
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి సీదిరి అప్పలరాజు అభివర్ణించారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి వెల్లువెత్తుతున్న పెట్టుబడులను ఉద్దేశించి మంత్రి అప్పలరాజు శనివారం మీడియాతో మాట్లాడారు.
సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఏపీకి బ్రాండ్ అంబాసిడర్. ఈ భారీ పెట్టుబడులు ఆయన ఛరిష్మాతోనే వచ్చాయి అని పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. అలాగే.. త్వరలో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారబోతోందన్న ఆయన.. అందులో భోగాపురం మీదుగా ఆరు లైన్ల హైవే ఏర్పాటు అభివృద్ధికి కీలకం కానుందని తెలిపారు.
ఇదిలా ఉంటే.. విశాఖపట్నం ఏయూ గ్రౌండ్ వేదికగా రాష్ట్రానికి పెట్టుబడుల పండుగగా వర్ణిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రెండో రోజూ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment