Tracks
-
దూసుకొస్తున్న రైలు.. ఎదురుగా 60 ఏనుగులు.. తరువాత?
గౌహతి: అస్సాంలో తృటిలో రైలు ప్రమాదం తప్పింది. లోకో పైలట్ అప్రమత్తతతో దాదాపు 60 ఏనుగులు ప్రమాదం బారి నుంచి బయపడ్డాయి. అర్దరాత్రి ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ దాటుతోంది.. ఇంతలో ఒక రైలు అతివేగంతో అదే పట్టాల మీదుగా వస్తోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)భద్రతా వ్యవస్థ లోకో పైలట్‌కు సిగ్నల్ రూపంలో ఈ విషయాన్ని తెలిపింది. వెంటనే లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు.మీడియాకు అందిన వివరాల ప్రకారం అక్టోబర్ 16న కమ్రూప్ ఎక్స్‌ప్రెస్ నడుపుతున్న లోకో పైలట్ జెడీ దాస్, అతని సహాయకుడు ఉమేష్ కుమార్ రాత్రి 8.30 గంటలకు హవాయిపూర్- లాంసాఖాంగ్ స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌ను దాటుతున్న ఏనుగుల గుంపును చూశారు. ఆ రైలు గౌహతి నుంచి లుమ్డింగ్కు వెళ్తోంది. వారు ఏనుగులను చూడగానే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు వేసి, ఏనుగుల గుంపునకు కొద్ది దూరంలో రైలును ఆపారు. దీంతో 60 ఏనుగులు ప్రమాదం బారి నుంచి బయటపడ్డాయి.ఈస్ట్ సెంట్రల్ రైల్వే తన పరిధిలోని అన్ని కారిడార్లలో ఏఐ వ్యవస్థను క్రమంగా నెలకొల్పుతోంది. రైల్వే ట్రాక్‌లోకి ప్రవేశించిన ఏనుగుల ప్రాణాలను కాపాడడంలో ఈ వ్యవస్థ విజయవతంగా పనిచేస్తోంది. తూర్పు మధ్య రైల్వే 2023లో 414 ఏనుగులను, ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 16 వరకు 383 ఏనుగులను రక్షించింది.ఇది కూడా చదవండి: Subrahmanyan Chandrasekhar: చుక్కల్లో చంద్రుడు -
రైలు ప్రమాదాలకు చెక్.. ఏఐ కెమెరాలతో నిఘా
భద్రత విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిఘా కెమెరాలను ఏర్పాటు చేయనుంది. పట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను దూరం నుంచే గుర్తించి లోకో పైలెట్లను అప్రమత్తం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రైళ్లు పట్టాలు తప్పడాన్ని నివారించడంతోపాటు ఉగ్రవాద, అసాంఘిక శక్తుల కుట్రలను తిప్పికొట్టే లక్ష్యంతో రైల్వేశాఖ వీటిని ఏర్పాటుచేయనుంది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమెరాల నిఘా కొనసాగుతుండగా.. నడుస్తున్న రైళ్లను మాత్రం ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) పరిజ్ఞానం ద్వారా పర్యవేక్షిస్తున్నారు.కానీ, నడిచే రైళ్లు ప్రమాదాలకు గురికాకుండా ముందుగానే అప్రమత్తంచేసే వ్యవస్థ ఇప్పటివరకు అందుబాటులో లేదు. –సాక్షి, అమరావతిమూడేళ్లలో 97 ప్రమాదాలు..ఇటీవలి కాలంలో దేశంలో రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురవుతున్న దుర్ఘటనలు గణనీయంగా పెరిగాయి. 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ ప్రమాదాలు 97 సంభవించాయి. కొన్నిచోట్ల విద్రోహశక్తులు రైలుపట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను ఉంచి కుట్రలు పన్నిన ఉదంతాలూ ఉన్నాయి. దీంతో రైలు పట్టాలపై ఈ తరహా వస్తువులను ముందుగానే గుర్తించి ప్రమాదాలు నివారించేందుకు రైళ్లలో ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.రూ.15 వేల కోట్లతో 75,000 ఏఐ కెమెరాలు..ఈ నేపథ్యంలో.. రూ.15 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో 75 వేల ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. 40 వేల బోగీలు, 14 వేల లోకోమోటివ్‌లు (ఇంజిన్లు), 6 వేల ఈఎంయూలలో ఈ కెమెరాలను ఏర్పాటుచేస్తారు. ప్రతి బోగీకి ఆరు కెమెరాలు, ప్రతి లోకోమోటివ్‌కు నాలుగు కెమెరాలను అమరుస్తారు. అక్టోబరు నుంచి ఏడాదిలోగా దశలవారీగా అన్ని రైళ్లలో ఏఐ కెమెరాల ఏర్పాటు పూర్తిచేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పలు కంపెనీలకు టెండర్లు అప్పగిస్తోంది. -
రైల్వే ట్రాక్‌లపై గస్తీ పెంపు
ఇటీవలి కాలంలో తరచూ రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని నివారించేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ పలు చర్యలు చేపడుతోంది. తాజాగా ఏఐ సాయంతో ట్రాక్‌లపై భద్రతను పెంచే దిశగా ముందుకు కదులుతోంది.ఆగస్టు 17న అహ్మదాబాద్‌కు వెళ్లే సబర్మతి ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ - భీమ్సేన్ జంక్షన్ మధ్య పట్టాలు తప్పింది. ఎవరో పట్టాలపై ఉంచిన భారీ వస్తువును ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు రైల్వేశాఖ గుర్తించింది. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని మున్ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రైల్వే ట్రాక్‌లపై పెట్రోలింగ్‌ను పెంచాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) సాయం తీసుకోవాలని వారు భావిస్తున్నారు.ఆర్పీఎఫ్తో పాటు ట్రాక్ మెయింటెనెన్స్ సిబ్బంది ఏడాది పొడవునా క్రమ వ్యవధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. కాగా సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం తర్వాత వారు మరింత అప్రమత్తంగా ఉన్నారని రైల్వే బోర్డు అధికారులు మీడియాకు తెలిపారు. అయితే ట్రాక్‌ల నిర్వహణకు సిబ్బంది కొరత కారణంగా ఏడాది పొడవునా నైట్ పెట్రోలింగ్ నిర్వహించడం లేదని గ్రౌండ్ రిపోర్టులు చెబుతున్నాయి. సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం విషయానికొస్తే ఈ సంఘటనకు ముందు నైట్ పెట్రోలింగ్ చేయలేదని అందుకే ప్రమాదం చోటుచేసుకున్నదని అధికారులు గుర్తించారు. రైలు రాకపోకలకు అంతరాయం కలిగించేందుకు ఎవరైనా ఆ భారీ వస్తువును పట్టాలపై ఉంచారా? అనే కోణంలో రైల్వే శాఖ దర్యాప్తు చేస్తోంది. -
విషాదం: రైలు పట్టాలు దాటుతూ దంపతులు మృతి..
శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరంలో విషాదం జరిగింది. రైలు పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తు దంపతులు మృతి చెందారు. పట్టాలు దాటుతున్న క్రమంలో రైలు ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాధితులను శ్రీరాములు (60), రాములమ్మ (55)గా గుర్తించారు పోలీసులు. శ్రీరాములు(60), రాములమ్మ(55)లు పట్టాలు దాటుతున్న క్రమంలో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. రైలు రాకను గమనించకుండా పట్టాలపైకి వెళ్లారని పేర్కొన్నారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన రైలు బాధితులను ఢీకొట్టిందని వెల్లడించారు. అయితే.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఇదీ చదవండి: Heart Attack: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి -
మొబైల్ కనిపించకుండా పోయిందా? డోంట్ వర్రీ - పరిష్కారమిదిగో..!
ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్ లేకుండా ఏ పని జరగదు అన్నంతగా అలవాటైపోయింది. ఇది కేవలం ఫోన్ కాల్స్‌కి మాత్రమే కాకుండా అనేక అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ఏం కావాలన్నా యూపీఐ యాప్స్ ద్వారా సింపుల్‌గా మనీ ట్రాన్సఫర్ చేస్తున్నారు. అలాంటి ఫోన్ పోతే ఒక్కసారిగా జరగాల్సిన పనులన్నీ ఆగిపోయినట్టనిపిస్తుంది. మనం ఈ కథనంలో కొన్ని యాప్స్ ద్వారా ఫోన్ ఎక్కడుందో సులభంగా కనిపెట్టే విషయాలు తెలుసుకుందాం. మీరు ఉపయోగించే స్మార్ట్ఫోన్లలో ఫ్రీ వైఫై యాప్స్‌లో ఏదైనా యాప్ ఇన్స్టాల్ అయి ఉంటే.. ఈ సందర్భాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి కేవలం ట్రాకింగ్ కోసం మాత్రమే కాకుండా చాలా అవసరాలకు ఉపయోగకరంగా ఉంటాయి. ఇవన్నీ కనిపించకుండా పోయిన ఫోన్లలో ఇన్స్టాల్ అయి ఉండాలి. అలాంటి ఐదు యాప్స్ ఇక్కడ చూద్దాం.. జియోలాక్ బీ (Geoloc.be) జియోలాక్ బీ అనే యాప్ ద్వారా మీరు పోగొట్టుకున్న ఫోన్ లొకేషన్ ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగకరమైన యాప్. ఎందుకంటే ఫోన్ నెంబర్ ద్వారా లొకేషన్ తెలుసుకోవడం మాత్రమే కాకుండా, రియర్ టైమ్ వంటి విషయాలను పసిగట్టవచ్చు. ఇదీ చదవండి: మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులున్నాయో ఇలా తెలుసుకోండి.. లేకుంటే ప్రమాదమే! లోకలైజ్ మొబీ (Localize Mobi) ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన లోకలైజ్ మొబీ కూడా లొకేషన్ ట్రాక్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కంట్రీ కోడ్, మొబైల్ నెంబర్ సాయంతో ఫోన్ లొకేషన్ ట్రాక్ చేయవచ్చు. అయితే ఈ యాప్ వినియోగదారుల విషయాలను ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు అందించే సమస్యే లేదు. ట్రూ కాలర్ (Truecaller) దాదాపు ట్రూ కాలర్ యాప్ గురించి తెలియని స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడు ఉండడు. ఎందుకంటే మనకు గుర్తు తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు దీని ద్వారానే సులభంగా అవతలి వ్యక్తి ఎవరనేది తెలుసుకోవడంలో సహాయపడుతుంది. దీని ద్వారా లొకేషన్ కూడా తెలుసుకోవచ్చు. పోయిన ఫోన్ వెతకడంలో కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్కానరో.ఐఓ (Scannero.io) కనిపించకుండా పోయిన ఫోన్ వెతకడంలో ఈ యాప్ కూడా ఉపయోగపడుతుంది. దీని ద్వారా లొకేషన్ తెలుసుకోవచ్చు. ఇది కేవలం ఫోన్ నెంబర్ ఆధారంగా లొకేషన్ ట్రాక్ చేస్తుంది. ఇదీ చదవండి: ఆశ్చర్యపరుస్తున్న రూపాయి చరిత్ర - 1947 నుంచి 2023 వరకు.. యోట్రాకర్ (yoTracker) ఇప్పటివరకు మనం చెప్పుకున్న యాప్‌లలో ఇది చాలా ఉత్తమమైనదని భావిస్తారు. జీపీఎస్‌ను సమర్థవంతంగా వాడుకోవడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. నిజానికి ఈ యాప్ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా వెబ్సైట్లోకి వెళ్లి ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మిగిలిన ప్రోగ్రామ్ అదే జరుగుతుంది. తద్వారా లొకేషన్ తెలుస్తుంది. -
జనాదరణ కోసం పిచ్చి పనులా?.. వైరల్ వీడియోపై సజ్జనార్ ట్వీట్..
అందరూ తమను గుర్తించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఏదైనా గొప్పగా సాధించి మంచి పేరు సాధించాలని కోరుకుంటారు. కానీ ఈ మధ్య దీనికి భిన్నమైన సోషల్ మీడియా సంస్కృతి విస్తరిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా వైరల్ అయ్యే పనులు చేసి పేరు తెచ్చుకోవాలని కొందరు పిచ్చి పనులు చేస్తున్నారు. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వీడియోనే తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువకుడు రైలు పట్టాలపై నిలిచి ఉంటాడు. రైలు రాక కోసం తీక్షణంగా ఎదిరి చూస్తుంటాడు. రైలు వచ్చే ముందే పట్టాల మధ్యలో పటుకుంటాడు. అతి వేగంగా వెళ్తున్న రైలు క్షణాల్లోనే అతన్ని దాటుకుని వెళ్లిపోతుంది. పట్టాల మధ్యలో పడుకున్న యువకుడు సేఫ్‌గా బయటపడతాడు. కానీ రైలు వేగానికి యువకుడు ఏమాత్రం పైకి లేచినా.. ఇంకమన్నా ఉందా..? ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిపిపోయేవి. ఈ వీడియోని తెలంగాణ ఆర్టీసీ బాధ్యతలు చేపడుతున్న ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. జనాదరణ కోసం జీవితాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? అంటూ రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పేమస్ కోసం సాహసాలు చేస్తే.. చిన్న పొరపాటు జరిగిన ప్రాణాల మీదికి వస్తుంది. జనాదరణ కోసం జీవితాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/wc3BSQVhA1 — V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 2, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ బాధిత యువకున్ని ఫూలిష్‌గా పేర్కొన్నారు. కేవలం ఎవరో గుర్తుంచాలని ప్రాణాలకు తెగించడం పిచ్చి పనిగా పేర్కొంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు ఇలాంటి పిచ్చి పనుల్ని చేయొద్దంటూ సలహాలు సూచనలు ఇస్తున్నారు మరొకొందరు. ఆ యువకుడు చేసిన పిచ్చి పనేంటో మీరూ చూసేయండి మరి..! ఇదీ చదవండి: కునోలో మరో చీతా మృతి.. ఐదు నెలల్లోనే తొమ్మిది.. -
ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్ భయ్యా! ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న వీడియో
సాక్షి, ముంబై: ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ థ్రిల్లింగ్ ట్రైన్ జర్నీ అంటే చాలామంది ఇష్టపడతాం. ట్రాఫిక్ గందర గోళం లేకుండా, రింగ్ రోడ్లు, రాంగ్ టర్న్‌లు లాంటి బాదరబందీ లేకుండా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. చుక్ చుక్ బండితో చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ గ్రామీణ ప్రాంతాలను చూస్తూ రైలు ప్రయాణం భలే సరదాగా ఉంటుంది. అయితే ఎక్కేటపుడు దిగేటపుడు అప్రమత్తంగా ఉండటం అంతే అవసరం. (MG Comet EV: ఎంజీ కామెట్ కాంపాక్ట్ ఈవీ వచ్చేసింది..యూజర్లకు పండగే!) తాజాగా పట్టాల మీద రైలు పాములాగా వంకర్లు పోతూ వెడుతున్న వీడియో ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఇది రైలా, పామా మీరే చెప్పండి అటూ సౌరభ్ అనే ట్విటర్ యూజర్ ఈవీడియోను పోస్ట్ చేశారు. మహారాష్ట్రలోని పూర్ణ జంక్షన్ లోనిది ఈ వీడియో అని కూడా వెల్లడించారు. ఇప్పటికే ఈ వీడియోకు 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేలాది లైక్స్‌ను సొంతం చేసుకుంది. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) Train or Snake ? You Decide 😁 📍PURNA Junction, Maharashtra pic.twitter.com/1EhkS0qydP — Saurabh • Trainwalebhaiya (@trainwalebhaiya) April 25, 2023 -
బతుకుబండి ట్రాక్ తప్పుతోంది!
బనశంకరి: రాష్ట్రంలో రైలు పట్టాలు రక్తసిక్తమవుతున్నాయి. అందమైన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతోంది. గత మూడేళ్లలో రైలు కిందపడి 1,455 మంది ఆత్మహత్య చేసుకోగా, 7 ఏళ్లలో రైల్వే ప్రమాదాల వల్ల 5,210 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 2020లో 413 మంది రైలు కిందపడి ప్రాణాలు తీసుకోగా, 2021లో ఈ సంఖ్య 668 మందికి పెరిగింది. గత 6 నెలల్లో 374 మంది ఇలా తనువు చాలించారు. రెండేళ్ల కాలంలో చూస్తే ఇందులో పురుషులు 1,305 మంది, మహిళలు 150 ఉన్నారని రైల్వేపోలీసులు తెలిపారు. ఆత్మహత్యలకు కారణాలేమిటి? రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం వెనుక కుటుంబ సమస్యలు, ప్రేమ వైఫల్యం, ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, పరీక్షల్లో ఫెయిల్ కావడం, వరకట్న వేధింపులు బలమైన కారణాలుగా ఉంటున్నాయి. ఇందులో యువకుల సంఖ్య ఎక్కువగా ఉంది. పట్టాల మీద తలపెట్టి ప్రాణాలు తీసుకోవడం ఇటీవల ఎక్కువగా నమోదవుతోందని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ విధంగా చేస్తే కచ్చితంగా చనిపోతామనే భావనతో ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారని మానసిక నిపుణులు పేర్కొన్నారు. కొన్నిచోట్ల హత్య చేసి ఆత్మహత్య అనిపించడానికి రైలు పట్టాలపై మృతదేహాలను పడేస్తున్న ఉదంతాలు చాలా ఉన్నాయని రైల్వే పోలీసులు చెప్పారు. ఈ విషయమై రైల్వే పోలీస్ ఎస్పీ డీఆర్ సిరిగౌరి మాట్లాడుతూ జీవితంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవాలి. ఆత్మహత్యకు పాల్పడటం సరికాదు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునే కేసుల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. రైలు ప్రమాదాలూ తక్కువ కాదు ప్రతినెలా సరాసరి 55– 60 మంది రైల్వే ప్రమాదాలకు బలి కావడం గమనార్హం. రైలు వస్తోందా లేదా అని చూడకుండా పట్టాలు దాటడం, ఇయర్ ఫోన్లలో సంగీతం వింటూ, మొబైల్లో మాట్లాడుతూ దాటడం, ఖాళీగా ఉన్న ట్రాక్‌పై వాకింగ్ చేయడం, నిద్రించడం, సెలీ్ఫలు తీసుకోవడం రైలు ప్రమాదాలకు కారణాలు. ఇలా 2017లో 654 మంది, 2018లో 487, 2019లో 614 మంది, 2020 నుంచి 2022 జూన్ వరకు 826 మందికి పైగా బలయ్యారు. (చదవండి: పక్కా ప్లాన్‌తో అంగన్వాడీ సెంటర్ పక్కనే ఇల్లు అద్దెకు.. జెండా వందనం చేశాక...) -
ఎండకు రైలు పట్టాలే కాలిపోయినయ్
లండన్: భానుడి భగభగలకు.. ఏకంగా రైలు పట్టాలే కాలిపోయిన ఘటన ఇంగ్లండ్‌లో చోటు చేసుకుంది. వాండ్స్‌వార్త్ రోడ్, లండన్ విక్టోరియా మధ్య సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని సౌత్‌ఈస్ట్రన్ రైల్వే ఎండీ స్టీవ్ వైట్ ట్విటర్ ద్వారా ప్రకటించాడు. అయితే సకాలంలో సిబ్బంది స్పందించి మంటలను ఆర్పేసినట్లు ఆయన వెల్లడించారు. ఇక స్టీవ్‌ట్వీట్‌కు.. సిబ్బంది కూడా స్పందించారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు సవాల్‌గా మారనున్నాయని తెలిపారు. పట్టాలపై మరీ పొడి వాతావరణం ఉండడంతో ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. యూకేలో 34 డిగ్రీల సెల్సియస్ దాటితే.. ఇలాంటి పరిస్థితులు నెలకొనడం గమనార్హం. Thank you to @NetworkRailSE and the London Fire Brigade for responding promptly to a lineside fire this morning and allowing services to safely resume to Victoria 👇 pic.twitter.com/9ZYibliuyF — Steve White (@SteveWhiteRail) July 11, 2022 -
బడ్జెట్లో డబ్లింగ్‌కు రూ.200 కోట్లు..
సాక్షి, మహబూబ్‌నగర్: సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ పరిధిలో మహబూబ్‌నగర్ స్టేషన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మహబూబ్‌నగర్ స్టేషన్ నుంచి ప్రతినిత్యం 5వేల నుంచి 6వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రై ల్వే క్రాసింగ్‌తో హైదరాబాద్ వెళ్లాలన్నా.. రా వాలన్నా గంటలతరబడి సమయం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు డబ్లింగ్ రైల్వే లైన్‌కు నిధులు కేటాయించాలని గత పదేళ్ల నుంచి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో నాలుగేళ్ల నుంచి కేంద్ర బడ్జెట్లో మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్‌కు అధికంగా నిధులు కేటాయిస్తున్నారు. బడ్జెట్లో డబ్లింగ్‌కు రూ.200 కోట్లు.. దాదాపు రూ.728 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్‌కు నాలుగేళ్ల నుంచి మెరుగైన నిధులు కేటాయిస్తున్నారు. గతేడాది బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించగా ఈ సారి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ఈ రైల్వేలైన్ పనులు జిల్లా పరిధిలో ముమ్మరంగా కొనసాగుతుంది. ఉందానగర్ నుంచి ప్రారంభమైన డబ్లింగ్ రైల్వే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది డిసెంబర్ చివర్లో లేదా జనవరి వరకు గొల్లపల్లి వరకు డబ్లింగ్‌లైన్ పూర్తయ్యేలా ముమ్మరంగా పనులు చేపడుతున్నారు. డబ్లింగ్‌లైన్‌లో భాగంగా విద్యుద్దీకరణ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. బాలానగర్, రాజాపూర్, గొల్లపల్లి రైల్వే స్టేషన్లలో నూతన భవనాల పనులకు శ్రీకారం చుట్టారు. గొల్లపల్లి స్టేషన్లో ఫ్లైవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. బాలానగర్ వాగుమీద రైల్వే వంతెన నిర్మిస్తున్నారు. చురుగ్గా సాగుతున్న డబ్లింగ్‌లైన్, విద్యుద్దీకరణ పనులు డబ్లింగ్తో తగ్గనున్న దూరభారం.. సికింద్రబాద్–మహబూబ్‌నగర్ రైల్వే డబ్లింగ్‌లైన్ పూర్తయితే జిల్లా ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు లభిస్తుంది. మహబూబ్‌నగర్ నుంచి 100 కిలోమీటరు దూరంలో ఉన్న సికింద్రాబాద్‌కు వెళ్లడానికి ప్యాసింజర్‌కు 3 గంటలు, ఎక్స్‌ప్రెస్‌కు 2.30 గంటల సమయం పడుతుంది. డబ్లింగ్ లైన్ పూర్తయితే ఒక గంట సమయం ఆదా అయ్యే పరిస్థితి ఉంది. వాణిజ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ప్రయాణికులకు సౌకర్యం ఈ ఏడాది బడ్జెట్లో మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్‌కు అధిక నిధులు కేటాయించారు. నిధులతో డబ్లింగ్ రైల్వే పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. మరిన్ని నిధులు కేటాయించి డబ్లింగ్ లైన్‌ను త్వరితగతిన పూర్తిచేయాలి. డబ్లింగ్ లైన్ పనులు పూర్తయితే ప్రయాణికులకు ఎంతో సౌకర్యం లభిస్తుంది. క్రాసింగ్ ఉండవు. దీంతో గంటలోపే సికింద్రాబాద్‌కు వెళ్లే అవకాశం ఉండడంతో ప్రయాణికులు సంఖ్య కూడా పెరుగుతుంది. సమయం ఆదా అవుతుంది. విద్యార్థులు, ఆస్పత్రులకు వెళ్లేవారికి వెసులుబాటులో ఉంటుంది. – ఎస్కే పీరాన్, రిటైర్డ్ సీనియర్ సీసీఐ -
కొత్త రైళ్లకు పట్టాల్లేవ్
* దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గరిష్ట స్థాయికి చేరిన లైన్ల వినియోగం * ఇక కొత్త రైళ్లను నడిపే అవకాశం లేనట్లే * రద్దీ వేళ అదనపు రైళ్లు నడపలేమని బోర్డుకు తేల్చిచెప్పిన దక్షిణ మధ్య రైల్వే * లైన్ల వినియోగం 170 శాతాన్ని మించిందంటున్న అధికారులు * బల్లార్షా-కాజీపేట-విజయవాడ-చెన్నై మూడో లైన్ వేస్తేనే సమస్యకు పరిష్కారం గరిష్ట వినియోగ స్థాయిని మించి వాడుతున్న మార్గాలు సికింద్రాబాద్-కాజీపేట బల్లార్షా-కాజీపేట కాజీపేట-విజయవాడ విజయవాడ-విశాఖపట్నం విజయవాడ-చెన్నై సాక్షి: ‘దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైల్వే లైన్ల గరిష్ట సామర్థ్యాన్ని మించి.. ప్రమాదకర స్థితిలో రైళ్లను నడుపుతున్నాం. లైన్ల వినియోగం ప్రస్తుతం 170 శాతానికిపైగా ఉంది. అన్ని ప్రధాన లైన్ల పరిస్థితీ అదే. ఆయా మార్గాల్లో మూడో లైన్ నిర్మాణం జరిగితేనే సమస్య పరిష్కారమవుతుంది. రద్దీ సమయాల్లో అదనపు రైళ్లను నడపటమంటే పెద్ద రిస్క్ చేస్తున్నట్టే..’.. ఇటీవల రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే జీఎం చేసుకున్న విన్నపం సారాంశమిది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అవసరమైన స్థాయిలో రైల్వే లైన్లు లేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే అన్ని లైన్లను గరిష్ట వినియోగ సామర్థ్యానికి మించి వినియోగిస్తున్నారు. ఇది ప్రమాదకరమని తెలిసినా పెరిగిన రద్దీ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగిస్తున్నారు. దీనికితోడు ప్రత్యేక రైళ్లను నడపాలంటే సాధ్యం కాదని రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. పండుగల సమయంలో బలవంతంగా అదనపు రైళ్లు నడపడం ప్రమాదకరమని తేల్చి చెప్పింది. తాజాగా సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి 120 అదనపు రైళ్లను నడిపినా.. ఏ క్షణాన ఏమవుతుందోనని వణికిపోయింది. స్వయంగా జీఎం మొదలు అధికారులు, సిబ్బంది అంతా శ్రమించి, జాగ్రత్తగా అదనపు రైళ్లను నడిపి ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి ఇంత రద్దీ వేళ మరో 200 వరకు అదనపు ైరె ళ్లను నడపాల్సిన అవసరమున్నా... లైన్లపై ఒత్తిడి పెరగడంతో చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. ఇది రైల్వేశాఖకే కాకుండా ప్రత్యక్షంగా తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సవాల్‌గా పరిణమించనుంది. ఏపీ వైపు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరడంతో నల్లగొండ జిల్లా పరిధిలో రోడ్లపై ట్రాఫిక్ భారీగా పెరిగి, ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వేపై ఒత్తిడి చేయకతప్పని పరిస్థితి ఉంది. కాగితాలకే పరిమితం.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రధాన మార్గాల్లో మూడో లైన్‌ను నిర్మించాల్సి ఉంది. ఒక మార్గాన్ని సరుకు రవాణాకు కేటాయిస్తే... మిగతా రెండు లైన్లను ప్రయాణికుల రైళ్లకు వాడే అవకాశం ఉంటుంది. కానీ ఇది ముందుకు సాగడం లేదు. కాజీపేట మీదుగా బల్లార్షా నుంచి విజయవాడ-చెన్నై వరకు మూడో లైన్ నిర్మాణానికి ఆరేళ్ల క్రితమే పచ్చజెండా ఊపినా... కనీసం భూసేకరణ కూడా జరగలేదు. ఈ పనులకు రూ. 3వేల కోట్లకు పైగా అవసరంకాగా ఇచ్చింది రూ.200 కోట్లే. ఈ మార్గంపై ఒత్తిడి తగ్గించేందుకు గుంటూరు-పగిడిపల్లి-నడికుడి మార్గాన్ని డబ్లింగ్ చేసే అవకాశమున్నా నిధులివ్వడం లేదు. ఇక బీబీనగర్-విజయవాడ ప్రత్యామ్నాయ మార్గానికి పచ్చజెండా ఊపినా.. కనీసం సర్వే చేసేందుకే నిధులు ఇవ్వలేదు. ఇలా డజనుకుపైగా పనులు ఏళ్లుగా కాగితాలకే పరిమితమయ్యాయి. వేగం పెంచితే కొంత ప్రయోజనం.. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్లు గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడుస్తున్నాయి. ఈ వేగాన్ని 150 కిలోమీటర్లకు పెంచాలనేది కేంద్రం నిర్ణయం. ఇదే జరిగితే రైల్వే ట్రాఫిక్ సమస్య కొంతవరకు పరిష్కారమవుతుంది. ఈ మేరకు సికింద్రాబాద్-చెన్నై, హైదరాబాద్-నాగ్‌పూర్ మార్గాల్లో సెమీ బుల్లెట్ రైళ్లను ప్రవేశపెడతామని రెండేళ్ల క్రితం ప్రకటించారు. ఆ వేగానికి తగినట్లుగా లైన్లను పటిష్టం చేయాల్సి ఉంటుంది. ఇందుకు రూ. 2వేల కోట్ల వరకు అవసరం. కానీ ఇచ్చింది రూ.100 కోట్లే. హా రైల్వేకు సరుకు రవాణా ద్వారా ఎక్కువ ఆదాయం వస్తోంది. దీంతో గూడ్స్ రైళ్లను పెద్దసంఖ్యలో పెంచుతున్నారు. కానీ అందుకు తగ్గట్లు కొత్త లైన్ల నిర్మాణం, పాత వాటి విస్తరణ జరగడం లేదు. దీనివల్ల లైన్లపై ఒత్తిడి పెరిగి, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హా సాధారణంగా ఒక రైలు తదుపరి స్టేషన్ దాటే వరకు మరో రైలుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వరు. కానీ పెరిగిన ట్రాఫిక్ రద్దీ వల్ల స్టేషన్‌కు స్టేషన్‌కు మధ్య అదనంగా ప్రత్యేక సిగ్నల్స్ ఏర్పాటు చేసి... ఆ సిగ్నల్ దాటగానే మరో రైలుకు అనుమతి ఇస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని తెలిసినా... తప్పని స్థితిలో అమలు చేస్తున్నారు. -
కెమెరాల్లేకుండానే నిఘా వ్యవస్థ..
ఇప్పుడు ఇంట్లో నిఘా కెమెరాల్లేకుండానే ఇంటికి భద్రత కల్పించుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. మీ ఇంట్లో ఎవరు సంచరిస్తున్నారు అన్న విషయాన్ని ఓ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. 'గ్జాండెమ్ హోమ్' పేరిట రానున్న ఈ కొత్త ఉత్పత్తి... ఇంట్లోని ప్రతి కదలికలనూ హ్యారీ పాటర్ మాయా మరుడర్స్ మ్యాప్ వంటి ఓ చిన్న డిజిటల్ పరికరంద్వారా గుర్తిస్తుంది. కెమెరాలకు బదులుగా ప్లగ్ ఇన్ నోడ్స్ ను ఉపయోగించి ఓ సాలెగూడులా ఇంల్లంతా రేడియో తరంగాలు వ్యాపింపచేయడం వల్ల ఇంట్లోని ప్రతి కదలికనూ ఈ వ్యవస్థ శులభంగా గుర్తించగల్గుతుంది. ట్రెడిషనల్ మోషన్ డిటెక్షన్ సిస్టమ్ తో వచ్చే తప్పుడు అలారాలు, పరిమిత కవరేజ్ వంటి సమస్యలు పరిష్కరిస్తూ, ఇల్లంతా నిఘా వ్యవస్థను అందుబాటులో ఉండేలా చేస్తుంది. ఈ వ్యవస్థను నేషనల్ సైన్స్ ఫౌండేషన్ మరియు హోం ల్యాండ్ సెక్యూరిటీ సంయుక్త ఆధ్వర్యంలో సంవత్సరాల తరబడి నిర్వహించిన పరిశోధనల అనంతరం ఉత్సత్తి చేశారు. ఇది ఇన్ స్టాల్ చేయడానికి కేవలం 15 నిమిషాల సమయం పడుతుంది. 10 నుంచి 15 నోడ్స్ ఉండే ఈ కిట్ ను... వాల్ సాకెట్ కు ప్లగ్ అమర్చుకునేలా రూపొందించారు. గేట్ వే ను రూటర్ కు పెట్టి... ఇల్లంతా గుర్తించగలిగేట్లుగా ముందుగా వినియోగదారులు ఓ మ్యాప్ ను యాప్ లో డ్రా చేయాలి. ఇలా చేసిన తర్వాత వ్యవస్థ ప్రారంభమౌతుంది. గూడులా ఉన్న ఇన్విజిబుల్ సెన్సార్ల ద్వారా ఇంట్లో రేడియో తరంగాలు ప్రసరిస్తాయి. అయితే ఎవరైనా ఈ గూడువంటి వ్యవస్థను కదిపితే మాత్రం రేడియో తరంగాలకు భంగం కలిగే అవకాశం ఉంది. అయితే ఇంట్లో ఒక్కసారి కదలికలను యాప్ గుర్తించగలిగిందంటే అవి డైరెక్ట్ గా మ్యాప్ లోని ఏ స్థానంలో జరుగుతోందో వినియోగదాలుల స్మార్ట్ ఫోన్ కు హెచ్చరికలు పంపిస్తుంది. లైట్లు, అలారం వంటి హెచ్చరికలతో వినియోగదారులు అవసరాన్ని బట్టి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా కొత్త ఉత్పత్తి కాదని, కేవలం కొత్త సాంకేతికతలు కలిగిన పరికరం అని... దీని వ్యవస్థాపకుడు సాల్ట్ లేక్ సిటీలో నివసించే 35 ఏళ్ళ జో విల్సన్ అంటున్నాడు. 'గ్జాండెమ్ హోమ్' తో ఇంట్లోకి చొరబడిన అపరిచిత వ్యక్తులను ఎటువంటి అనుమానం రాకుండా... శులభంగా గుర్తించవచ్చని చెప్తున్నాడు. రెండు సైజుల్లో దొరికే ఈ గ్జాండెమ్ హోమ్ కిట్ ను కొనుగోలు చేయాలనుకున్నవారు ఆన్ లైన్ (Indiegogo) ద్వారా ముందుగానే ఆర్డర్ చేసుకోవచ్చు. సుమారుగా ముఫై వేల రూపాయలతోపాటు షిప్పింగ్ ఛార్జీలను ఆన్ లైన్ లో చెల్లించి బుక్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కేవలం పదిహేడు రోజుల్లో అనుకున్న టార్గెట్ కు అమ్మకాలు చేరాయని.. తమ ప్రచారం లక్ష్యాన్ని చేరుకుంటే 2016 ఆగస్టు నాటికి ఈ నిఘా పరికరం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని చెప్తున్నారు. -
రైల్వే ట్రాక్ లనూ వదలని సెల్ఫీల పిచ్చి..
