రైలు పట్టాలపై ఏడు రాకెట్లు | Seven rockets found on tracks in Haryana | Sakshi
Sakshi News home page

రైలు పట్టాలపై ఏడు రాకెట్లు

Published Wed, Jul 22 2015 4:50 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM

రైలు పట్టాలపై ఏడు రాకెట్లు

చండిగఢ్: రైలు పట్టాలపై రాకెట్లు కలకలం సృష్టించాయి. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించాయి. దీంతో వందలమంది ప్రయాణీకులు గంటల తరబడి రైళ్లలో కూర్చోవాల్సిన గత్యంతరం తలెత్తింది. నిత్యం రద్దీగా ఉండే అంబాలా- ఢిల్లీ రైల్వే మార్గంలో షాబాద్ నగరం వద్ద ఓ పెట్టెలో ఏడు రాకెట్ లాంచర్లు బయటపడ్డాయి. పట్టాలపై వీటిని కొందరు స్థానికులు గుర్తించడంతో అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది ఒక్క సారిగా ముందస్తు భద్రత దృష్ట్యా రైళ్లను ఆపేశారు. ఆ ఏడు రాకెట్లు కూడా ఎంతో శక్తిమంతమైనవి.

హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. షాబాద్ రైల్వే స్టేషన్ దోలా మజ్రా అనే గ్రామం మధ్యలో వీటిని ఎవరో ఉంచి వెళ్లారు. ఈ విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు ఘటన స్థలికి చేరుకున్నారు. చుట్టుపక్కల కొద్ది దూరంపాటు నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఈ బాంబులను నిర్వీర్యం చేసేందుకు మిలటరీ నుంచి ప్రత్యేక అధికారుల సహాయం కోరినట్లు తెలిపారు. ఈ ఘటనకు కారణమైన గుర్తు తెలియని వ్యక్తులపై పేలుడు పదార్థాల నిషేధ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. దాదాపు 4.30గంటల తర్వాత రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. మొత్తం పన్నెండు రైళ్లపై ఈ ప్రభావం పడింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement