crossing
-
పైనొక రైలు.. కిందొక రైలు
సాక్షి, హైదరాబాద్: పైన రైలు.. కింద రైలు.. అలాంటి వంతెనలు మన దేశంలో తక్కువ. ఒక రైలు మార్గాన్ని మరో మార్గం క్రాస్ చేసే సందర్భాల్లో వీటి అవసరమున్నా.. ఆర్థిక భారం, ఇతర కారణాలతో నిర్మించడం లేదు. అయితే క్రాసింగ్ సమయంలో ఇతర రైళ్లను ఆపేయాల్సిన పరిస్థితి ఉండటాన్ని ఈ మధ్య సీరియస్‌గా తీసుకున్న రైల్వేశాఖ.. ‘రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి’ల నిర్మాణంపై దృష్టి సారించింది. గత ఏడాది దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని విజయవాడ సెక్షన్ పరిధిలో గూడూరు–మనుబోలు మధ్య 2.2 కిలోమీటర్ల నిడివితో ఇలాంటి వంతెనను నిర్మించారు. తాజాగా సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో పగిడిపల్లి స్టేషన్ సమీపంలో ఈ తరహా బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి నడికుడి మీదుగా గుంటూరు వైపు వెళ్లే రైళ్లు.. కాజీపేట మార్గాన్ని క్రాస్ చేసేచోట నిర్మించనున్నారు. వంతెన ఒక్కటే కాకుండా దానికి అనుసంధానంగా కొంత మేర అదనపు ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా రూ.180 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. రెండు మూడు మార్గాల సమస్య తీరేలా.. ప్రస్తుతం సికింద్రాబాద్–కాజీపేట మధ్య, నడికుడి మీదుగా సికింద్రాబాద్–గుంటూరు మధ్య నిత్యం 450 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అందులో 150కిపైగా గూడ్స్ రైళ్లు ఉంటున్నాయి. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్లే రైళ్లు పగిడిపల్లి స్టేషన్ దాటిన తర్వాత కాజీపేట మార్గాన్ని క్రాస్ చేసి మళ్లాల్సి ఉంటుంది. దీంతో ఏదైనా రైలు నడికుడి వైపు క్రాస్ చేయాలంటే.. సికింద్రాబాద్–కాజీపేట మార్గంలోని రైళ్లను ఎక్కడో ఓ స్టేషన్లో కాసేపు నిలిపేయాల్సి వస్తోంది.ఇక భవిష్యత్తులో సికింద్రాబాద్–గుంటూరు మార్గాన్ని రెండు లైన్లకు విస్తరించనున్నారు. ఆ మార్గంలో ప్రయాణికులు, గూడ్స్ రైళ్ల సంఖ్య పెరగనుంది. మరోవైపు విష్ణుపురం–మోటుమర్రి మధ్య 89కిలోమీటర్ల మేర సరుకు రవాణా రైలు మార్గం ఉంది. ఇది సికింద్రాబాద్–కాజీపేట, సికింద్రాబాద్–గుంటూరు లైన్లను అనుసంధానించే మార్గం కావటం విశేషం. ప్రస్తుతం సరుకు రవాణా రైళ్లకే పరిమితమైన ఈ మార్గంలో భవిష్యత్తులో ప్యాసింజర్ రైళ్లను తిప్పాలనే ప్రతిపాదన ఉంది. అప్పుడు పగిడిపల్లి వై జంక్షన్ వద్ద రైల్వే ట్రాఫిక్ బాగా పెరగనుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. క్రాసింగ్ వద్ద రైళ్లు జామ్ కాకుండా రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి (ఆర్‌ఓఆర్‌బీ)కి ప్లాన్ చేశారు. అది పూర్తయితే రైళ్లు నిరీక్షించే ఇబ్బంది తప్పుతుంది. ప్రయాణ సమయం కొంత తగ్గుతుంది. 1,400 మీటర్ల ఎలివేటెడ్ మార్గం ప్రస్తుతం ప్రతిపాదించిన రైల్ ఓవర్ రైలు బ్రిడ్జికి సంబంధించిన మార్గం మొత్తం ఐదున్నర కిలోమీటర్లు ఉంటుంది. ఇది సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో బీబీనగర్ స్టేషన్ దా టిన తర్వాత.. పగిడిపల్లి స్టేషన్‌కు 600 మీటర్ల ముందు మొదలవుతుంది. ప్రస్తుత లైన్‌కు అదనంగా మరో లైన్ అక్కడ మొదలవుతుంది. అది పగిడిపల్లి స్టేషన్ దాటిన తర్వాత గుంటూరు వైపు మళ్లుతుంది. సికింద్రాబాద్–గుంటూరు లైన్‌లోని బొమ్మాయిపల్లి స్టేషన్ సమీపంలో ప్రధాన లైన్‌కు కలుస్తుంది. ఈ ఐదున్నర కిలోమీటర్ల లైన్లో 1,400 మీటర్ల మేర ఎలివేటెడ్ మార్గం ఉంటుంది. దీనికి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ మొదలైంది. భూసేకరణ ముగిసేలోపు వంతెన భాగాన్ని నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
టెల్ అవీవ్: ఒకవైపు కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపితే.. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం దాడుల్ని కొనసాగించాలనే నిర్ణయించింది. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) యుద్ధ ట్యాంకులు గాజావైపున ఉన్న రఫా క్రాసింగ్‌ను ఆక్రమించాయి. గాజా పోరులో ఈ ఆక్రమణ కీలక ఘట్టమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్న సంగతి తెలిసిందే.ఈ రఫా క్రాసింగ్ నుంచే ఆదివారం రాత్రి హమాస్ దళాలు దక్షిణ ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించాయి. ఈ ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందడంతో ఐడీఎఫ్ తన ఆపరేషన్‌ను ప్రారంభించింది. రఫా క్రాసింగ్ ఆక్రమణ విషయాన్ని ఇజ్రాయెల్ తమకు తెలియజేసిందని ఈజిప్టు అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. అంతకు ముందు..రఫాపై సోమవారం ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న వేళ.. హమాస్ సంస్థ కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విరమణ ఒప్పందం.. తమ కీలక డిమాండ్లకు అనుగుణంగా లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. మరోవైపు కాల్పుల విరమణ కోసం కైరోలో జరుగుతున్న చర్చల్లో ఇజ్రాయెల్ యథావిధిగా పాల్గొంటోంది. కొసమెరుపు ఏంటంటే.. ఆ చర్చలు కొనసాగుతున్న వేళలోనే ఇజ్రాయెల్ యుద్ధ కేబినెట్ సమావేశమై రఫాపై మిలిటరీ ఆపరేషన్‌కు పచ్చజెండా ఊపింది. మరోవైపు ఇజ్రాయెల్ ఆక్రమణతో రఫా క్రాసింగ్ మీదుగా ఈజిప్టు నుంచి గాజాకు చేరుకుంటున్న మానవతా సాయం ఆగిపోయిందని పాలస్తీనా క్రాసింగ్స్ అథారిటీ ప్రతినిధి వేల్ అబు ఒమర్ తెలిపారు. ఈ పరిణామంపై ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అమెరికా మాత్రం ఇజ్రాయెల్ చర్యను పరిమితమైన ఆక్రమణగానే పేర్కొంటోంది. -
బీజేపీ 400 లక్ష్యానికి ఈ 32 సీట్లు కీలకం!
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ ఒకటి వరకు ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఒకవైపు బీజేపీ మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఇండియా కూటమి.. బీజేపీని ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మూడోసారి గెలిస్తే, వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ రికార్డును ప్రధాని మోదీ సమం చేసినట్లవుతుంది. నెహ్రూ 1951–52, 1957, 1962లో వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని, అందులో బీజేపీకి కనీసం 370 సీట్లు వస్తాయని ప్రధాని మోదీ ఇప్పటికే నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ఈ లక్ష్యాన్ని సాధించాలంటే కమలదళం 2019లో తొలిసారిగా గెలిచిన 32 లోక్‌సభ స్థానాలను తిరిగి గెలుచుకోవడం ఎంతో ముఖ్యం. ఈ కీలకమైన సీట్లలో పశ్చిమ బెంగాల్ నుంచి 16, హర్యానా నుంచి 3, కర్ణాటక నుంచి 3, ఒడిశా నుంచి 3, తెలంగాణ నుంచి 2, త్రిపుర నుంచి 2 సీట్లు ఉన్నాయి. ఒక సీటు అస్సాం నుండి, ఒక సీటు మహారాష్ట్ర నుండి, ఒక సీటు మణిపూర్ నుండి కూడా గెలుచుకోవాల్సివుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ తొలిసారిగా 16 సీట్లు గెలుచుకుంది. అలాగే హర్యానాలోని సిర్సా, హిసార్, రోహ్తక్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇదే విధంగా కర్ణాటకలోని చామరాజనగర్, చిక్కబల్లాపూర్, కోలార్ స్థానాలను కూడా గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీ మొదటిసారి మూడు స్థానాలను గెలుచుకుంది. 2019లో తొలిసారిగా తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్‌లో పార్టీ విజయం సాధించింది. అదే ఏడాది త్రిపుర పశ్చిమ, త్రిపుర తూర్పు లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఆ రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ తన ఖాతా తెరవడంలో విజయం సాధించింది. 2019లో తొలిసారిగా అసోంలో బీజేపీ 9 సీట్లు గెలుచుకుంది. 2019లో తొలిసారిగా మహారాష్ట్రలో మాధాలో బీజేపీ విజయం సాధించింది. ఇన్నర్ మణిపూర్ సీటును గెలుచుకోవడం ద్వారా, బీజేపీ 2019లో మొదటిసారి మణిపూర్‌లో తన ఖాతాను తెరిచింది. -
విషాదం: రైలు పట్టాలు దాటుతూ దంపతులు మృతి..
శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరంలో విషాదం జరిగింది. రైలు పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తు దంపతులు మృతి చెందారు. పట్టాలు దాటుతున్న క్రమంలో రైలు ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాధితులను శ్రీరాములు (60), రాములమ్మ (55)గా గుర్తించారు పోలీసులు. శ్రీరాములు(60), రాములమ్మ(55)లు పట్టాలు దాటుతున్న క్రమంలో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. రైలు రాకను గమనించకుండా పట్టాలపైకి వెళ్లారని పేర్కొన్నారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన రైలు బాధితులను ఢీకొట్టిందని వెల్లడించారు. అయితే.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఇదీ చదవండి: Heart Attack: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి -
4 డిజైన్లలో ఇంటర్ ఛేంజర్లు
సాక్షి, హైదరాబాద్ : రీజినల్ రింగురోడ్డులో నాలుగు రకాల డిజైన్లలో ఇంటర్ ఛేంజ్ స్ట్రక్చర్లు రాబోతున్నాయి. జాతీయ రహదారులు, ప్రధాన రాష్ట్ర రహదారులను రింగురోడ్డు క్రాస్ చేసే చోట్ల భారీ ఇంటర్ ఛేంజ్‌లను నిర్మించనున్న విషయం తెలిసిందే. రింగురోడ్డు ఉత్తర భాగంలో 11 ప్రాంతాల్లో ఇలాంటి కూడళ్లు ఉండనున్నాయి. రింగురోడ్డు మీదుగా వెళ్లే వాహనాలు, ఇతర రోడ్ల మీదుగా వెళ్లే వాహనాలు పరస్పరం అడ్డు రాకుండా వేటికవే రోడ్లు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా క్రాస్ అవుతాయి. ఒక రోడ్డు నుంచి మరో రోడ్డులోకి వాహనాలు మారేందుకు వీలుగా ఇంటర్‌ఛేంజ్ లూప్స్‌ను నిర్మిస్తారు. ఇప్పుడు ఈ స్ట్రక్చర్లకు సంబంధించి అధికారులు రూపొందించిన డిజైన్లు ఆసక్తి రేపుతున్నాయి. ఆయా క్రాసింగ్స్‌లో ఉండే ట్రాఫిక్ ఒత్తిడి, అనుసంధానమయ్యే రోడ్ల సంఖ్య ఆధారంగా లూప్స్ వైశాల్యం, సంఖ్య ఆధారపడి ఉంటాయి. ఇందుకోసం నాలుగు డిజైన్లను ఖరారు చేసి, ఆ ప్రాంతంలో ఉండే పరిస్థితికి తగ్గట్టుగా వాటిని ఎంపిక చేయబోతున్నారు. ట్రంపెట్ ఆకృతిలో లూప్ నిర్మాణం సాధారణంగా ప్రధాన రోడ్లను ఇతర రోడ్ల మీదుగా వచ్చే వాహనాలను అనుసంధానించేందుకు ట్రంపెట్ (సంగీత పరికరం) ఆకృతిలో లూప్ నిర్మిస్తారు. రోడ్ల సంఖ్య ఎక్కువగా ఉంటే రెండు ట్రంపెట్ల ఆకృతిలో నిర్మిస్తారు. క్లవర్ లీఫ్ (నాలుగు ఆకులతో కూడిన మొక్క భాగం) ఆకృతిలో కూడా విరివిగా నిర్మిస్తారు. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డులో ఈ రెండు ఆకృతుల్లో ఇంటర్‌ఛేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు వీటితోపాటు డంబెల్ (వ్యాయామ ఉపకరణ) ఆకృతితోపాటు రౌండ్ ఎ»ౌట్ (పూర్తి వృత్తం)లో కూడా నిర్మించాలని నిర్ణయించారు. గిర్మాపూర్, చౌటుప్పల్ వద్ద డంబెల్ ఆకృతిలో నిర్మాణాలు నాగ్‌పూర్ జాతీయ రహదారి, రాజీవ్ రహదారుల మీద రెండు ప్రాంతాల్లో క్లవర్ లీఫ్ నమూనాను ఎంపిక చేశారు. శివంపేట, రాయగిరిల వద్ద డబుల్ ట్రంపెట్ డిజైన్‌ను ఎంపిక చేశారు. రీజినల్రింగ్రోడ్డు ప్రారంభ ప్రాంతమైన గిర్మాపూర్, ముగింపు ప్రాంతమైన చౌటుప్పల్‌తోపాటు జాతీయ రహదారి 161ఏ మీద డంబెల్ ఆకృతిలో నిర్మించాలని భావిస్తున్నారు. మరో మూడు చోట్ల రౌండ్ ఎ»ౌట్లను ఎంపిక చేశారు. మిగతావి పరిశీలనలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్ ఛేంజ్ స్ట్రక్చర్లకు భారీగా స్థలాన్ని సేకరించే విషయంలో స్థానికులతో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో డిజైన్లలో కొన్ని మార్పుచేర్పులు జరిగే అవకాశం ఉంది. రీజినల్ రింగురోడ్డుకు సంబంధించి భూసేకరణలో భాగంగా కీలక 3డీ గెజిట్ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ ఆందోల్–జోగిపేట, యాదాద్రి భువనగిరి, చౌటుప్పల్.. ఈ మూడు కాలా అథారిటీలో పూర్తయిన విషయం తెలిసిందే. వీటి పరిధిలో త్వరలో టెండర్ల ప్రక్రియ కూడా మొదలుకానున్నందున ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్లపై త్వరలో నిర్ణయంతీసుకోనున్నారు. మిగతా కాలా అథారిటీల పరిధిలో 3డీ గెజిట్ నోటిఫికేషన్ జారీకి కొంత సమయం ఉన్నందున, మరో నెల రోజుల్లో ఆయా ప్రాంతాల్లోని స్ట్రక్చర్లను ఖరారు చేయనున్నారు. 120 ఎకరాల విస్తీర్ణంలో.. రీజినల్ రింగ్‌రోడ్డు ఉత్తర భాగంలో వాహనాల రద్దీ చాలా ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతాల్లో నిర్మించే ఇంటర్ ఛేంజ్ నిర్మాణాలు ఒక్కోటి దాదాపు 120 ఎకరాల విస్తీర్ణంలో ఉండనున్నట్టు తెలిసింది. వాహనాలు ఇంటర్‌ఛేంజ్ లూప్స్ మీదుగా, వాటికి నిర్మించే ర్యాంప్స్ మీదుగా కూడా గంటకు 50 కి.మీ. మించిన వేగంతో వెళ్లేందుకు వీలుగా వీటిని విశాలంగా నిర్మించాలని నిర్ణయించారు. తొలుత 70 ఎకరాల విస్తీర్ణంలోనే నిర్మించాలని అనుకున్నా.. వాహనాల వేగం గంటకు 30 కి.మీ.లోపే నియంత్రించాల్సిన పరిస్థితి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
రైలు పట్టాలు దాటుతుండగా ఇద్దరి మృతి
డోర్నకల్ : ఈ నెల 2న మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాడుతుండగా రైలు ఢీకొని గాయాలపాలైన గుర్తు తెలియని వృద్ధుడు(60) చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. డోర్నకల్ జీఆర్పీ ఎస్ఐ పెండ్యాల దేవేందర్ శనివారం ఈవిషయాన్ని తెలిపారు. తీవ్ర గాయాలతో ఉండగా అతన్ని ఎంజీఎంకు తరలించగా, అక్కడ చికిత్సపొందు తూ మృతిచెందాడన్నారు. మృతదేహాన్ని ఎంజీ ఎం మార్చురీలో భద్రపరిచామన్నారు. హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి సంబంధించిన వివరాలు తెలిస్తే డోర్నకల్ జీఆర్పీలో సంప్రదించాలన్నారు. బుగ్గవాగు సమీపంలో.. డోర్నకల్ : మండలంలోని బుగ్గవాగు సమీపంలో శనివారం పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తు తెలియని మరో వృద్ధుడు(65) మృతిచెందినట్లు డోర్నకల్ జీఆర్పీ ఎస్ఐ పెం డ్యాల దేవేందర్ తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ సురేష్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు వెల్లడించా రు. సంబంధీకులు ఎవరైనా ఉంటే సంప్ర దించాలన్నారు. -
హద్దులు మీరుతున్న యువత..!
సంస్కృతి వైపు మొగ్గు –రకరకాల ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి –యుక్త వయస్సులో తీవ్ర ప్రభావం –పిల్లలను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.. ఆలేరు : కౌమారం దశ బహు విచిత్రమైంది. వయస్సు చేసే అల్లరి, తల్లిదండ్రులను ఎదిరించి పంతం నెరవేర్చుకునేలా చేసేది ఈ దశే. ఇంట్లో లభించే స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ యువత పాశ్చాత్య పోకడల వైపు పయనిస్తూ పెడదోవ పట్టేది ఈ వయస్సులోనే. సెల్ఫోన్లలో, కంప్యూటర్లలో ఆశ్లీల కార్యక్రమాలను వీక్షించడం, వీడియో గేమ్‌లు ఆడడం, చాటింగ్ చేయడం, సెల్ఫోన్లతో గంటల తరబడి మాట్లాడడం, ధూమ, మద్యపానం లాంటి దురలవాట్లకు ఆకర్షితులవుతున్న టీనేజీ యువతపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చేతి నిండా డబ్బులు.. నేటి తరంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్యాకెట్ మనీ ఇష్టారాజ్యంగా ఇస్తున్నారు. దీంతో వారు జల్సాలకు అలవాటు పడుతున్నారు. అంతేకాకుండా ఖరీదైన సెల్ఫోన్లు, బైక్ లు, ల్యాప్‌ట్యాబ్‌లు కొనిస్తుండడంతో వాటిని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఆకర్షణకు బందీ.. టీనేజీ యువతీయువకులు ఆకర్షణకు బందీ అవుతున్నారు. ప్రేమో, స్నేహమో తెలియని పరిస్థితి నెలకొంది. స్నేహానికి, ప్రేమకు మధ్య అంతరాన్ని గుర్తించడం లేదు. టీనేజీ భావనలను అధిగమించలేకపోవడం, సినిమాలు, టీవీల ప్రభావం, ఇంటివద్ద సమస్యలు తదితర కారణాలతో ప్రేమలో పడుతున్నారు. ప్రేమే లోకం, జీవితం అన్నట్టుగా మునిగిపోతున్నారు. దీంతో చదువు పెడదారిన పడుతోంది. గతంలో విద్యార్థులు చదువు, కే రీర్కు సంబంధించిన విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టేవారు. కానీ నేఆ పరిస్థితి లేదు. ప్రేమ పేరుతో అమ్మాయిలపై దాడులు జరుగుతున్నాయి. ప్రేమలో విఫలమైతే ఉన్మాదులుగా మారుతున్నారు. మరికొందరు ఆత్మహాత్యలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ టీనేజీ వయస్సులోనే ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ నుండే.. సిగరేట్, బీరు తాగడం ఫ్యాషన్‌గా భావిస్తున్నారు.. నేటి తరం యువత. ఇంటర్ నుంచే వాటిని అలవాటు చేసుకుంటున్నారు. గుట్కాపై నిషేధం ఉన్నా యువత బానిస కావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సిగరెట్ తాగడం విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు. ఇంటర్నెట్తో... ఇంటర్నెట్ చాలా మందికి కొత్త విషయాలు తెలుసుకోవాలనే మానసిక జిజ్ఞాస ఉత్సుకతంగా మారుతోంది. హైస్కూల్ వయస్సు మొదలయ్యే ప్రాయంలోనే అధికంగా ఉపయోగిస్తున్న స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు ఏ మాత్రం అప్రమత్తత లేకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్టే. నెట్‌తో అనుసంధానం కాగానే అప్రయత్నంగానే ప్రత్యక్షమయ్యే అవాంచనీయ ప్రకటనలు, చిత్రాలు మనస్సును కలుషితం చేస్తుంది. 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాతనే ప్రారంభించాల్సిన ఫేస్బుక్ ఖాతాను తప్పుడు జనన తేదీలతో ఆరంభిస్తున్నారు. యాప్స్ ద్వారా సునాయసనంగా విషయాలను, చిత్రాలను, దృశ్యాలను పంచుకుంటున్నారు. యూటుబ్లో మంచితో పాటు చెడు కూడా ఉంది. వ్యసనంగా సెల్‌ఫోన్.. నేడు ప్రతి ఒక్కరికీ సెల్‌ఫోన్ వ్యసనంగా మారింది. బైక్ నడుపుతూ, రోడ్డు దాటుతూ, రైలు పట్టాలు దాటుతూ సెల్ఫోన్లో మాట్లడడం సాధారణంగా మారింది. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గంటల తరబడి మాట్లడడం వల్ల సమయం వృధా అవుతుంది. ఇటీవల కాలంలో సెల్ఫీలతో కూడా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. మరియు హెడ్‌ఫోన్స్‌తో కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కుర్రాళ్లు జాగ్రత్త అధిక వేగం ఉన్న వాహనాల కొనుగోలుకు యువత అసక్తి చూపుతున్నారు. సై్టల్, హోదా ఉంటుందని వారి భావన. ఖరీదైన బైక్‌లపై మోజు గణనీయంగా పెరుగుతోంది.ఫలితంగా అతివేగం వల్ల వాహనంపై నియంత్రణ లేక ప్రమాదాల బారిన పడుతున్నారు. అయితే తమ పిల్లలకు బైక్‌లను సమకూరుస్తున్న తల్లిదండ్రులపైనే చాలా బాధ్యత ఉందనే విషయాన్ని గమనించాలి. చేతికొచ్చిన పిల్లలు మృత్యువాత పడితే కడుపుకోత బాధ గురించి పిల్లలకు తెలియజేయాలి. బైక్‌లు కొనిచ్చినప్పటికీ.. వాటి నిర్వహణపై తల్లిదండ్రులు గమనిస్తుండాలి. మద్యానికి బానిసలుగా.. యుక్తవయస్సు ఉన్నవారు ఆల్కహాల్‌కు బానిసవుతున్నారు. కొన్నిచోట్ల యువకులు మద్యం కోసం ప్రత్యేక బడ్జెట్‌ను తయారుచేసుకుంటున్నారు. తమ పాకెట్ మనీలో 70శాతం వరకు ఆల్కహాల్‌కే ఖర్చు పెడుతున్నారు. మద్యానికి డబ్బులు లేని సమయంలో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు. ఇటీవల హైద్రాబాద్‌లో కొందరు యువకులు మద్యం తాగి వాహనం నడుపుతూ చిన్నారి రమ్యతో పాటు మరో ఇద్దరు చనిపోయేందుకు కారణమయ్యారు. ముగ్గులోకి లాగుతున్నారు పబ్‌లోకి అమ్మాయిలతో వస్తేనే ప్రవేశం.. స్నేహితులతో కలిసి వెళ్తున్న యువకులకు తీరా అక్కడికి వెళ్లాక మద్యం, మత్తు పదార్ధాలకు అలవాటు చేస్తున్నారు. ఎనర్జీ డ్రింక్స్‌తో మొదలుపెట్టి మద్యం, మత్తుపదార్థాల వరకు చేరుతున్నారు. క్రేజీగా భావిస్తున్నారు. స్టార్ హోటల్స్‌లలో అయితే వైన్ ఫెస్టివల్‌తో యువతారాన్ని ఆకర్షిస్తున్నాయి. క్రమంగా ఆల్కహాల్ ఎక్కువగా ఉండే పానీయాలపై మొగ్గు చూపుతున్నారు. నైతిక విలువలకు ప్రాధాన్యం విద్యార్థులకు ప్రాధమిక స్థాయి నుండే నైతిక విలువల పట్ల అవగాహన కల్పించాలి. మానవత్వం గురించి చెప్పాలి. పాశ్చాత్య పోకడలకు దూరంగా ఉండేలా చూడాలి. చదువు, కేరీర్‌పైనే దృష్టి సారించేలా చూడాలి. తల్లిదండ్రులతో అభిప్రాయాలు పంచుకునేలా స్వేచ్ఛగా వెల్లడించాలి. సమస్యలు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించాలి. జీవితమంటే సరదలు, షికారులే కాదు.. లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగేలా ప్రోత్సహించాలి. ప్రేమే జీవితం కాదు.. జీవితంలో ప్రేమ ఓ భాగం మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రుల బాధ్యత పెరగాలి విద్యార్థుల గురించి వారి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. విద్యార్ధులను కేవలం ఉద్యోగాలు సంపాదించి యంత్రాలుగానే కాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి. ఎలాంటి స్నేహాలు చేస్తున్నారు, వారి ప్రవర్తన ఏ విధంగా ఉందని కనిపెడుతుండాలి. విద్యతో పాటు నైతిక విలువలు, మానవత్వం, సామాజిక బాధ్యతలు నేర్పాలి. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి –నర్సింహులు, ఎస్సై, ఆలేరు మారుతున్న సమాజంలో తల్లిదండ్రులు సంపాదన మీద చూపుతున్న శ్రద్ధ కుటుంబంపై చూపడం లేదు. ప్రధానంగా పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చూడాలి. మానవీయ విలువలను తెలియజేయాలి. పిల్లలకు ఆత్మీయత, అనురాగాలు, అనుబంధాలను పెంపొందేలా పెంచాలి. తేడా గుర్తించాలి –డా. ప్రభాకర్ , స్త్రీ వైద్య నిపుణులు, ఆలేరు ప్రేమకు–ఆకర్షణకు తేడా తెలుసుకోవాలి. కౌమరదశ– యవ్వనానికి పూర్వం అంటే 13–19 సంవత్సరాల మధ్య స్త్రీ పురుషుల్లో హర్మోన్ల ప్రభావంతో ఆకర్షణలు ఏర్పడుతాయి. విజ్ఞాత కలిగి హృదయపూర్వక సాన్నిహిత్యాన్ని కోరుకోవడమే అసలైన ప్రేమ. 20 ఏళ్లు దాటిన యువత సమాజం, పరిస్థితులు, కుటుంబ వ్యవస్థ, చదువు అన్నింటిపై అవగాహన కలిగి ఉంటారు. యాంత్రీకరణగా సంబంధాలు –బండిరాజుల శంకర్, ప్రిన్సిపాల్, ఆలేరు ప్రస్తుతం తల్లిదండ్రులకు సంపాదనపై ఉన్న ద్యాసం కుటుంబంపై ఉండడం లేదు. ఆలుమగల మధ్య సంబంధాలు యాంత్రీకరణగా మారడంతో అనుబంధం, ఆత్మీయత, అనురాగం దూరమవుతున్నాయి. వీటి ప్రభావం పిల్లలపై పడుతుంది. పిల్లలు పాశ్చాత్య పోకడలు పట్టకుండా చూడాల్సింది తల్లిదండ్రులదే. వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలపై అవగాహన కల్పించాలి. -
కారు-బైక్ ఢీ ఒకరు మృతి
కరీంనగర్: రామగుండం మండలం మల్లాల క్రాసింగ్ వద్ద రాజీవ్ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో కారు- బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థతి విషమంగా ఉంది.