భారతమాతకు జేజేలు... బంగరు భూమికి జేజేలు!
ఎప్పుడు చూసినా పాప్ పాటలు, సినిమా పాటలు హమ్ చేయడమేనా?
ఇక్కడ కొన్ని దేశభక్తిని బోధించే గేయాలు, సినీ గీతాలు ఉన్నాయి. వాటి పూర్తి పాఠాన్ని సంపాదించి రేపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గొంతెత్తి పాడండి. మీ స్నేహ బృందంలో ఉత్తేజాన్ని నింపండి.
‘జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి’
-దేవులపల్లి కృష్ణశాస్త్రి
‘భారతమాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల
జీవధాత్రికి జేజేలు’
-ఆత్రేయ
‘దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టి పెట్టోయ్
గట్టి మేల్ తల పెట్టవోయి’
-గురజాడ
‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవం’
-రాయప్రోలు సుబ్బారావు