అందరూ తమను గుర్తించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఏదైనా గొప్పగా సాధించి మంచి పేరు సాధించాలని కోరుకుంటారు. కానీ ఈ మధ్య దీనికి భిన్నమైన సోషల్ మీడియా సంస్కృతి విస్తరిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా వైరల్ అయ్యే పనులు చేసి పేరు తెచ్చుకోవాలని కొందరు పిచ్చి పనులు చేస్తున్నారు. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వీడియోనే తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ యువకుడు రైలు పట్టాలపై నిలిచి ఉంటాడు. రైలు రాక కోసం తీక్షణంగా ఎదిరి చూస్తుంటాడు. రైలు వచ్చే ముందే పట్టాల మధ్యలో పటుకుంటాడు. అతి వేగంగా వెళ్తున్న రైలు క్షణాల్లోనే అతన్ని దాటుకుని వెళ్లిపోతుంది. పట్టాల మధ్యలో పడుకున్న యువకుడు సేఫ్‌గా బయటపడతాడు. కానీ రైలు వేగానికి యువకుడు ఏమాత్రం పైకి లేచినా.. ఇంకమన్నా ఉందా..? ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిపిపోయేవి. ఈ వీడియోని తెలంగాణ ఆర్టీసీ బాధ్యతలు చేపడుతున్న ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. జనాదరణ కోసం జీవితాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? అంటూ రాసుకొచ్చారు.
సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పేమస్ కోసం సాహసాలు చేస్తే.. చిన్న పొరపాటు జరిగిన ప్రాణాల మీదికి వస్తుంది.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 2, 2023
జనాదరణ కోసం జీవితాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/wc3BSQVhA1
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ బాధిత యువకున్ని ఫూలిష్‌గా పేర్కొన్నారు. కేవలం ఎవరో గుర్తుంచాలని ప్రాణాలకు తెగించడం పిచ్చి పనిగా పేర్కొంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు ఇలాంటి పిచ్చి పనుల్ని చేయొద్దంటూ సలహాలు సూచనలు ఇస్తున్నారు మరొకొందరు. ఆ యువకుడు చేసిన పిచ్చి పనేంటో మీరూ చూసేయండి మరి..!
ఇదీ చదవండి: కునోలో మరో చీతా మృతి.. ఐదు నెలల్లోనే తొమ్మిది..
Comments
Please login to add a commentAdd a comment