E-catering
-
రైలు ప్రయాణికులకు శుభవార్త!
న్యూఢిల్లీ: రైల్వేమంత్రిత్వశాఖ ప్రతిరోజు లక్ష మందికి ఆహారాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఈ కాటరింగ్ విధానం ద్వారా రైళ్లలోనూ ప్రయాణికులకు నచ్చే ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే వెసలుబాటు కల్పించనుంది. ఈ క్యాంటీన్ విధానంతో ప్రయాణికుల భోజన సమస్యలకు చెక్ పెట్టాలని గతంలోనే నిర్ణయించారు. ప్రతిరోజూ దాదాపు లక్ష భోజనాల వరకు అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. 193 స్టేషన్లలో 1516 రైళ్లలో ఈ క్యాటరింగ్ ను అందుబాటులోకి తెస్తున్నారు. 2014లో కొన్ని రైళ్లలో ఈ సౌకర్యాన్ని కల్పించినా ప్రయాణికులకు అవసరాల దృష్ట్యా మరిన్ని సేవలను అందించాలని ఆ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ క్యాంటిన్ విస్తరణను మొదలుపెట్టారు. ఐఆర్సీటీసీ వెబ్ సైట్, మొబైల్ యాప్, కాల్ సెంటర్, ఎస్ఎంఎస్ పద్ధతులలో తమ ఆర్డర్ ను బుక్ చేసుకోవచ్చు. హల్దిరామ్స్, డోమినాస్ పిజ్జా, బికనిర్ వాలా, వింపి, ఇతర సంస్థలతో ఈ మేరకు రైల్వేశాఖ ఒప్పందాలు కుదుర్చుకోబోతుంది. -
రైళ్లలో ఇక రుచికరమైన భోజనం!
న్యూఢిల్లీ: ఇక రైలు జర్నీ చేసే ప్రయాణికులకు భోజనం, అల్పాహారం సమస్యలు తీరనున్నాయి. కేంద్ర ప్రవేశపెట్టనున్న ఈ-కేటిరింగ్ విధానం ద్వారా 1350 రైల్వే స్టేషన్లకు ఈ సర్వీసులను కల్పించినట్లు మంగళవారం ఓ ప్రకటనలో రైల్వే మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇండియన్ రైల్వే, టూరిజంశాఖలు సంయుక్తంగా ప్రయాణికులకు నచ్చే విధంగా రుచికరమైన ఫుడ్ ను అందించనున్నాయి. క్యాంటిన్స్ లేని రైళ్లో ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన రైల్వే మంత్రిత్వశాఖ ఆ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది. నాణ్యత లేకుంటే ఫిర్యాదులు కేఎఫ్‌సీ, డోమినాస్, బిట్టూ, టిక్కి వాలా, ఫుడ్ పాండా మొదలగు రకాల ఆహార ఉత్పత్తులను ప్రయాణికులు పొందే అవకాశాన్ని కల్పించారు. సెంట్రలైజ్డ్ క్యాటరింగ్ సర్వీస్ మానిటరింగ్ సెల్ (సీఎస్ఎంసీ) టోల్ ఫ్రీ నెంబర్ 1800111321 లో వివరాలు తెలుసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ-కేటరింగ్ సర్వీసు ద్వారా కొనుగోలు చేసిన ఫుడ్ ప్రాడక్ట్స్ నాణ్యత లేని పక్షంలో, సర్వీసులలో ఏమైనా తలెత్తినా నెంబర్ 138కు కాల్ చేసి ప్రయాణీకులు తమ ఫిర్యాదులు తెలియచేసే అవకాశాన్ని కల్పించారు. ఆ శాఖ సహాయమంత్రి మనోజ్ సింహా ఈ వివరాలను గతవారం పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడించారు. -
‘ఈ-కేటరింగ్’ షురూ
ప్రారంభించిన ఐఆర్సీటీసీ కోల్‌కతా: ముందస్తు ఆర్డర్లపై ప్రయాణికులకు రైల్వేస్టేషన్లలోనే వారికి కావల్సిన ఆహారాన్ని అందజేసేందుకు ఇండియన్ రైల్వేస్ కేటరింగ్, టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) సోమవారం ఓ పథకాన్ని ప్రారంభించింది. ‘ఈ-కేటరింగ్’ పేరిట దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తొలిదశలో దేశవ్యాప్తంగా ఎంపికచేసిన 45 ప్రధాన రైల్వేస్టేషన్లలో అమలు చేయనున్నారు. దీనికోసం ప్రయాణికులకు కావల్సిన ఆహారాన్ని అందించేందుకు భోజన సరఫరా సంస్థలతో ఐఆర్సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని ‘స్టేషన్ ఆధారిత ఈ-కేటరింగ్’గా వ్యవహరిస్తారు. దీనికోసం ప్రయాణికులు ఆన్లైన్లోనే www.ecatering.irctc.co.in ద్వారా బుక్‌చేసుకోవచ్చు. లేదా 0120-2383892-99/1800-1034-139 (టోల్ ఫ్రీ) నెంబర్లకు ఫోన్‌చేసి ఆర్డర్ చేయవచ్చు. లేదా 139 నెంబరుకు సంక్షిప్త సందేశం పంపి భోజన సదుపాయాన్ని పొందవచ్చు. అయితే సంస్థలు ఈ ఆహారాన్ని ప్రయాణికులకు సంబంధిత స్టేషన్లలో రైలు ఆగినప్పుడు ప్రయాణికుని బెర్త్ వద్దకు వచ్చి అందజేస్తాయి. చెల్లింపులను నేరుగానే కాకుండా, ఆన్‌లైన్‌లోనూ చేయొచ్చు. ఈ-కేటరింగ్ ఈస్ట్‌జోన్ పరిధిలోని హౌరా, సీల్దా, విశాఖపట్నం తదితర స్టేషన్లలో అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ, చెన్నయ్, బెంగళూరు, సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ తదితర ప్రధాన స్టేషన్లలో కూడా సరఫరా చేయనున్నారు.