
సాక్షి, ముంబై: ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ థ్రిల్లింగ్ ట్రైన్ జర్నీ అంటే చాలామంది ఇష్టపడతాం. ట్రాఫిక్ గందర గోళం లేకుండా, రింగ్ రోడ్లు, రాంగ్ టర్న్‌లు లాంటి బాదరబందీ లేకుండా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. చుక్ చుక్ బండితో చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ గ్రామీణ ప్రాంతాలను చూస్తూ రైలు ప్రయాణం భలే సరదాగా ఉంటుంది. అయితే ఎక్కేటపుడు దిగేటపుడు అప్రమత్తంగా ఉండటం అంతే అవసరం. (MG Comet EV: ఎంజీ కామెట్ కాంపాక్ట్ ఈవీ వచ్చేసింది..యూజర్లకు పండగే!)
తాజాగా పట్టాల మీద రైలు పాములాగా వంకర్లు పోతూ వెడుతున్న వీడియో ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఇది రైలా, పామా మీరే చెప్పండి అటూ సౌరభ్ అనే ట్విటర్ యూజర్ ఈవీడియోను పోస్ట్ చేశారు. మహారాష్ట్రలోని పూర్ణ జంక్షన్ లోనిది ఈ వీడియో అని కూడా వెల్లడించారు. ఇప్పటికే ఈ వీడియోకు 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేలాది లైక్స్‌ను సొంతం చేసుకుంది. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన)
Train or Snake ? You Decide 😁
— Saurabh • Trainwalebhaiya (@trainwalebhaiya) April 25, 2023
📍PURNA Junction, Maharashtra pic.twitter.com/1EhkS0qydP