సాక్షి, అమరావతి : ఎల్రక్టానిక్స్ అండ్ డిజైనింగ్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగానే పెట్టుబడులు ఆకర్షించింది. ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా ఎల్రక్టానిక్స్ రంగంలో రూ.15,711 కోట్ల విలువైన 23 ఒప్పందాలు జరిగినట్లు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ వెల్లడించారు.
ఈ పెట్టుబడుల ద్వారా 57,640 మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఎలక్ట్రానిక్స్ కంపెనీలు విస్తరణ చేపట్టేలా ఒప్పందం చేసుకోగా మరికొన్ని కొత్త కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఇందులో అత్యధిక పెట్టుబడులు తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోనే వచ్చాయి.
అత్యధికంగా టీసీఎల్ గ్రూప్..
టీసీఎల్ గ్రూపు రాష్ట్రంలో అత్యధికంగా రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. టీవీ డిస్‌ప్లే ప్యానల్స్‌ను
టీసీఎల్ గ్రూపు ఉత్పత్తి చేయనుంది.
♦ సెల్‌ఫోన్ కెమెరాలు, ఇయర్ ఫోన్స్ వంటి ఉపకరణాలను తయారుచేసేందుకు సన్నీఆపె్టక్ రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
♦ అలాగే, ఇప్పటికే శ్రీసిటీలో పెట్టుబడులు పెట్టిన బ్లూస్టార్, డైకిన్ సంస్థలు తమ విస్తరణ కార్యక్రమాలను ప్రకటించాయి. డైకిన్ సంస్థ రూ.2,600 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకోగా.. బ్లూస్టార్ రూ.550 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
♦ ఇవికాక.. డ్రోన్స్, లాజిస్టిక్ సొల్యూషన్స్, డిఫెన్స్, వ్యవసాయ రంగాల్లో ఎల్రక్టానిక్ ఉత్పత్తులను తయారుచేసే పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం 23 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోగా మరిన్ని సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని అపిటా గ్రూపు సీఈఓ కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇక తిరుపతిలో రెండు, శ్రీసిటీలో ఒకటి, వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్ ఈఎంసీ మొత్తం నాలుగు ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్ అందుబాటులో ఉండటంతో ఎల్రక్టానిక్స్ సంస్థలు రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment