రైళ్లలో ఇక రుచికరమైన భోజనం! | railway ministry and tourism departmrnt provode E-catering service | Sakshi
Sakshi News home page

రైళ్లలో ఇక రుచికరమైన భోజనం!

Published Tue, Mar 1 2016 5:16 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

రైళ్లలో ఇక రుచికరమైన భోజనం!

రైళ్లలో ఇక రుచికరమైన భోజనం!

న్యూఢిల్లీ: ఇక రైలు జర్నీ చేసే ప్రయాణికులకు  భోజనం, అల్పాహారం సమస్యలు తీరనున్నాయి. కేంద్ర ప్రవేశపెట్టనున్న ఈ-కేటిరింగ్ విధానం ద్వారా 1350 రైల్వే స్టేషన్లకు ఈ సర్వీసులను కల్పించినట్లు మంగళవారం ఓ ప్రకటనలో రైల్వే మంత్రిత్వశాఖ పేర్కొంది.  ఇండియన్ రైల్వే, టూరిజంశాఖలు సంయుక్తంగా ప్రయాణికులకు నచ్చే విధంగా రుచికరమైన ఫుడ్ ను అందించనున్నాయి. క్యాంటిన్స్ లేని రైళ్లో ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన రైల్వే మంత్రిత్వశాఖ ఆ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది.

నాణ్యత లేకుంటే ఫిర్యాదులు
కేఎఫ్సీ, డోమినాస్, బిట్టూ, టిక్కి వాలా, ఫుడ్ పాండా మొదలగు రకాల ఆహార ఉత్పత్తులను ప్రయాణికులు పొందే అవకాశాన్ని కల్పించారు. సెంట్రలైజ్డ్ క్యాటరింగ్ సర్వీస్ మానిటరింగ్ సెల్ (సీఎస్ఎంసీ) టోల్ ఫ్రీ నెంబర్ 1800111321 లో వివరాలు తెలుసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ-కేటరింగ్ సర్వీసు ద్వారా కొనుగోలు చేసిన ఫుడ్ ప్రాడక్ట్స్ నాణ్యత లేని పక్షంలో, సర్వీసులలో ఏమైనా తలెత్తినా  నెంబర్ 138కు కాల్ చేసి ప్రయాణీకులు తమ ఫిర్యాదులు తెలియచేసే అవకాశాన్ని కల్పించారు. ఆ శాఖ సహాయమంత్రి మనోజ్ సింహా ఈ వివరాలను గతవారం పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement