న్యూఢిల్లీ: బొగ్గు స్కాం కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు జడ్జిని కలవడానికి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జిందాల్ గ్రూప్‌నకు చెందిన నిందితుల్లో ఒకరు పలుమార్లు ప్రయత్నించినట్లు వెలుగుచూసింది. సోమవారం కేసు విచారణ సందర్భంగా జడ్జి భరత్ పరాశర్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఇలా మరోసారి జరగరాదని నిందితుల తరఫు న్యాయవాదులను హెచ్చరించారు. అయితే తనను కలవడానికి ప్రయత్నించిన నిందితుడి పేరును మాత్రం జడ్జి వెల్లడించలేదు.
ఈ కేసులో నిందితుడైన జిందాల్ గ్రూప్ అధినేత నవీన్ జిందాల్ కూడా ఈ సమయంలో కోర్టులోనే ఉన్నారు. విచారణ ప్రారంభంకాగానే జడ్జి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘ఇది మళ్లీ జరిగింది. ఈ కేసులో నిందితుల తరఫున సీనియర్ లాయర్లు వాదిస్తున్నా ఇలా జరగడం విచారకరం. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. దీన్ని కోర్టు రికార్డుల్లో నమోదు చేయాలని మీరు అనుకుంటే.. అలాగే చేస్తాను’ అని జడ్జి వ్యాఖ్యానించారు. మళ్లీ ఇలా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జడ్జిని కలిసేందుకు నిందితుడి యత్నం
Published Tue, Jun 2 2015 3:39 AM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM
Advertisement