‌బీ కోచ్‌లంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏంటి?
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ఇటీవల కాలంలో రైల్వేలలో తరచుగా వినబడుతున్న మాట ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు (బోగీలు). ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ప్రస్తుతం పలు రైళ్లకు వినియోగిస్తున్నారు. క్రమక్రమంగా అన్ని పాత కోచ్‌లను తొలగించి వాటి స్థానంలో ఈ అధునాతన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను అన్ని రైళ్లకు జతచేయాలనేది రైల్వే ప్రతిపాదన. సాధారణ కోచ్‌లు నీలి రంగులో ఉండేవి. కానీ ప్రస్తుతం నడుస్తున్న ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఎరుపు రంగులో ఉంటున్నాయి. ఇవి కాకుండా క్రీం, బ్రౌన్ కలర్లో కూడా కొన్ని కోచ్‌లను మనం చూస్తుంటాం. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏంటి? పాత కోచ్‌లకు ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లకు తేడాలేంటి తెలుసుకుందాం. ఎక్కువ వేగం.. ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు తక్కువ బరువు ఉండడంతో గంటకు 200 కి.మీ వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటీకి ప్రస్తుతం గరిష్టంగా గంటకు 160 కి.మీల వేగంతో ప్రయాణించే విధంగా నడుపుతున్నారు. ఇవే పాత కోచ్‌లైతే కేవలం గంటకు110 కి.మీ గరిష్ట వేగంతో మాత్రమే నడిచేవి. ఎక్కువ సీటింగ్ సామర్థ్యం సాధారణ కోచ్‌ల కంటే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు సుమారు 1.25 మీటర్లు ఎక్కువ పొడవు కలిగి ఉండడం వలన ఎక్కువ సీటింగ్ సామర్థ్యం కలిగి ఉంటాయి. సాధారణ జనరల్ కోచ్‌లో 90 సీట్లుంటే అదే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లో 100 సీట్లు ఉంటాయి. సాధారణ స్లీపర్ కోచ్‌లో కేవలం 72సీట్లు /బెర్తులు ఉంటే అదే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో 80 సీట్లు/ బెర్తులు ఉంటాయి. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లంటే.. లింక్ హోఫ్మన్ బుష్‌కు సంక్షిప్త పదమే ఎల్‌హెచ్‌బీ. ఈ ఎల్‌హెచ్‌బీ అనేది జర్మన్ టెక్నాలజీ తయారీదారు పేరు. భారతీయ రైల్వేలో ప్రయాణికుల రైళ్లకు ఉపయోగించే కోచ్‌లను ఇటీవల కాలంలో ఈ ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీతో ఇండియాలోనే రైల్ కోచ్ ప్యాక్టరీ కపుర్తలా, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై, మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ రాయ్‌బరేలిలలో తయారు చేస్తున్నారు. ఈ కోచ్‌లు మనదేశంలో సుమారుగా 2000 సంవత్సరం నుంచి వినియోగిస్తున్నారు. భారతీయ రైల్వే ప్రారంభంలో 24 ఎల్‌హెచ్‌బీ ఏసీ కోచ్‌లను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ల కోసం జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంది. ఈ కోచ్‌లను మొదటగా న్యూ ఢిల్లీ–లక్నో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు ప్రవేశపెట్టారు. అనంతరం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా మనదేశంలో కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటి తయారీని ప్రారంభించారు. మన దేశంలో మొదట తయారైన కోచ్‌లు 2005 నుంచి అందుబాటులోకి వచ్చాయి. క్రమేపీ వీటిని చెన్నైలో, రాయ్‌బరేలీలో కూడా తయారు చేస్తున్నారు. ఈకోచ్లు యాంటీ టెలిస్కోపిక్ కావడం వలన ఏదైనా ప్రమాదాలు సంభవించినపుడు ఇవి ఒక దానిపై ఒకటి పడవు. దీనికోసం ఈ కోచ్‌లలో సెంటర్ బఫర్ కప్లింగ్ సిస్టంను వాడతారు. పాత కోచ్‌లలో అయితే డ్యూయల్ బఫర్ సిస్టంను వాడేవారు. ఆధునిక వసతులు... ► ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు కుదుపులు లేని ప్రయాణాన్ని అందిస్తాయి. ► సురక్షితమైనవి, మరింత సౌకర్యవంతమైనవి ► పాత కోచ్‌లతో పోలిస్తే ఇవి తక్కువ బరువు ఉంటాయి. ► మంచి డిజైన్లతో, స్టెయిన్లెస్ స్టీల్‌తో వీటిని తయారుచేయడం వలన ఇవి తుప్పుపట్టడానికి ఆస్కారం తక్కువ ► తక్కువ నిర్వహణ ఒక మిలియన్ కిమీ తరువాత మాత్రమే అవసరమైన సిస్టంలు (రీప్లేస్మెంట్, రిమూవల్ )మార్చుతారు. ► కోచ్ లోపల ఉన్నతమైన మోడరన్ ప్యానల్స్‌ను వినియోగించి రూఫ్, ఫ్లోర్లకు ఇంటీరియర్లు అమర్చారు. నిర్వహణ సమయాలలో వీటిని సులువుగా తీసుకుని, మళ్లీ పెట్టుకోవచ్చు. వాల్తేర్ డివిజన్ పరిధిలో .. వాల్తేర్ డివిజన్ పరిధిలో విశాఖపట్నం నుంచి బయలుదేరు, విశాఖపట్నంలో నిలిచిపోయే రైళ్లు ప్రస్తుతం 37 జతల వరకు ఉన్నాయి. వీటిలో ఇప్పటికీ సుమారు 6 జతల రైళ్లకు (15 రేక్‌లకు) పూర్తిగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను మార్చారు. మిగిలిన వాటికి కూడా అంచెలంచెలుగా మార్పు చేయనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడిచే విశాఖ రైళ్లు ► విశాఖపట్నం–న్యూఢిల్లీ–విశాఖపట్నం ఏపీ ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నం–కోర్బా–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నం–కడప–విశాఖపట్నం తిరుమల ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నం–నాందేడ్–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నం–కిరండూల్–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నం–అమృత్సర్–విశాఖపట్నం హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ -
రైల్వే ‘యూజర్’ బాదుడు!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ స్టేషన్లో రైలెక్కే ప్రయాణికులు ఇకపై యూజర్ చార్జీలు చెల్లించాల్సి రానుంది! దక్షిణమధ్య రైల్వే పరిధిలో తొలిసారిగా సికింద్రాబాద్ స్టేషన్లో యూజర్ చార్జీల అమలుకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సుమారు వెయ్యి స్టేషన్ల (ఏ–1)పునరాభివృద్ధిలో భాగంగా విమానాశ్రయాల తరహాలో ప్రయాణికుల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయనున్నట్లు ఇటీవల స్పష్టం చేసిన రైల్వే బోర్డు... ఈ జాబితాలో సికింద్రాబాద్ స్టేషన్‌ను చేర్చింది. అయితే తొలుత ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికే యూజర్ చార్జీలను పరిమితం చేయనుంది. ఫస్ట్ ఏసీ ప్రయాణికులపై రూ. 30 వరకు, సెకండ్, థర్డ్ ఏసీ ప్రయాణికులపై రూ. 30లోపు ఈ చార్జీలు విధించే అవకాశం ఉన్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సాధారణ బోగీలు, ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లను యూజర్ చార్జీల నుంచి మినహాయించనున్నారు. ప్రస్తుతం ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఏసీ బోగీల ప్రయాణికుల నుంచే చార్జీల వసూలును పరిమితం చేసినప్పటికీ దశలవారీగా స్లీపర్ క్లాస్, ఇతర కేటగిరీలకూ దీన్ని వర్తింపజేసే అవకాశం ఉంది. సికింద్రాబాద్ తరువాత క్రమంగా నాంపల్లి, కాచిగూడ, విజయవాడ, తిరుపతి స్టేషన్లకు యూజర్ చార్జీలను విస్తరించనున్నారు. వాస్తవానికి గతంలోనే రైల్వే బోర్డు ఈ ప్రతిపాదన చేసినప్పటికీ దేశంలో కరోనా వ్యాప్తి కారణంగా దీని అమలు వాయిదాపడింది. వేగంగా ప్రైవేటీకరణ.... ► రోజుకు 150 రైళ్లు, 1.85 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్ స్టేష న్లో వాహనాల పార్కింగ్, టాయిలెట్లు, తాగునీరు, విశ్రాంతి గదుల వంటి సేవలన్నీ పూర్తిగా ప్రైవేటు సంస్థల నిర్వహణలోనే ఉన్నాయి. ► సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి కోసం ఇండియన్ రైల్వేస్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐఆర్ఎస్డీసీ) గతంలోనే ప్రణాళికలను సిద్ధం చేసినప్పటికీ కరోనా దృష్ట్యా ఇన్వెస్టర్లు ముందుకు రాకపోవడంతో ఈ ప్రాజెక్టులో ప్రతిష్టంభన నెలకొంది. ► ఎయిర్‌పోర్టు తరహాలో స్టేషన్ రీ–డెవలప్మెంట్కు త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నట్లు ఐఆర్ఎస్డీసీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో యూజర్ చార్జీల విధింపు అంశం ముందుకొచ్చింది. రూ. లక్షల్లో ఆదాయం... ► సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైల్వేకు నిత్యం రూ. 1.65 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. ►ప్రతిరోజూ 80 వరకు నడిచే దూరప్రాంత రైళ్లలో సుమారు 30 వేల మంది ఏసీ బోగీల్లో ప్రయాణిస్తున్నట్లు అంచనా. ►ఏసీ ప్రయాణికులపై సగటున రూ.25 చొప్పున యూజర్ చార్జీలు విధిస్తే రోజుకు రూ.7.5లక్షల ఆదాయం లభించనుంది. ►ప్రయాణికుల సేవల్లో నాణ్యతను పెంచేందుకు యూజర్ చార్జీలను వినియోగించనున్నట్లు అధికారులు చెప్పారు. ►స్టేషన్ రీడెవలప్‌మెంట్‌లో భాగంగా సుమారు 2.5 ఎకరాల స్థలంలో షాపింగ్ మాల్స్, ఎంటర్టైన్మెంట్, హోటల్స్ వంటివి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. -
రైల్వేలో ఉద్యోగాల పేరుతో 40 మందికి టోకరా
తిరువళ్లూరు(తమిళనాడు): రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 40 మందిని మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులను తిరువళ్లూరు క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు తాలుకా బొమ్మరాజుపేటకి చెందిన సత్యరాజ్(29). ఇతనికి రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి 2.50 లక్షల రూపాయలను చిత్తూరు జిల్లా నగరి తాలుకా మేలప్పేడు గ్రామానికి చెందిన చిత్రయ్య కుమారుడు నాగరత్నం(53), అరక్కోణంకు చెందిన బాలాజీ (27) నగదు వసూలు చేశారు. అయితే ఉద్యోగం ఇప్పించకపోవడంతో తమ డబ్బు తిరిగి ఇవ్వాలని సత్యరాజ్ కోరాడు. అయినా వారు పట్టించు కోలేదు. దీంతో బాధితుడు తిరువళ్లూరు ఎస్పీ వరుణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు నాగరత్నం, బాలాజీని అరెస్టు చేశారు. విచారణలో సుమారు 40 మందికి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.1.93 కోట్లు మోసం చేసినట్లు తేలింది. దీంతో వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా ఉద్యోగాల పేరుతో డబ్బులు దండుకునే వారిపట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. -
ఐసోలేషన్ వార్డులుగా నాన్ఏసీ కోచ్‌లు
-
రైలుకింద పడి ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం మండలంలో సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో తమ ప్రేమను ఒప్పుకోకపోవడంతో రైలుకింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పిఠాపురం- గోర్స రైల్వే గేట్ దగ్గర ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. మృతదేహాలను చూసిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరిని ఏడిదకు చెందిన నందిన సూరిబాబుగా గుర్తించారు. యువతి వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇక నెలలో ఆరుసార్లేనట
న్యూఢిల్లీ: ఆన్లైన్ రైల్వే రిజర్వేషన్ విధానంలో భారత రైల్వే శాఖ మరోసారి కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇంటర్నెట్ ద్వారా టికెట్ల కొనుగోలుపై ఆంక్షలు విధించింది. ఇక మీదట నెలలో ఆరుసార్లు మాత్రమే రైల్వే టికెట్లను ఆన్లైన్లో బుకింగ్ చేసుకొనే విధంగా నిబంధనలను సవరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధన ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి రానున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు ఒక నెలలో ఈ-టికెటింగ్ ద్వారా పదిసార్లు టికెట్లను బుక్ చేసుకొనే వెసులుబాటు ఉండేది. తాజా పరిణామంతో తరచూ రైళ్లలో ప్రయాణం చేసేవారికి ఇక కొత్త తలనొప్పులు మొదలైనట్టే. రైల్వేశాఖ కొత్త నిబంధనలపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ-టికెటింగ్ విధానాన్ని ప్రమోట్ చేయాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహిరిస్తోందని ఆరోపిస్తున్నారు. చాలామంది సాధారణ ప్రయాణికులకు ఈ విధానం వల్ల అసౌకర్యం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఆన్లైన్ రైల్వే రిజర్వేషన్ విధానంలో చోటుచేసుకొంటున్న అక్రమాలకు తెరదించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు. దళారీలను నిరోధించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.