Couple Died Accidentally While Crossing The Railway Track - Sakshi
Sakshi News home page

విషాదం: రైలు పట్టాలు దాటుతూ దంపతులు మృతి..

Published Mon, Aug 14 2023 9:58 AM | Last Updated on Mon, Aug 14 2023 10:32 AM

Couple Died Accidentally While Crossing The Train Tracks - Sakshi

శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరంలో విషాదం జరిగింది.  రైలు పట్టాలు దాటుతూ  ప్రమాదవశాత్తు దంపతులు మృతి చెందారు. పట్టాలు దాటుతున్న క్రమంలో రైలు ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాధితులను శ్రీరాములు (60), రాములమ్మ (55)గా గుర్తించారు పోలీసులు.

శ్రీరాములు(60), రాములమ్మ(55)లు పట్టాలు దాటుతున్న క్రమంలో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. రైలు రాకను గమనించకుండా పట్టాలపైకి వెళ్లారని పేర్కొన్నారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన రైలు బాధితులను ఢీకొట్టిందని వెల్లడించారు. అయితే.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. 

ఇదీ చదవండి: Heart Attack: క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement