
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కార్యక్రమాలు రెండో రోజు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు పోర్ట్స్ అండ్ షిప్పింగ్ కేంద్ర మంత్రిసర్బానంద సోనోవాల్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. ‘జీఐఎస్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. దేశంలో విశాఖపట్నం ప్రత్యేక నగరంగా నిలిచింది. శతాబ్ధాలుగా భారతదేశంలో విశాఖ కీలకంగా ఉంది. విశాఖ కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషం. ఏపీ వేగంగా అభివృద్ధి చెందడానికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. విశాఖ పోర్టు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. విశాఖపట్నం చాలా అందమైన ప్రదేశం. విశాఖలాంటి నగరం ఉండటం ఏపీ అదృష్టం. భారత దేశ ప్రగతిలో ఏపీ కీలకం కానుంది’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment