విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ వేదికగా జరుగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్)ల్లో భాగంగా పర్యాటక, ఆతిథ్య రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని పర్యాటక శాఖ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ వెల్లడించారు. తొలి రోజు జీఐఎస్‌లో పర్యాటక, ఆతిథ్య రంగాల్లో రూ. 25 వేల కోట్ల పెట్టబడులు రాబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఏపీలో పర్యాటక, ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున అవకాశాలున్నాయని, ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారని విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడుతూ రజత భార్గవ స్పష్టం చేశారు. రెండు రోజుల జీఐఎస్‌లో 125కి పైగా ఎంఓయూలు చేసుకోబోతున్నామని, ఈ సదస్సులో పాల్గొనడానికి ఒబెరాయ్, ఐటీసీ లాంటి దిగ్గజ హోటళ్ల చైర్మన్లు వస్తున్నారన్నారు. తొలి రోజు ఏడు పెద్ద ఎంఓయూలు చేసుకోబోతున్నామని, ఒక్కో ఎంఓయూ విలువ వెయ్యి కోట్లగా పైగానే ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment