GIS-2023 Updates..
సీఎం వైఎస్ జగన్ ముగింపు ఉపన్యాసం
►రెండు రోజుల్లో 352 ఎంవోయూలు
►మొత్తం రూ. 13 లక్షల 5వేల 663 కోట్ల పెట్టుబడులు
► రూ. 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి
►జీఐఎస్ విజయానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్
►గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోంది
కీలక సమయంలో సమ్మిట్ నిర్వహించాం
►ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం
►15 కీలక రంగాల్లో ఫలవంతమైన చర్యలు జరిగాయి
►కరోనా సమయంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అండగా నిలిచాయి
►ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులో వేస్తోంది
►పారదర్శక పాలనతో విజయాలు సాధిస్తున్నాం
►కీలక సమయంలో సమ్మిట్ నిర్వహించాం
►పలు రంగాల్లో నాణ్యమైన పెట్టుబడులు
►గ్రీన్ ఎనర్జీకి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాం
►పారిశ్రామిక వేత్తలకు సంపూర్ణ సహకారం
►ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేలా ప్రభుత్వ సహకారం
►జీఐఎస్ విజయానికి కృషిచేసిన వారందరికీ కృతజ్ఞతలు
►నూతన పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించిన సీఎం జగన్
►బ్లూస్టార్ యూనిట్లను ప్రారంభించిన సీఎం జగన్
►పోర్టులు, షిప్పింగ్‌శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. ‘జీఐఎస్ పాల్గొనడం సంతోషకరం. దేశంలో విశాఖ ప్రత్యేక నగరంగా నిలిచింది: విశాఖ కేంద్రంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం సంతోషం. శతాబ్దాలుగా భారత్‌లో విశాఖ కీలకంగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ ఇండియా అభివృద్ధి. విశాఖ కేంద్రంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం సంతోషం. ఏపీ వేగంగా అభివృద్ధి చెందడానికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. విశాఖ పోర్టు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం’అని అన్నారు.
►కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ ఏపీకి పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జీఐఎస్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. దేశంలో అంతర్జాతీయ రహదారులు నిర్మిస్తున్నాం. ప్రపంచ ఆర్థికప్రగతిలో ఇండియా కీలకమని ఐఎంఎఫ్ ప్రకటించింది. ప్రతిభగల యువత ఏపీలో ఉంది. నైపుణ్యంగల మానవ వనరులు ఏపీ సొంతం’ అని పేర్కొన్నారు.
►భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర కె ఎల్లా మాట్లాడుతూ.. ‘ ఏపీ అభివృద్ధిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతిష్టాత్మకంగా భావించి జీవిఎస్ నిర్వహించారు.పలు కీలక రంగాల్లో ఏపీ ప్రగతి బాగుంది. సీఐఐకి దివంగత సీఎం వైఎస్సార్ సహకారం మరువలేనిది. ఏపీ పారిశ్రామిక ప్రగతికి సీఐఐ సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అంతర్జాతీయ కంపెనీలు ఏపీ వైపు చూడటం ప్రశంసనీయం. ఇండియా ప్రగతిలో ఏపీ కీలక భాగస్వామి అవుతోంది. సమ్మిళిత వృద్ధి కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారు’ అని ప్రశంసించారు.
► రెడ్డిస్ ల్యాబ్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ పెట్టుబడుల కేంద్రంగా మారింది. అంతర్జాతీయంగా ఫార్మా ఇండస్ట్రీ కీలక పాత్ర పోషిస్తోంది. ఏపీ ప్రభుత్వ సహకారం మరిచిపోలేనిది. ఏపీలో పరిశ్రమలకు అపార అవకాశాలున్నాయి. ఏపీలో పారిశ్రామిక విధానాల కారణంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. పరిశ్రమలకు అనుమతులు వెంటనే లభిస్తున్నాయి. ఇన్నోవేషన్‌లో ఏపీ ఆదర్శనీయంగా ఉంది. ఏపీలో సామాజిక సూచికలు విశిష్టంగా ఉన్నాయి. ఆరోగ్య రంగ ప్రగతి కోసం వైఎస్సార్ చేసిన కృషి అమోఘం’ అని పేర్కొన్నారు.
► అపాచీ అండ్ హిల్‌టాప్ గ్రూప్ డైరెక్టర్ సెర్జియో లీ మాట్లాడుతూ.. పారిశ్రామిక ప్రగతి కోసం వైఎస్సార్ చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. మూడు దేశాల్లో అపాచీ గ్రూప్ కార్యాకలాపాలున్నాయి. సీఎం జగన్ విజనరీ లీడర్. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏపీలో డైనమిక్ సీఎం ఉండటంతోనే పారిశ్రామిక ప్రగతి సాధ్యమైందన్నారు.
► సెయింట్ గొబెయిన్ సీఈవో సంతానం మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ సమర్థతలో అసాధారణ రీతిలో పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమలు కోరుకునే సుస్థిరమైన విధానాలు ఏపీలో ఉన్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టినందుకు సంతోషంగా ఉంది. ఏపీలో మా పెట్టుబడులు విస్తారిస్తాం. ఏపీ ప్రభుత్వం నిబద్దతలో పనిచేస్తోంది. నాణ్యమైన మానవ వనరులు ఏపీలో తయారవుతున్నాయి. ఉన్నతాధికారులు సహకారం చక్కగా ఉంది. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తున్నారు. ఏపీలో హామీలు నెరవేరుస్తున్న చేతల ప్రభుత్వం ఉంది.
► హెటిరో గ్రూప్ ఎండీ డాక్టర్ వంశీ కృష్ణ బండి మాట్లాడుతూ.. ప్రపంచ ఫార్మా రంగంలో ఏపీ కీలక ప్రాత పోషిస్తోంది. ఏపీలో ఫార్మా విధానాలతో ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతోంది. పరిశ్రమలకు ఏపీ సర్కార్ సహకారం అమోఘం అని అన్నారు.
► లారస్ ల్యాబ్స్ ఫౌండర్ అండ్ సీఈవో సత్యనారాయణ చావా మాట్లాడుతూ.. ఫార్మా రంగంలో ఏపీ పటిష్టంగా ఉంది. ఏపీలో ఎకో సిస్టమ్ బాగా ఉండటం వల్ల కంపెనీలు బలపడుతున్నాయి. ప్రపంచానికి కావాల్సిన కీలక డ్రగ్స్ ఏపీలో తయారవుతున్నాయి. ప్రసిద్ధి చెందిన ఫార్మా కంపెనీలన్నీ ఏపీలో పనిచేస్తున్నాయి. పారిశ్రామిక ప్రగతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ప్రభుత్వానికి నా అభినందనలు. ఏపీలో ఇతర రాష్ట్రాల కంటే వేగంగా అనుమతులు లభిస్తున్నాయి.
► నోవా ఎయిర్ సీఈఓ అండ్ ఎండీ గజానన్ నాజర్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థలో ఏపీ నంబర్ వన్. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏపీకి సమర్ధవంతమైన నాయకత్వం ఉంది. రాష్ట్రంలో ప్రతిభగల అధికారులు ఉన్నారు. రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జోష్‌గా సాగింది. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు సమ్యలను పరిష్కరిస్తున్నారు అని తెలిపారు.
► అవాడ గ్రూప్ ఛైర్మన్ వినిత్ మిట్టల్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. దేశ ఆర్థిక ప్రగతిలో ఏపీ కీలకంగా ఉంది. పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ కీలక పాత్ర పోషించబోతోంది. ఏపీ గ్రీన్ ఎనర్జీ అప్రోచ్ అమోఘం. కర్బన రహిత పర్యావరణం కోసం ఏపీ కృషి చేస్తోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్ వన్‌గా నిలిచింది. నెంబర్ వన్‌గా నిలవడం సాధారణమైన విషయం కాదు. పారిశ్రామిక అనుకూల వాతావరణంవలనే ఏపీలో మా పెట్టుబడ్డులు పెట్టాం అని తెలిపారు.
► మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మాటల మనిషి కాదు.. చేతల మనిషి. సీఎం జగన్ దార్శనికతతో పారిశ్రామికంగా మందడుగు వేస్తున్నాం. జీఐఎస్ చారిత్రాత్మక విజయం సాధించింది. వివిధ దేశాల నుంచి ప్రసిద్ధ సంస్థలు జీఐఎస్‌కు వచ్చాయి. రెండు రోజల సదస్సులో విలువైన చర్చలు జరిగాయి. పారిశ్రామికవేత్తల అంచనాలకు తగినట్టు ప్రభుత్వం సహకారం అందిస్తోంది.
► సీఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. జీఐఎస్ అంచనాలకు మించి విజయం సాధించింది. పారిశ్రామిక దిగ్గజాలు తమ విలువైన అభిప్రాయాలు పంచుకున్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. జీఐఎస్ సూపర్ సక్సెస్ సాధించింది.
► గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ.
► గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. స్వాగతం పలికిన సీఎం జగన్.
► గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదిక వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. పారిశ్రామికవేత్తలతో మాటామంతి.
► లారెస్ కంపెనీ అధినేత సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇది వరకే 5వేల మందికి ఉపాధి కల్పించాము. ఇంకా పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాము. కెమికల్స్, లాజిస్టిక్స్, ఫార్మా రంగంలో మరిన్ని పెట్టుబడులు పెడతాం.
► మంత్రి రోజా మాట్లాడుతూ.. సీఎం జగన్ సమర్ధవంతమైన నాయకత్వం వల్లే భారీగా పెట్టుబడులు వచ్చాయి. ప్రజలు ముఖ్యమంత్రి జగన్ మీద పెట్టుకున్న నమ్మకానికి ఇది నిదర్శనం. పారదర్శకమైన పాలన వల్లే ఇది సాధ్యమైంది.
► మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రానికి సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్.
► బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ మాట్లాడుతూ.. ఏపీకి పెట్టుబడులు రావడం చాలా సంతోషం. విదేశాల నుంచి పెద్ద ఎత్తున మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్దికి సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తారని భావిస్తున్నాను.
► విశాఖ చేరుకున్న కేంద్ర పోర్టులు, షిప్పింగ్స్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాలా
2వ రోజు ఎంవోయూలు
►రిలయన్స్ ఎంవోయూ రూ. 50,000 కోట్లు
►హెచ్‌పీసీఎల్ ఎనర్జీ ఎంవోయూరూ. 14, 320 కోట్ల
►టీవీఎస్ ఐఎల్‌పీ ఎంవోయూ రూ. 1,500 కోట్లు
►ఎకో స్టీల్ ఎంవోయూ రూ. 894 కోట్లు
►బ్లూస్టార్ ఎంవోయూ రూ. 890 కోట్లు
►ఎస్2పీ సోలార్ సిస్టమ్స్ ఎంవోయూ రూ. 850 కోట్లు
►గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్ ఎంవోయూ రూ. 800 కోట్లు
►ఎక్స్‌ప్రెస్ వెల్ రీసోర్సెస్ ఎంవోయూ రూ. 800 కోట్లు
►రామ్‌కో ఎంవోయూ రూ. 750 కోట్లు
►క్రిబ్కో గ్రీన్ ఎంవోయూ రూ. 725 కోట్లు
►ప్రకాశ్ ఫెరోస్ ఎంవోయూ రూ. 723 కోట్లు
►ప్రతిష్ట బిజినెస్ ఎంవోయూ రూ. 700 కోట్లు
►తాజ్ గ్రూప్ ఎంవోయూ రూ. 700 కోట్లు
►కింబర్లీ క్లార్క్ ఎంవోయూ రూ. 700 కోట్లు
►అలియన్న్ టైర్ గ్రూప్ ఎంవోయూ రూ. 679 కోట్లు
►దాల్మియా ఎంవోయూ రూ. 650 కోట్లు
►అనా వొలియో ఎంవోయూ రూ. 650 కోట్లు
►డీఎక్స్‌ఎన్ ఎంవోయూ రూ. 600 కోట్లు
►ఈ-ప్యాక్ డ్యూరబుల్ ఎంవోయూ రూ. 550 కోట్లు
►నాట్ సొల్యూషన్న్ ఎంవోయూ రూ. 500 కోట్లు
►అకౌంటిఫై ఇంక్ ఎంవోయూ రూ. 488 కోట్లు
►కాంటినెంటల్ ఫుడ్ అండ్ బెవరేజీస్ ఎంవోయూ రూ. 400 కోట్లు
►నార్త్ ఈస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎంవోయూ రూ. 400 కోట్లు
►ఆటమ్‌స్టేట్ టెక్నాలజీస్ ఎంవోయూ రూ. 350 కోట్లు
►క్లేరియన్ సర్వీసెస్ ఎంవోయూ రూ. 350 కోట్లు
►చాంపియన్ లగ్జరీ రిసార్ట్స్ ఎంవోయూ రూ. 350 కోట్లు
►వీఆర్‌ఎమ్ గ్రూప్ ఎంవోయూ రూ. 342 కోట్లు
►రివర్ బే గ్రూప్ ఎంవోయూ రూ. 300 కోట్లు
►హావెల్స్ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు
►సూట్స్ కేర్ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు
►పోలో టవర్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు
►ఇండియా అసిస్ట్ ఇన్‌సైట్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు
►స్పార్క్ ఎంవోయూ రూ. 300 కోట్లు
►టెక్ విషెన్ సాఫ్ట్‌వేర్ ఎంవోయూ రూ. 300 కోట్లు
►మిస్టిక్ పామ్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు
►నియోలింక్ గ్రూప్ ఎంవోయూ రూ. 300 కోట్లు
►ఎండానా ఎనర్జీస్ ఎంవోయూ రూ. 285 కోట్లు
►అబ్సింకా హోటల్స్ ఎంవోయూ రూ. 260 కోట్లు
►సర్ రే విలేజ్ రిసార్ట్స్ ఎంవోయూ రూ. 250 కోట్లు
►హ్యాపీ వండర్‌లాండ్ రిసార్ట్స్ ఎంవోయూరూ. 250 కోట్లు
►చాంపియన్స్ యాచ్ క్లబ్ ఎంవోయూ రూ. 250 కోట్లు
►టెక్నోజెన్ ఎంవోయూ రూ. 250 కోట్లు
►పార్లె ఆగ్రో ఎంవోయూ రూ. 250 కోట్లు
►ఎకో అజైల్ రిసార్ట్ ఎంవోయూ రూ. 243 కోట్లు
►ఎల్జీ పాలిమర్స్ ఎంవోయూ రూ. 240 కోట్లు
►హైథియన్ హ్యూయన్ మిషనరీ ఎంవోయూ రూ. 230 కోట్లు
►గోకుల్ ఆగ్రో ఎంవోయూ రూ. 230 కోట్లు
►ఎస్‌పీఎస్ ఇన్‌ప్రా ఎంవోయూ రూ. 225 కోట్లు
►డీవీవీ బయో ఫ్యూయల్స్ ఎంవోయూ రూ. 223 కోట్లు
►దాల్వకోట్ బయో ఫ్యూయల్ప్ ఎంవోయూ రూ. 200 కోట్లు
►ఆమ్ కన్‌స్ట్రక్షన్స్ ఎంవోయూ రూ. 200 కోట్లు
►కేపిటల్ బిజినెస్ పార్క్ ఎంవోయూ రూ. 184 కోట్లు
►చాంయిన్ యాచ్ ఎంవోయూ రూ. 190 కోట్లు
►ఎన్‌జీసీ ట్రాన్స్‌మిషన్ ఎంవోయూ రూ. 185 కోట్లు
►యాక్సలెంట్ ఫార్మా సైన్స్ ఎంవోయూ రూ. 176 కోట్లు
►విన్‌విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్స్ ఎంవోయూ రూ. 174 కోట్లు
►ట్రాన్సెండ్ రియాలిటీ డెవలప్‌మెంట్ ఎంవోయూ రూ. 165 కోట్లు
►చాంపియన్ ఇన్‌ఫ్రాటెక్ ఎంవోయూ రూ. 150 కోట్లు
►స్విచ్‌గేర్ ఎంవోయూ రూ. 150 కోట్లు
►ఆంబర్ ఎంటర్‌ప్రైజస్ ఇండియా ఎంవోయూ రూ. 150 కోట్లు
►ది రిప్పుల్స్ ఎంవోయూ రూ. 150 కోట్లు
9:20AM
►నేడు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు
►రెండో రోజు కొనసాగుతున్న ఎంవోయూలు
►ఎంవోయూలతో సదస్సు ప్రారంభం
9:10AM
సభాప్థలి వద్ద మీడియాతో మంత్రి గుడివాడ అమర్నాథ్
►సీఎం వైఎస్ జగన్ క్రెడిబిలీటీగల నాయకుడు
►పారిశ్రామికవేత్తల అభిప్రాయాల అధారంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్‌వన్ అయ్యింది
►రాష్ట్రంలో సంస్కరణలకు ఇతర రాష్ట్రాల ఆదర్శంగా తీసుకుంటున్నాయి
►ఏపీలో పలు రంగాల్లో అవకాశాలు పుష్కలం
►నేడు ఏపీకి వస్తున్నది రియలిస్టిక్ ఇన్వెస్ట్‌మెంట్స్
►పారిశ్రామిక దిగ్గజాలు చెప్పిన మాటలను ప్రతిపక్షాలు అవగాహన చేసుకోవాలి
►ప్రతి ఎంవోయూ పారదర్శకంగా రూపొందింది
►మూడేళ్లలో 89 శాతం ఎంవోయూలు వాస్తవరూపం దాల్చాయి
9:00AM
2వ రోజు ప్రారంభమైన జీఐఎస్-2023
►రెండవ రోజు శనివారం ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ప్రారంభమైంది
రెండో రోజు 8 రంగాలపై సెషన్లు
విశాఖపట్నం: రెండో రోజు శనివారం ఉదయం 9 గంటలకు ఆటోరియం 1లో పెట్రోలియం అండ్ పెట్రో కెమికల్స్, 2లో హయ్యర్ ఎడ్యుకేషన్, 3లో స్కిల్ డెవలప్‌మెంట్, 4లో వియత్నాం కంట్రీ సెషన్ జరగనుంది. 9.45 గంటలకు ఆడిటోరియం 1లో టూరిజం అండ్ హాస్పిటాలిటీ, 2లో టెక్స్‌టైల్స్ అండ్ అపరెల్స్, 3లో ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్, 4లో వెస్టర్న్ ఆస్ట్రేలియా కంట్రీ సెషన్ ఉంటుంది.
ఆ తర్వాత నోవా ఎయిర్ సీఈఓ అండ్ ఎండీ గజానన్ నాబర్, అవాడ గ్రూప్ చైర్మన్ వినీత్ మిట్టల్, లారస్ ల్యాబ్స్ ఫౌండర్ అండ్ సీఈఓ సత్యనారాయణ చావ, హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ డాక్టర్ వంశీ కృష్ణ బండి, గ్రీన్‌కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనీల్‌కుమార్ చలమశెట్టి, సెయింట్ గోబిన్ ఆసియా–పసిఫిక్ అండ్ ఇండియా సీఈఓ సంతానం.బి ప్రసంగాలు ఉంటాయి.
అనంతరం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, అపాచీ అండ్ హిల్‌టాప్ గ్రూప్ డైరెక్టర్ అండ్ గ్రూప్ హెడ్ ఇండియా ఆపరేషన్స్ సర్జియో లీ, బ్లెండ్ హబ్ ఫౌండర్ హెన్‌రిక్ స్టామ్ క్రిస్టెన్‌సన్, వెల్‌స్పన్ గ్రూప్ ఎండీ రాజేష్ మండవేవాలా, వెల్‌స్పన్ గ్రూప్ ఎండీ సతీష్‌రెడ్డి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండీ, సీఐఐ సదరన్ రీజియన్ చైర్‌పర్సన్ సుచిత్ర కె.ఎల్లా ప్రసంగిస్తారు. ఆ తర్వాత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ కీలక ఉపన్యాసం ఉంటుంది. అనంతరం సమ్మిట్ వేదికపై నుంచి కొత్త పరిశ్రమ యూనిట్ల ప్రారంభోత్సవం, సీఎం వైఎస్ జగన్ ముగింపు ఉపన్యాసం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment