సాక్షి, విశాఖపట్నం: రెండు రోజుల్లో.. ప్రభుత్వంతో 352 ఎంవోయూలు. 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులు.. 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి. అంచనాలను మించి అందుకున్న లక్ష్యం. దటీజ్ ఏపీ సీఎం వైఎస్ జగన్. ఆయన చెప్తాడు.. చెప్పిందే చేతల్లో చూపిస్తాడు కూడా. విశాఖపట్నం గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ద్వారా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసుకున్నారాయన.
మునుపెన్నడూ చోటు చేసుకుని పరిణామానికి ఆంధ్రప్రదేశ్ వేదికైంది. పాలన రాజధాని విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ సూపర్ సక్సెస్ అయ్యింది. అడ్డగోలుగా విమర్శించే వాళ్ళ నోళ్లే.. అబ్బురపోయేలా పెట్టుబడుల ప్రవాహం పోటెత్తింది రాష్ట్రానికి. ఇది రాష్ట్రాభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్ష నేతకు ఏమాత్రం సహించని పరిణామమే!.
రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు ఇన్వెస్టర్లు. సదస్సులో భారీపెట్టుబడులకు ఆసక్తిక కనబరిచారు. ప్రభుత్వంతో కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొత్తంగా.. రాష్ట్రం దిశనే మార్చేసింది ఈ సదస్సు. విశాఖ తీరాన విప్లవాత్మకమైన నిర్ణయాలకు జీఐఎస్ ప్రాంగణం నెలవైంది. ఎనర్జీ విభాగంలో ఏకంగా రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ఇక ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగంలో రూ.3,35వేల కోట్లకు పైనే, ఐటీ అండ్ ఐటీఈఎస్ కేటగిరీలో 39 వేల కోట్ల రూపాయలపైనే, టూరిజంలో 22 వేల కోట్ల రూపాయలకుపైనే, వ్యవసాయ విభాగంలో వెయ్యి కోట్ల రూపాయలకుపైనే, పశుసంవర్థక విభాగంలో మరో వెయ్యి కోట్ల రూపాయలకుపైనే పెట్టుబడులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment