
త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన సాగుతుందని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సీఎం జగన్ స్పష్టం చేశారు.
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా పారిశ్రామికవేత్తలు ఏపీలో పారిశ్రామిక అవకాశాలు, భవిష్యత్త్‌లో పెట్టుబడులపై కీలక ప్రసంగాలు చేశారు. రాబోయే రోజుల్లో భారీ పెట్టనున్నట్టు తెలిపారు.
కాగా, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సమ్మిట్ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘ఏపీకి రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని గర్వంగా చెబుతున్నాను. 340 సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు వచ్చాయి. తొలిరోజు 92 ఎంవోయూలు రాగా మొత్తం 340 ఎంవోయూలు.. దీని ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారింది. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఏపీలో కీలక రంగాల్లో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చాము.
రాష్ట్ర ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఏపీ భౌగోళికంగా పరిశ్రమలకు అనుకూలం. పెట్టుబడులకే కాదు ప్రకృతి అందాలకు కూడా విశాఖ నెలవు. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీ సొంతం. ఏపీలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పోర్టులకు సమీపంలో పుషల్కంగా భూములు ఉన్నాయి. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్స్ ఉంటే అందులో 3 ఏపీలోనే ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లు నంబర్ వన్‌గా ఉన్నాం. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540 సేవలు అందిస్తున్నాము. అలాగే, త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్‌గా రాజధానిగా అవుతుంది. త్వరలో విశాఖ నుంచే పరిపాలన సాగిస్తామని స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీలతో పారిశ్రామికాభివృద్ధి జరుగుతోంది. ఒక్క ఫోన్ కాల్‌తో సమస్యలు పరిష్కరిస్తాము. భవిష్యతులో గ్రీన్, హైడ్రో ఎనర్జీల్లో ఏపీదే కీలక పాత్ర అని అన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు
- ఎన్టీపీసా ఎంవోయూ(రూ. 2..35లక్షల కోట్లు)
- ఏబీసీ లిమిటెట్ ఎంవోయూ(రూ. 1.20 లక్షల కోట్లు)
- రెన్యూ పవర్ ఎంవోయూ(రూ. 97, 550 కోట్లు)
- ఇండోసాల్ ఎంవోయూ(రూ. 76, 033 కోట్లు)
- ఏసీఎమ్‌ఈ ఎంవోయూ(రూ. 68,976 కోట్లు)
- టీఈపీఎస్‌ఓఎల్ ఎంవోయూ( రూ. 65, 000 కోట్లు)
- జేఎస్‌డబ్యూ గ్రూప్(రూ. 50, 632 కోట్లు)
- హంచ్ వెంచర్స్(రూ. 50 వేల కోట్లు)
- అవాదా గ్రూప్( రూ 50 వేల కోట్లు)
- గ్రీన్ కో ఎంవోయూ(47, 600 కోట్లు)
- ఓసీఐఓఆర్ ఎంవోయూ (రూ. 40వేల కోట్లు)
- హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ (రూ. 30వేల కోట్లు)
- వైజాగ్ టెక్ పార్క్ (రూ. 21,844 కోట్లు)
- అదానీ ఎనర్జీ గ్రూప్ (రూ.21, 820 కోట్లు)
- ఎకోరెన్ ఎనర్జీ (రూ.15,500 కోట్లు)
- సెరంటికా ఎంవోయూ (రూ. 12,500 కోట్లు)
- ఎన్‌హెచ్‌పీసీ ఎంవోయూ (రూ.12వేల కోట్లు)
- అరబిందో గ్రూప్ (రూ.10, 365 కోట్లు)
- ఓ2 పవర్ ఎంవోయూ ( రూ.10వేల కోట్లు)
- ఏజీపీ సిటీ గ్యాస్ (రూ. 10వేల కోట్లు)
- జేసన్ ఇన్‌ఫ్రా ఎంవోయూ (రూ. 10వేల కోట్లు)
- ఆదిత్య బిర్లా గ్రూప్ (రూ. 9,300 కోట్లు)
- జిందాల్ స్టీల్ (రూ. 7500 కోట్లు)