
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వాగతించారు. పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం అంటూ వ్యాఖ్యలు చేశారు.
సదస్సుపై శుక్రవారం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం. ఇది విజయవంతమవుతుంది. రాష్ట్ర ప్రగతి కోసం ప్రభుత్వానికి కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తున్నాం. ప్రధాని నరేంద్రమోదీ నిబద్దతతో కూడిన ప్రయత్నాల కారణంగా నేడు దేశం అనుకూలమైన పారిశ్రామికవాతావరణాన్ని కలిగి ఉంది. విశాఖ వేదికగా చేసిన వాగ్దానాలు రాష్ట్ర అభివృద్ధికి దారితీస్తాయని ఆశిస్తున్నాం. నితిన్ గడ్కరీ హాజరు కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎలా మద్దతు ఇస్తుందో చూపిస్తోంది’ అంటూ పేర్కొన్నారు.
విశాఖలో పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం మరియు ఇది విజయవంతమవుతుంది. రాష్ట్ర ప్రగతి కోసం ప్రభుత్వానికి కేంద్రం నుండి అన్ని విధాలా సహకారం అందిస్తున్నాం.
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) March 3, 2023
@narendramodi గారి నిబద్దతతో కూడిన ప్రయత్నాల కారణంగా నేడు దేశం అనుకూలమైన పారిశ్రామిక (1/2)@blsanthosh pic.twitter.com/TzmR5Cqrdz