tourism departmrnt
-
Global Investors Summit 2023: ‘ఆ రంగాల్లో పెట్టుబడులకు పెద్ద ఎత్తున అవకాశాలు’
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ వేదికగా జరుగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్)ల్లో భాగంగా పర్యాటక, ఆతిథ్య రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని పర్యాటక శాఖ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ వెల్లడించారు. తొలి రోజు జీఐఎస్‌లో పర్యాటక, ఆతిథ్య రంగాల్లో రూ. 25 వేల కోట్ల పెట్టబడులు రాబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీలో పర్యాటక, ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున అవకాశాలున్నాయని, ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారని విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడుతూ రజత భార్గవ స్పష్టం చేశారు. రెండు రోజుల జీఐఎస్‌లో 125కి పైగా ఎంఓయూలు చేసుకోబోతున్నామని, ఈ సదస్సులో పాల్గొనడానికి ఒబెరాయ్, ఐటీసీ లాంటి దిగ్గజ హోటళ్ల చైర్మన్లు వస్తున్నారన్నారు. తొలి రోజు ఏడు పెద్ద ఎంఓయూలు చేసుకోబోతున్నామని, ఒక్కో ఎంఓయూ విలువ వెయ్యి కోట్లగా పైగానే ఉంటుందన్నారు. -
రైళ్లలో ఇక రుచికరమైన భోజనం!
న్యూఢిల్లీ: ఇక రైలు జర్నీ చేసే ప్రయాణికులకు భోజనం, అల్పాహారం సమస్యలు తీరనున్నాయి. కేంద్ర ప్రవేశపెట్టనున్న ఈ-కేటిరింగ్ విధానం ద్వారా 1350 రైల్వే స్టేషన్లకు ఈ సర్వీసులను కల్పించినట్లు మంగళవారం ఓ ప్రకటనలో రైల్వే మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇండియన్ రైల్వే, టూరిజంశాఖలు సంయుక్తంగా ప్రయాణికులకు నచ్చే విధంగా రుచికరమైన ఫుడ్ ను అందించనున్నాయి. క్యాంటిన్స్ లేని రైళ్లో ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన రైల్వే మంత్రిత్వశాఖ ఆ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది. నాణ్యత లేకుంటే ఫిర్యాదులు కేఎఫ్‌సీ, డోమినాస్, బిట్టూ, టిక్కి వాలా, ఫుడ్ పాండా మొదలగు రకాల ఆహార ఉత్పత్తులను ప్రయాణికులు పొందే అవకాశాన్ని కల్పించారు. సెంట్రలైజ్డ్ క్యాటరింగ్ సర్వీస్ మానిటరింగ్ సెల్ (సీఎస్ఎంసీ) టోల్ ఫ్రీ నెంబర్ 1800111321 లో వివరాలు తెలుసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ-కేటరింగ్ సర్వీసు ద్వారా కొనుగోలు చేసిన ఫుడ్ ప్రాడక్ట్స్ నాణ్యత లేని పక్షంలో, సర్వీసులలో ఏమైనా తలెత్తినా నెంబర్ 138కు కాల్ చేసి ప్రయాణీకులు తమ ఫిర్యాదులు తెలియచేసే అవకాశాన్ని కల్పించారు. ఆ శాఖ సహాయమంత్రి మనోజ్ సింహా ఈ వివరాలను గతవారం పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడించారు.