ఎండకు రైలు పట్టాలే కాలిపోయినయ్‌ | London Train Tracks Burst Into Flames Amid Soaring Temperatures | Sakshi
Sakshi News home page

అబ్బో ఏమి ఎండ.. ఏకంగా రైలు పట్టాలే కాలిపోయినయ్‌!

Published Mon, Jul 11 2022 9:25 PM | Last Updated on Mon, Jul 11 2022 9:25 PM

London Train Tracks Burst Into Flames Amid Soaring Temperatures - Sakshi

లండన్‌: భానుడి భగభగలకు.. ఏకంగా రైలు పట్టాలే కాలిపోయిన ఘటన ఇంగ్లండ్‌లో చోటు చేసుకుంది. వాండ్స్‌వార్త్‌ రోడ్‌, లండన్‌ విక్టోరియా మధ్య సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని సౌత్‌ఈస్ట్రన్‌ రైల్వే ఎండీ స్టీవ్‌ వైట్ ట్విటర్‌ ద్వారా ప్రకటించాడు. అయితే సకాలంలో సిబ్బంది స్పందించి మంటలను ఆర్పేసినట్లు ఆయన వెల్లడించారు. 

ఇక స్టీవ్‌ట్వీట్‌కు.. సిబ్బంది కూడా స్పందించారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు సవాల్‌గా మారనున్నాయని తెలిపారు. పట్టాలపై మరీ పొడి వాతావరణం ఉండడంతో ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. యూకేలో 34 డిగ్రీల సెల్సియస్‌ దాటితే.. ఇలాంటి పరిస్థితులు నెలకొనడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement