ఇండియన్ రైల్వే 'సూపర్ యాప్' పేరుతో ఓ సరికొత్త యాప్‌ను ప్రారంభించనున్నట్లు గత ఏడాదే వెల్లడించింది. చెప్పినట్లుగానే ఐఆర్‌సీటీసీ 'స్వరైల్' (SwaRail) పేరుతో ఓ కొత్త యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, పీఎన్ఆర్ స్టేటస్ వంటి అన్నీ సేవలను పొందవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
రైల్వే సేవలన్నింటినీ.. ఒకే చోట సులభంగా నావిగేట్ చేయగల ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో.. రైల్వే మంత్రిత్వ శాఖ జనవరి 31, 2025న "స్వరైల్" సూపర్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ప్రస్తుతం బీటా దశలో ఉంది. దీనిని ఆపిల్ యాప్ స్టోర్ & గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇది ప్రస్తుతం పరిమిత యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
స్వరైల్ యాప్ ద్వారా లభించే సేవలు
టికెట్ బుకింగ్: ప్రయాణికులు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
ప్లాట్‌ఫామ్ & పార్శిల్ బుకింగ్: వినియోగదారులు ప్లాట్‌ఫామ్ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. పార్శిల్ డెలివరీకి సంబంధించిన సేవలను బుక్ చేసుకోవచ్చు.
రైలు & పీఎన్ఆర్ స్టేటస్: ట్రైన్ షెడ్యూల్, పీఎన్ఆర్ స్టేటస్ వంటి వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు.
ఫుడ్ ఆర్డర్: రైలులో ప్రయాణించే సమయంలో.. ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.
రైల్ మదద్: ఫిర్యాదులు దాఖలు చేయడానికి మరియు సహాయం పొందడానికి ఒక హెల్ప్‌డెస్క్ మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది.
ఇదీ చదవండి: 2025లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్: రూ.10 వేలకంటే తక్కువే..
ఐఆర్‌సీటీసీ స్వరైల్ యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఇప్పుడు రైల్వే సేవల కోసం ఉపయోగిస్తున్న అనేక యాప్స్ కనుమరుగవుతాయి. ఇది మొబైల్ స్టోరేజ్ పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా.. ఒక్కో సర్వీస్ కోసం ఒక్కో యాప్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment