రైలు ప్రయాణికులకు శుభవార్త! | IRCTC aims at 1 lakh meal order online per day | Sakshi
Sakshi News home page

రైలు ప్రయాణికులకు శుభవార్త!

Published Sun, Apr 3 2016 11:42 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

రైలు ప్రయాణికులకు శుభవార్త!

రైలు ప్రయాణికులకు శుభవార్త!

న్యూఢిల్లీ: రైల్వేమంత్రిత్వశాఖ ప్రతిరోజు లక్ష మందికి ఆహారాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఈ కాటరింగ్ విధానం ద్వారా రైళ్లలోనూ ప్రయాణికులకు నచ్చే ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే వెసలుబాటు కల్పించనుంది. ఈ క్యాంటీన్ విధానంతో ప్రయాణికుల భోజన సమస్యలకు చెక్ పెట్టాలని గతంలోనే నిర్ణయించారు. ప్రతిరోజూ దాదాపు లక్ష భోజనాల వరకు అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది.

193 స్టేషన్లలో 1516 రైళ్లలో ఈ క్యాటరింగ్ ను అందుబాటులోకి తెస్తున్నారు. 2014లో కొన్ని రైళ్లలో ఈ సౌకర్యాన్ని కల్పించినా ప్రయాణికులకు అవసరాల దృష్ట్యా మరిన్ని సేవలను అందించాలని ఆ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ క్యాంటిన్ విస్తరణను మొదలుపెట్టారు. ఐఆర్సీటీసీ వెబ్ సైట్, మొబైల్ యాప్, కాల్ సెంటర్, ఎస్ఎంఎస్ పద్ధతులలో తమ ఆర్డర్ ను బుక్ చేసుకోవచ్చు. హల్దిరామ్స్, డోమినాస్ పిజ్జా, బికనిర్ వాలా, వింపి, ఇతర సంస్థలతో ఈ మేరకు రైల్వేశాఖ ఒప్పందాలు కుదుర్చుకోబోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement