రైలు పట్టాలు దాటుతుండగా ఇద్దరి మృతి
Published Sun, Aug 7 2016 12:20 AM | Last Updated on Sat, Aug 25 2018 5:41 PM
డోర్నకల్ : ఈ నెల 2న మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాడుతుండగా రైలు ఢీకొని గాయాలపాలైన గుర్తు తెలియని వృద్ధుడు(60) చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు.
డోర్నకల్ జీఆర్‌పీ ఎస్‌ఐ పెండ్యాల దేవేందర్ శనివారం ఈవిషయాన్ని తెలిపారు. తీవ్ర గాయాలతో ఉండగా అతన్ని ఎంజీఎంకు తరలించగా, అక్కడ చికిత్సపొందు తూ మృతిచెందాడన్నారు. మృతదేహాన్ని ఎంజీ ఎం మార్చురీలో భద్రపరిచామన్నారు. హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి సంబంధించిన వివరాలు తెలిస్తే డోర్నకల్ జీఆర్‌పీలో సంప్రదించాలన్నారు.
బుగ్గవాగు సమీపంలో..
డోర్నకల్ : మండలంలోని బుగ్గవాగు సమీపంలో శనివారం పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తు తెలియని మరో వృద్ధుడు(65) మృతిచెందినట్లు డోర్నకల్ జీఆర్‌పీ ఎస్‌ఐ పెం డ్యాల దేవేందర్ తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ సురేష్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు వెల్లడించా రు. సంబంధీకులు ఎవరైనా ఉంటే సంప్ర దించాలన్నారు.
Advertisement
Advertisement