యాండ్రాయిడ్ ఫోన్ల పుణ్యమాని... జనంలో సెల్ఫీల పిచ్చి రోజు రోజుకూ ముదిరిపోతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధికి వినియోగించుకోవడం మంచిదే. కానీ వేళాపాళా, సమయం సందర్భం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఫొటోలకు పోజులిచ్చేస్తూ.. అనవసరమైన ప్రమాదాలను కొనితెచ్చుకోవడం ఇటీవల బాగా పెరిగిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సీసీ టీవీ ఫుటేజ్ ను చూస్తే.. జనం ఏ లెవెల్ లో సెల్ఫీలు దిగుతున్నారో షాకింగ్ కు గురిచేస్తోంది. ఎప్పుడూ పాసింజర్లతో రద్దీగా ఉండే ఇంగ్లాండ్ డర్బీషైర్ మ్యాట్ లాక్ బాత్ స్టేషన్ ప్రాంతం... ఇప్పుడు సెల్ఫీల పిచ్చోళ్ళకూ కేంద్రంగా మారింది. పిల్లలు, టీనేజర్లు, ఫ్యామిలీలు ఒక్కరేమిటీ అక్కడినుంచీ ప్రయాణించే ప్రతివారూ ట్రైన్ వచ్చేలోపూ ఏకంగా పట్టాలమీదే సెటిలైపోతున్నారు. లెవెల్ క్రాసింగుల్లో ట్రైన్ వస్తుందని కూడా చూడకుండా సెల్ఫీలు తీసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఉన్నట్టుండి రైలు వస్తే ప్రాణాలకే ప్రమాదమని రైల్వే బాసులు చెప్పినా పట్టించుకోవడం లేదు. తాజాగా న్యూయార్క్ రైల్ రిలీజ్ చేసిన ఓ వీడియో ఫుటేజ్ ను పరిశీలిస్తే భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ట్రాక్ లపై ఆటలాడుతూ, నడుస్తూ ఫొటోలకు పోజులివ్వడమే కాక, ఫోనుల్లో మెసేజ్ లు పంపుతూండటం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఏకంగా ఓ తల్లి తన పిల్లలను ఫొటో తీసేందుకు ట్రాక్ పై కూర్చోపెట్టడం... రైల్వే అధికారులను షాక్ అయ్యేట్టు చేసింది. ట్రైన్ వచ్చే సమయంలో గేట్లు మూసుకుపోతాయని, పట్టాలపై ఉన్నవారు జాగ్రత్త వహించాలని రైల్వే సిబ్బంది హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా ట్రాక్ లపై కాలక్షేపం చేయడం విస్మయ పరుస్తోంది. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వ్యక్తులను గుర్తించి వారిని మందలించేందుకు సిద్ధమౌతున్నారు. అందుకు ప్రజల సహాయం కూడ తీసుకుంటున్నారు. లెవెల్ క్రాసింగ్ ల వద్ద సుందరమైన ప్రాంతాలను చిత్రీకరించడం ఎంతో ఆనందాన్నివ్వచ్చు. కానీ అది ఎంతమాత్రం మంచిది కాదు. రైల్వే ట్రాక్ లు... ప్లే గ్రౌండ్లు కాదు అంటున్నారు నెట్ వర్క్ రైల్ ఆపరేషన్స్ రిస్క్ ఎడ్వైజర్ మార్టిన్ బ్రౌన్. ట్రైన్ ఎప్పుడైనా, ఎటువైపునుంచైనా వచ్చే అవకాశం ఉంటుందని, ట్రాక్ లపై ఫోటోలు దిగడం, ఛాటింగ్ చేయడం, ఆటలాడటం తగదని, ప్రమాదాలకు దారితీస్తుందని ఆయన హెచ్చరిస్తున్నారు. మ్యాట్ లాక్ బాత్ స్టేషన్ మీదుగా రోజూ సుమారు 30 ట్రైన్స్ వెడుతుంటాయని, ఇక్కడ సుమారు 5 వందల మంది సైకిలిస్టులు, పాదచారులు లెవెల్ క్రాస్ చేస్తుంటారని, ఇటువంటి రద్దీ ఉండే క్రాస్ వద్ద ఉన్న స్టాప్.. లుక్... లిజన్... వంటి సూచనలు తప్పకుండా ప్రయాణీకులు ఫాలో అవ్వాలని లేదంటే ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. విక్టోరియన్ రైల్వే నెట్ వర్క్ లో అంతర్భాగంగా బ్రిటన్ మొత్తం సుమారు 6 వేల వరకూ లెవెల్ క్రాసింగ్ లు నిర్మించారని, వాటిని సద్వినియోగం చేసుకోకుంటే ప్రమాదాలకు హేతువుగా మారుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తమ తమ పిల్లలను బయటకు పంపేప్పుడు కుటుంబ సభ్యులు, ఇంట్లోని వారు తగు జాగ్గత్తలు చెప్పాలని, ప్రమాదం జరిగిన తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదని బ్రిటిష్ ట్రాన్స్ పోర్ట్ పోలీస్ అధికారి ఎడ్డీ కార్లిన్ హెచ్చరిస్తున్నారు. తాజా ఫుటేజ్ ను బట్టి చూస్తే.. ఎంత గస్తీ ఏర్పాటు చేసినా ప్రజలు కూడ తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రయోజనం ఉండదని, ఫోటోల సరదా ప్రాణాలనే తీస్తుందని అంటున్నారు. -
రైలు పట్టాలపై ఏడు రాకెట్లు
చండిగఢ్: రైలు పట్టాలపై రాకెట్లు కలకలం సృష్టించాయి. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించాయి. దీంతో వందలమంది ప్రయాణీకులు గంటల తరబడి రైళ్లలో కూర్చోవాల్సిన గత్యంతరం తలెత్తింది. నిత్యం రద్దీగా ఉండే అంబాలా- ఢిల్లీ రైల్వే మార్గంలో షాబాద్ నగరం వద్ద ఓ పెట్టెలో ఏడు రాకెట్ లాంచర్లు బయటపడ్డాయి. పట్టాలపై వీటిని కొందరు స్థానికులు గుర్తించడంతో అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది ఒక్క సారిగా ముందస్తు భద్రత దృష్ట్యా రైళ్లను ఆపేశారు. ఆ ఏడు రాకెట్లు కూడా ఎంతో శక్తిమంతమైనవి. హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. షాబాద్ రైల్వే స్టేషన్ దోలా మజ్రా అనే గ్రామం మధ్యలో వీటిని ఎవరో ఉంచి వెళ్లారు. ఈ విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు ఘటన స్థలికి చేరుకున్నారు. చుట్టుపక్కల కొద్ది దూరంపాటు నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఈ బాంబులను నిర్వీర్యం చేసేందుకు మిలటరీ నుంచి ప్రత్యేక అధికారుల సహాయం కోరినట్లు తెలిపారు. ఈ ఘటనకు కారణమైన గుర్తు తెలియని వ్యక్తులపై పేలుడు పదార్థాల నిషేధ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. దాదాపు 4.30గంటల తర్వాత రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. మొత్తం పన్నెండు రైళ్లపై ఈ ప్రభావం పడింది. -
రేపు సెంట్రల్, హార్బర్ మార్గాల్లో మెగాబ్లాక్
సాక్షి, ముంబై: రైల్వే ట్రాక్స్, సిగ్నల్స్, ఇతర సాంకేతిక పరికరాల నిర్వహణ పనుల నిమిత్తం ఆదివారం సెంట్రల్, హార్బర్ మార్గంలో మెగాబ్లాక్ ప్రకటించారు. దీని కారణంగా కొన్ని రైళ్లను దారిమళ్లించగా మరికొన్నింటిని రద్దు చేసినట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. అందులో భాగంగా సెంట్రల్ రైల్వే మార్గంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఠాణే-కల్యాణ్ స్టేషన్ల మధ్య డౌన్ ఫాస్ట్ మార్గంలో మెగాబ్లాక్ ఉంటుంది. దీంతో ఠాణే నుంచి కల్యాణ్ దిశగా వెళ్లే లోకల్ రైళ్లు, దూరప్రాంతాల ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నీ స్లో మార్గంలో నడుస్తాయి. అదేవిధంగా హార్బర్ మార్గంలో ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ)-కుర్లా స్టేషన్ల మధ్య డౌన్ మార్గంలో, వడాల రోడ్-బాంద్రా మధ్య అప్, డౌన్ మార్గంలో ఉదయం 11.10 గంటల నుంచి మధ్యాహ్నం 3.10 గంటల వరకు మెగాబ్లాక్ పనులు జరుగుతాయి. ఈ సమయంలో కొన్ని లోకల్ రైళ్ల ట్రిప్పులను రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. రైళ్ల రాకపోకల తాజా వివరాలు ఎప్పటికప్పుడు ఆయా స్టేషన్లలో మైక్‌లో ఎప్పటికప్పుడు ప్రకటిస్తారని, ఆ ప్రకారమే తమ ప్రయాణాన్ని కొనసాగించాలని అధికారులు సూచించారు. -
భారతమాతకు జేజేలు... బంగరు భూమికి జేజేలు!
ఎప్పుడు చూసినా పాప్ పాటలు, సినిమా పాటలు హమ్ చేయడమేనా? ఇక్కడ కొన్ని దేశభక్తిని బోధించే గేయాలు, సినీ గీతాలు ఉన్నాయి. వాటి పూర్తి పాఠాన్ని సంపాదించి రేపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గొంతెత్తి పాడండి. మీ స్నేహ బృందంలో ఉత్తేజాన్ని నింపండి. ‘జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి’ -దేవులపల్లి కృష్ణశాస్త్రి ‘భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు’ -ఆత్రేయ ‘దేశమును ప్రేమించుమన్నా మంచి యన్నది పెంచుమన్నా వొట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తల పెట్టవోయి’ -గురజాడ ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం’ -రాయప్రోలు సుబ్బారావు -
రైల్వే ట్రాకులను పరిశీలిస్తున్న అధికారులు