between
-
భగ్గుమన్న భారత్, కెనడా బంధం. నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ పేరు చేర్చిన కెనడా. నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్
-
జమ్ముకశ్మీర్‌లో ఎన్సీ- కాంగ్రెస్ పొత్తు?
జమ్ముకశ్మీర్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో తలపడేందుకు నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్‌లు పొత్తు కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల తరహాలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తు కుదుర్చుకోవాలని ఇరు పార్టీలు తహతహలాడుతున్నాయి.కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో జరగనున్న తొలి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. వివిధ పార్టీలు కూడా రాజకీయ సమీకరణలు ప్రారంభించాయి. తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్‌లు కూటమిగా ఏర్పడేందుకు ఉండే అవకాశాలపై చర్చించేందుకు శ్రీనగర్‌లో చర్చలు ప్రారంభించాయి. వీరి మధ్య సయోధ్య కుదిరితే మరో నాలుగైదు రోజుల్లో పొత్తులపై ప్రకటన వెలువడనున్నదని సమాచారం. ఇరుపక్షాల హైకమాండ్ ఆదేశాల మేరకు చర్చల ప్రక్రియ ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా డీలిమిటేషన్ కారణంగా చాలా అసెంబ్లీ నియోజకవర్గాల సమీకరణలు మారిపోయాయి. దీంతో సిట్టింగ్-గేటింగ్ ఫార్ములా అనుకూలంగా ఉండదు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సీట్ల కేటాయింపుపై ఇరు పార్టీలు తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. -
అమెరికా, చైనా మధ్య యుద్ధ మేఘాలు?
అమెరికా, చైనాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయనే ఊహాగానాలు ఇటీవలి కాలంలో వినిపిస్తున్నాయి. ఈ రెండు దేశాలు బద్ధ శత్రువులుగా మారాయని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతం కావడం లేదనే వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి.తాజాగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు సంబంధించి మీడియాకు అమెరికా వివరణ ఇచ్చింది. ఆసియా-పసిఫిక్‌లో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ, చైనాతో యుద్ధం చేసేంతటి పరిస్థితులు లేవని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఉన్నత స్థాయి భద్రతా అధికారుల బృందానికి తెలిపారు. అపోహలు, అపార్థాలను తొలగించడానికి, నివారించడానికే ఈ అంశంపై స్పష్టత ఇచ్చినట్లు పేర్కొన్నారు.సింగపూర్‌లోని షాంగ్రి-లా డిఫెన్స్ ఫోరమ్‌లో చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్‌తో గంటకు పైగా జరిగిన సమావేశం అనంతరం ఆస్టిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2022లో యూఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ను సందర్శించిన తర్వాత యూఎస్, చైనా సైన్యాల మధ్య సంబంధాలు ముగిసిపోయాయి. ఆ తర్వాత ఇద్దరు రక్షణ శాఖ ఉన్నతాధికారులు ముఖాముఖి సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఈ భేటీ గురించి వివరించడానికి నిరాకరించిన ఆస్టిన్, ఇరు దేశాల నేతలు మరోమారు సమావేశం కావాల్సిన అవసరం ఉందన్నారు.మీడియాతో ఆస్టిన్ మాట్లాడుతూ ఊహలు, అపార్థాలకు అవకాశం తగ్గించేలా ఇరు దేశాల నేతలు కలసి పనిచేయాలన్నారు. ప్రతీ భేటీ ఆహ్లాదకరమైనది కాదని, అయినప్పటికీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ముఖ్యమని అన్నారు. ఇదిలావుండగా ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఇదే ఫోరమ్‌లో ప్రసంగించారు. తమ దేశానికి చెందిన కోస్ట్‌గార్డ్‌తో చైనా సైన్యం ఘర్షణకు దిగిన సమయంలో ఒక్క ఫిలిపినో పౌరుడు మృతి చెందినా, దానిని యుద్ధ చర్యగా పరిగణిస్తామని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని మార్కోస్ జూనియర్ హెచ్చరించారు. -
చంద్రాయపాలెం వర్సెస్ బుగ్గపాడు వర్సెస్ రుద్రాక్షపల్లి..
ఖమ్మం: సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో పోడు భూముల వివాదం శాంతిభద్రతల సమస్యగా మారింది. ఈ గ్రామంలో సర్వే నంబర్ 343 నుంచి 359 వరకు విస్తరించి ఉన్న 400 హెక్ట్టార్ల భూమిపై హక్కు కోసం స్థానిక, స్థానికేతర గిరిజనులు ఆదివారం గొడవ పడుతుండగా అడ్డుకునేందుకు వెళ్లిన సీఐ కిరణ్, సిబ్బందిపై దాడి చేసిన విష యం విదితమే. ఈ ఘటనతో ఏర్పాటుచేసిన పోలీ సు పికెట్ సోమవారం కూడా కొనసాగగా పోలీసులపై దాడిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న గిరిజనులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. ఆదివారం రాత్రే 20మంది గిరిజన మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈమేరకు ఐదు కేసులు నమోదు చేయగా, మద్దిశెట్టి సామేలు, కూరం మహేంద్రతో పాటు ఇంకొందరిపై కేసుల్లో హత్యాయత్నం సెక్షన్లు కూడా చేర్చినట్లు ఏసీపీ అనిశెట్టి రఘు తెలిపారు. ఇక సోమవారం మద్దిశెట్టి సామ్యేలు, మహేంద్ర సహా 26మందిని అరెస్ట్ చేయగా ఇప్పటివరకు 46మందిని అరెస్ట్ చేసినట్లయింది. 15 ఏళ్ల నుంచి.. చంద్రాయపాలెం గిరిజనులకు బుగ్గపాడు, రుద్రాక్షపల్లి, నాగుపల్లి గ్రామాల గిరిజనుల నడుమ ఈ భూమిపై 15 ఏళ్ల నుంచి వివాదం నడుస్తోంది. అయినా అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు సమ స్య పరిష్కారానికి చొరవ తీసుకోకపోవడంతోనే గొడవ జఠిలమైంది. చంద్రాయపాలెం గిరిజనులతో కలిసి 400 హెక్టార్లతో వీఎస్ఎస్ – అటవీ శాఖ సంయుక్తంగాజామాయిల్ సాగు చేస్తుండగా సుమారు 9 హెక్టార్లలో జామాయిల్ కట్ చేసి తిరిగి ప్లాంటేషన్‌కు సిద్ధమవుతుండడంతో వివాదం తీవ్రమైంది. అటవీ శాఖ అధికారులు చంద్రాయపాలెం గిరిజనులను ముందుపెట్టి సమస్యను వారే తేల్చుకోవాలన్నట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. భూమిపై తమకే హక్కులు ఉన్నాయని చంద్రాయపాలెం గిరిజనులు వాదిస్తున్నారు. అయితే 1970 కంటే పూర్వం తమ తాతముత్తాతలు సాగు చేసినట్లు హక్కు పత్రాలు ఉన్నాయని స్థానికేతర గిరిజనులు చెబుతున్నారు. ఏదిఏమైనా రెండు శాఖల సమన్వయంతో పోడు వివాదం తీవ్రమైందని విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఏమన్నారంటే.. చంద్రాయపాలెం 400 హెక్టర్ల భూమి ముమ్మాటీకి అటవీ శాఖదేనని రేంజర్ స్నేహలత తెలిపారు. వీఎస్ఎస్–అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యాన 9 హెక్టార్లలో జామాయిల్ కటింగ్ పూర్తయిందని, ఈసారి అటవీ శాఖ ఆధ్వర్యంలో మారుజాతి మొక్కలను పెంచేందుకు భూమి చదును చేశామన్నారు. ఈ విషయంలో చంద్రాయపాలెం గిరిజనులకు కానీ ఇతర ప్రాంత గిరిజనులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదేవిషయమై సత్తుపల్లి తహసీల్దార్ యోగేశ్వరరావు స్పందిస్తూ చంద్రాయపాలెంలోని అటవీ భూమికి రెవెన్యూ శాఖతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. భూవివాదాలను అట వీ శాఖతో కలిసి పరిష్కరించుకోవాలే తప్ప జాయింట్ సర్వే నిర్వహించలేదని స్పష్టం చేశారు. ఇవి చదవండి: విషాదం: ఫార్చ్యూనర్ కోసం ‘కరిష్మా’కు భవిష్యత్తే లేకుండా చేశారు -
యనమల ఇంట్లో టికెట్ లొల్లి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఒకప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో తెరవెనుక రాజకీయాలను శాసించిన యనమల రామకృష్ణుడికి ఇంటిపోరు పెద్ద తలనొప్పిలా మారింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన సొంత నియోజకవర్గం తునిలో తన రాజకీయ వారసురాలిగా కూతురిని తెరపైకి తీసుకొచ్చి.. తమ్ముడు యనమల కృష్ణుడికి మొండిచేయి చూపుతూ చక్రం తిప్పారు. ఈ ఇంటి పోరుతో తుని నియోజకవర్గంలో ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ కాకినాడ జిల్లా తునిలో పార్టీ ఇన్చార్జిగా యనమల కృష్ణుడే అన్నీ తానై చూసుకున్నారు. కష్టకాలంలో పార్టీని నడిపించిన తమ నాయకుడిని కాదని రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేలా ఎక్కడో ఉన్న రామకృష్ణుడి కుమార్తె దివ్యను రంగంలోకి దించడంతో కృష్ణుడి అనుచరవర్గం మండిపడుతోంది. ఇప్పుడు రామకృష్ణుడు తన చిన్నాన్న కుమారుడైన కృష్ణుడికి పూర్తిగా చెక్ పెట్టేందుకు.. సొంత సోదరుడి కుమారుడు రాజేష్‌ను రంగంలోకి దించడంతో తాడేపేడో తేల్చుకునేందుకు కృష్ణుడు సిద్ధమయ్యారు. పక్కా వ్యూహంతో తమ్ముడిని దెబ్బకొట్టిన యనమల యనమల కృష్ణుడి వల్లే టీడీపీ నష్టపోయిందనే సాకుతో అభ్యర్థి బరి నుంచి ఆయనను తప్పించడంలో రామకృష్ణుడి వ్యూహం ఫలించింది. ఇది కృష్ణుడి వర్గానికి ఏమాత్రం రుచించడం లేదు. అలాగని ఇప్పటికిప్పుడు బయటపడకుండా వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నారు. మరోవైపు దివ్యకు పార్టీలో ప్రతికూల వాతావరణం ఎదురు కాకుండా కృష్ణుడిని పొమ్మనకుండానే పొగపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు రామకృష్ణుడు సోదరుడి కుమారుడు రాజేష్‌ను పావుగా వాడు కుంటున్నారనే వాదన వినిపిస్తోంది. దివ్యను టీడీపీ తుని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిన సందర్భంలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన కృష్ణుడు.. పార్టీ మారే ఆలోచన కూడా చేశారనే ప్రచారం జరిగింది. దివ్య నియామకాన్ని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కృష్ణుడి వర్గం బాహాటంగానే వ్యతిరేకించింది. పార్టీని ఇంతకాలం మోసిన కృష్ణుడిని పక్కన పెట్టిన రోజే యనమల కుటుంబంలో ఇంటి పోరుకు తెరలేచింది. అనంతర పరిణామాల్లో ఆయనను బుజ్జగించడంతో కృష్ణుడిని దారిలోకి తెచ్చుకున్నామని రామకృష్ణుడు సంబరపడ్డారు. లోలోన రగిలి పోతున్న కృష్ణుడు సమయం కోసం వేచిచూశారు. రాజేష్ రాకతో కాక రామకృష్ణుడి సోదరుడి కుమారుడు రాజేష్, కృష్ణుడి వర్గాలు రామకృష్ణుడి సమక్షంలోనే ఇటీవల పరస్పరం కొట్లాటకు దిగారు. దివ్యను ఇన్చార్జిగా నియమించిన సమయంలో కృష్ణుడు రాజకీయంగా అస్త్రసన్యాసం చేసి కొంతకాలం మౌనంగా ఉన్నారు. ఆ సమయంలో దివ్య వెంట రాజేష్ క్రియాశీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో తుని, కోటనందూరు, తొండంగి మండలాలు ఉండగా, రాజేష్ తొండంగి మండల పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. ఇంతలోనే కృష్ణుడు ఇటీవల పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని రామకృష్ణుడి వర్గం కృష్ణుడికి పొమ్మనకుండానే పొగబెట్టేలా చేస్తున్నారని తెలుగు తమ్ముళ్ల మధ్య విస్తృత చర్చ సాగుతోంది. పార్టీ కార్యకలాపాలకు కృష్ణుడు దూరంగా ఉన్నంతసేపు ఖుషీగా ఉన్న ఆ వర్గానికి.. కృష్ణుడు తిరిగి పార్టీలో చురుగ్గా ఉండటం రుచించడం లేదంటున్నారు. ఇందుకు రాజేష్‌ను పావుగా వాడుకుంటూ కృష్ణుడిపైకి ఉసిగొల్పుతున్నారనే ప్రచారం పార్టీలో వినిపిస్తోంది. తాడోపేడో తేల్చుకునేందుకు యనమల కృష్ణుడు సిద్ధం రాష్ట్ర రాజకీయాల్లో రామకృష్ణుడు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతుండగా.. ఆయన తరఫున తునిలో అన్నీ తానై చూసుకున్న కృష్ణుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడుతున్నారు. రాజకీయాల్లో తనకంటే వెనకాల వచ్చిన రాజేష్‌కు టీడీపీలో ప్రాధాన్యం ఇవ్వడం కృష్ణుడికి పుండు మీద కారం చల్లినట్లయ్యింది. ఉంటే రాజేష్ అయినా ఉండాలి లేక తమ నాయకుడికైనా పూర్తిగా బాధ్యతలు అప్పగించాలని కృష్ణుడి వర్గం వాదన వైరి వర్గానికి మింగుడు పడటం లేదు. తునిలో బుధవారం జరగనున్న చంద్రబాబు సభలోపు ఈ విషయంపై తాడోపేడో తేల్చాలని పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితులతో యనమల రామకృష్ణుడికి ఎటూ పాలుపోని పరిస్థితి ఉంది. ఈలోగా ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. -
సీఎం అంశంపై టీడీపీ, జనసేన మధ్య బయటపడ్డ విభేదాలు
ఒంగోలు టౌన్: అంగన్వాడీ కార్యకర్తల సాక్షిగా టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. చంద్రబాబు సీఎం అయ్యాక అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అవుతాయని టీడీపీ నేతలు పేర్కొనగా.. జనసేన నాయకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నాయకులు ముందుగానే చంద్రబాబు సీఎం అని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. పవన్‌కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జనసేన నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారని స్పష్టంచేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు మద్దతు తెలిపేందుకు టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ సోమవారం దీక్షా శిబిరం వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా బాలాజీ ప్రసంగిస్తూ.. రానున్న ఎన్నికల తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని, అంగన్వాడీల సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వెళతానని చెప్పారు. చంద్రబాబే ముఖ్యమంత్రి అని ఎలా చెబుతారు? ఆ తరువాత జనసేన నాయకుడు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికల తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బాలాజీ చెప్పడాన్ని తప్పుపట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఇప్పుడే ఎలా చెబుతారని, ఎన్నికల తరువాత కూటమిలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే వారే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టంచేశారు. 2014లో పవన్ కళ్యాణ్ మద్దతుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చాలా తప్పులు చేశారని, ఇప్పుడు కూడా ఆయన అలాగే తప్పులు చేస్తే పవన్ కళ్యాణ్ సహించరని హెచ్చరించారు. కాగా.. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణమ్మ కూడా నూకసాని బాలాజీ వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చారు. అంగన్వాడీలకు ఎంత జీతం ఇస్తారో అంకెలతో సహా టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొనాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించడం తాము మరిచిపోలేదని కొందరు అంగన్వాడీలు చెప్పుకోవడం కనిపించింది. జనసేనలో ఆధిపత్య పోరు ఇదే సందర్భంలో జనసేన పార్టీలో ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. అంగన్వాడీలకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మధ్య పోరు మరోసారి రచ్చకెక్కింది. తొలుత జనసేన తరఫున ప్రసంగించడానికి అరుణకు మైకు ఇచ్చారు. అయితే.. ఆమె నుంచి మైకు లాక్కుని రియాజ్‌ను ప్రసంగించాల్సిందిగా కొందరు కార్యకర్తలు కోరారు. రియాజ్ ప్రసంగించిన తరువాత తన అనుచరులతో కలిసి వెళ్లిపోయారు. కాగా.. ఇటీవల ఒంగోలు గద్దలగుంటలో జరిగిన కార్యక్రమంలోనూ రియాజ్, అరుణ వర్గాల మధ్య వివాదం జరిగింది. -
అసంతృప్తి ‘కన్నా’లెన్నో!
సాక్షి, నరసరావుపేట: ఎన్నో ఆశలతో రాజకీయ బద్ధశత్రువు, టీడీపీ అధినేత చంద్రబాబు చెంత చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత. పలువురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ చేశారు. వంగవీటి రంగా తర్వాత కాపు సామాజికవర్గంలో తానే కీలక నేతనని ఆయన భావిస్తుంటారు. అలాంటి కన్నా... వంగవీటి రంగా హత్యకు కారణమైన టీడీపీలో చేరడంతో రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు పంచన చేరిన తర్వాత కన్నాకు పార్థిలో అనుకున్నంత ప్రాధాన్యం లభించడం లేదు. తనకు గుంటూరు వెస్ట్ అసెంబ్లీ స్థానం కేటాయించాలని ఆయన కోరినా బాబు వినకుండా సత్తెనపల్లికి పంపారు. అక్కడ అప్పటికే పార్టీ క్యాడర్ మూడు గ్రూపులుగా విడిపోయి ఉంది. కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు, అబ్బూరి మల్లి వర్గాలు పరస్పరం కత్తులు నూరుతున్నాయి. ఇందులో అబ్బూరి మల్లి కొంత కన్నాకు సహకరిస్తున్నా, వైవీ ఆంజనేయులు పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు కోడెల శివరాం పల్లె నిద్ర పేరిట ఇంటింటికీ తిరుగుతున్నారు. శివరాంను నిలువరించే యత్నం టీడీపీ అధిష్టానం చేయడం లేదని కన్నా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. తనకే టీడీపీ టికెట్ ఇస్తుందని, ఒకవేళ ఇవ్వని పక్షంలో కోడెల శివప్రసాదరావు ఆశయ సాధన కోసం స్వతంత్ర అభ్యర్థి గా అయినా పోటీ చేస్తానని శివరాం నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపడుతుండటం గమనార్హం. కన్నాకు వ్యతిరేకంగా కాపులను ఏకం చేస్తున్న ‘బొర్రా’ కాపు సామాజికవర్గం బలంగా ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని, జనసేనకే ఇక్కడ పొత్తులో సీటు ఖరారవుతుందని చెబుతున్నారు. ఆ పార్టీ ఇన్చార్జి బొర్రా వెంకట అప్పారావుకు గానీ, మరో నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్‌కు గానీ అవకాశం రావచ్చనే చర్చ జరుగుతోంది. కన్నా లక్ష్మీనారాయణ జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్‌తో మాత్రమే సన్నిహితంగా ఉంటున్నారు. బొర్రా అప్పారావును దూరం పెడుతున్నారు. దీంతో ఆర్థిక, అంగబలం ఉన్న బొర్రా అప్పారావు నియోజకవర్గంలోని కాపు నేతలను ఏకం చేసి జనసేన వైపు ఉండేలా చూస్తున్నారు. జనసేనకు టికెట్ ఇస్తేనే ఈ నియోజకవర్గంలో కాపులకు ప్రాధాన్యం ఉంటుందని, టీడీపీ తరఫున కన్నా గెలిచినా పెత్తనం ఓ సామాజిక వర్గం చేతుల్లోనే ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. జనసేనతోపాటు టీడీపీలోని గ్రూపులు కన్నాకు వ్యతిరేకంగా పనిచేసేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. దీంతో తనకు గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కన్నా లక్ష్మీనారాయణ కోరుతున్నట్టు సమాచారం. దీనిపై పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలూ లేకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. పైగా కాపు సామాజికవర్గంలో బలమైన నేతనైనా తనకన్నా పవన్ కళ్యాణ్‌కే పార్టీ అధిష్టానం అధిక ప్రాధాన్యం ఇస్తుండడం ఆయనకు రుచించడం లేదని సమాచారం. టీడీపీలో చేరి తప్పు చేశారనే భావన కన్నా వర్గాల్లో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా సత్తెనపల్లి సీటును జనసేనకు కేటాయించేందుకే సుముఖంగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. -
జనాదరణ కోసం పిచ్చి పనులా?.. వైరల్ వీడియోపై సజ్జనార్ ట్వీట్..
అందరూ తమను గుర్తించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఏదైనా గొప్పగా సాధించి మంచి పేరు సాధించాలని కోరుకుంటారు. కానీ ఈ మధ్య దీనికి భిన్నమైన సోషల్ మీడియా సంస్కృతి విస్తరిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా వైరల్ అయ్యే పనులు చేసి పేరు తెచ్చుకోవాలని కొందరు పిచ్చి పనులు చేస్తున్నారు. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వీడియోనే తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువకుడు రైలు పట్టాలపై నిలిచి ఉంటాడు. రైలు రాక కోసం తీక్షణంగా ఎదిరి చూస్తుంటాడు. రైలు వచ్చే ముందే పట్టాల మధ్యలో పటుకుంటాడు. అతి వేగంగా వెళ్తున్న రైలు క్షణాల్లోనే అతన్ని దాటుకుని వెళ్లిపోతుంది. పట్టాల మధ్యలో పడుకున్న యువకుడు సేఫ్‌గా బయటపడతాడు. కానీ రైలు వేగానికి యువకుడు ఏమాత్రం పైకి లేచినా.. ఇంకమన్నా ఉందా..? ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిపిపోయేవి. ఈ వీడియోని తెలంగాణ ఆర్టీసీ బాధ్యతలు చేపడుతున్న ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. జనాదరణ కోసం జీవితాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? అంటూ రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పేమస్ కోసం సాహసాలు చేస్తే.. చిన్న పొరపాటు జరిగిన ప్రాణాల మీదికి వస్తుంది. జనాదరణ కోసం జీవితాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/wc3BSQVhA1 — V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 2, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ బాధిత యువకున్ని ఫూలిష్‌గా పేర్కొన్నారు. కేవలం ఎవరో గుర్తుంచాలని ప్రాణాలకు తెగించడం పిచ్చి పనిగా పేర్కొంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు ఇలాంటి పిచ్చి పనుల్ని చేయొద్దంటూ సలహాలు సూచనలు ఇస్తున్నారు మరొకొందరు. ఆ యువకుడు చేసిన పిచ్చి పనేంటో మీరూ చూసేయండి మరి..! ఇదీ చదవండి: కునోలో మరో చీతా మృతి.. ఐదు నెలల్లోనే తొమ్మిది.. -
చిత్తూరు టీడీపీ మూడు ముక్కలు
-
ఎత్తైన కొండల మధ్య అద్భుత విన్యాసం
-
మెగా కాంపౌండ్‌లో బైలింగువల్ వార్
-
మిస్త్రీని తిలగిస్తే లక్ష కోట్లు చెల్లించాలా ?
-
టాటా- మిస్త్రీ మధ్య చర్చలు?
ముంబై: టాటా- మిస్త్రీ వివాదంలో ఆసక్తికర పరిణామాలుచోటు చేసుకుంటున్నాయి. గత వారంరోజులుగా సంచలనంగా మారిన టాటా- మిస్త్రీ వివాదానికి తెరపడనుందా? రచ్చకెక్కిన టాటా బోర్డు రూం డ్రామా కు చర్చల ద్వారా ముగింపు పలకాలని రతన్ టాటా చూస్తున్నారా? జాతీయ మీడియా అంచనాల ప్రకారం ఈ మేరకు రతన్ టాటా, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మధ్య మధ్యవర్తిత్వ చర్చలకు రంగం సిద్ధమైంది. సీనియర్ న్యాయవాది, టాటా సంస్థ ట్రస్టీ అయిన దారియస్ కాంబట ఈ చర్చలకు నేతృత్వం వహిస్తున్నట్టు సీఎన్ బీసీ టీవీ -18 పేర్కొంది. ఈ మేరకు ఆయన ఇద్దర్నీ కలిసి చర్చించనున్నారని సన్నిహిత వర్గాల సమాచారమని నివేదించింది. ఒకవైపు టాటాలోని మెజార్టీ స్టాక్ హోల్డర్స్, టాటా సన్స్ లోని షాపూర్జీ పల్లోంజి 18 శాతం ఆసక్తిగల కొనుగోలు దారులకోసం వెదుకుతోందని వార్తలు వచ్చాయి మరోవైపు టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు చెందిన ముగ్గురు సభ్యులు తాజాగా సంస్థకు గుడ్‌బై చెప్పారు. టాటా సన్స్ అడ్వైజరీ కౌన్సిల్లో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ మధు కన్నన్, వ్యూహకర్త నిర్మాల్య కుమార్, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ ఎన్ఎస్ రాజన్ ఉన్నారు. కాగా మహారాష్ట్ర మాజీ అటార్నీ జనరల్ దరియాస్ కాంబట టాటా గ్రూపునకు అత్యంత సన్నిహితులు. మరోవైపు ఈ వార్తలపై అటు టాటా సంస్థలనుంచి గానీ, మిస్త్రీ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. -
బీహార్‌లో పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ
-
గందరగోళంలో టీడీపీ- బీజేపీ కార్యకర్తలు
-
GHMC ఎన్నికల్లో టీఆర్ఎస్కు తప్పని రెబల్స్
-
టీడీపీ,బీజేపీల మధ్య పబ్లిసిటీ లొల్లి !
-
తమిళ అగ్రహీరోల యుద్దం