సాక్షి, విశాఖపట్నం: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో ఏపీకీ పెట్టుబడుల వరద పారింది. రెండు రోజుల్లో 13 లక్షల 5వేల 663 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 352 ఎంఓయూలు జరిగాయి.
శాఖలవారీగా పెట్టుబడుల వివరాలు ఇలా..
► ఎనర్జీ విభాగంలో రూ.9 లక్షల 7వేల 126 కోట్లు
► ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగంలో రూ.3లక్షల 35వేల 644 కోట్లు
► ఐటీ అండ్ ఐటీఈఎస్ విభాగంలో రూ.39వేల 636 కోట్లు
► పర్యాటక విభాగంలో రూ.22వేల 96కోట్లు
► వ్యవసాయ విభాగంలో రూ.1,160 కోట్లు
► పశుసంవర్ధక విభాగంలో రూ.1,020 కోట్లు
జీఐఎస్ విజయానికి కృషి చేసిన వారందరికీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 6లక్షల 3వేల 223 మందికి ఉపాధి లభించనున్నట్లు తెలిపారు. గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోందని చెప్పారు. పారదర్శక పాలనతోనే విజయాలు సాధిస్తున్నామన్నారు.
చదవండి: విశాఖ జీఐఎస్ సూపర్ సక్సెస్.. ఇండస్ట్రీస్ మ్యాప్‌లో ఏపీ సుప్రీం
Comments
Please login to add a commentAdd a comment