NHPC
-
‘పవర్’ ఫుల్
► రూ.10,350 కోట్ల పెట్టుబడి, 2,300 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్కో కంపెనీ నిర్మించే సౌర విద్యుత్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్ధాపన. దీనిద్వారా 2,300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ► 1,014 మెగావాట్లతో ఆర్సిలర్ మిట్టల్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ నిర్మించే ప్రాజెక్టుకు శంకుస్ధాపన. ఇందులో 700 మెగావాట్లు సోలార్ పవర్ కాగా 314 మెగావాట్లు విండ్ పవర్ ఉత్పత్తి. రూ.4,500 కోట్ల పెట్టుబడితో 1,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ► ఎకోరన్ ఎనర్జీ 2 వేల మెగావాట్ల (1,000 మె.వా. సోలార్, 1,000 మె.వా. విండ్ పవర్) సామర్ధ్యంతో నిర్మించనున్న ప్రాజెక్టుకు శంకుస్ధాపన. దాదాపు రూ.11 వేల కోట్ల పెట్టుబడితో 2 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు.. ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం ► 2 వేల మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు సంబంధించి ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం. రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో యాగంటి, కమలపాడులో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టుల వల్ల 2 వేల మందికి ఉద్యోగాల కల్పన. ► వీటితో పాటు ఎన్‌హెచ్‌పీసీతో మరో మూడు ప్రాజెక్టుల ఫీజిబిలిటీపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం. మరో 2,750 మెగావాట్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టులపై కలసి పని చేసేలా అడుగులు. రాష్ట్రానికి.. రైతులకు.. యువతకు మేలు ఈ ప్రాజెక్టుల ఏర్పాటుతో మనకు జరిగే మేలును ఒక్కసారి పరిశీలిస్తే.. రాబోయే రోజుల్లో మన యువతకు స్ధానికంగా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా అందుబాటులోకి వస్తున్న ప్రతి మెగావాట్‌కు మరో వందేళ్ల పాటు అంటే ఈ ప్రాజెక్టు లైఫ్ ఉన్నంత కాలం మెగావాట్‌కు రూ.లక్ష చొప్పున రాయల్టీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీంతో పాటు ఈ ప్రాజెక్టుల వల్ల జీఎస్టీ ఆదాయం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టులకు తమ భూములిస్తూ సహకరిస్తున్న రైతన్నలకు కూడా ఈ కంపెనీల నుంచి లీజు రూపంలో ఏటా ఎకరాకు రూ.30 వేలు చొప్పున ఆదాయం వస్తుంది. ఇందుకు ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటుంది. అంటే రైతులు ఎవరైనా భూములివ్వాలనుకుంటే ప్రతి రైతుకు, ప్రతి ఎకరానికి, ఏడాదికి రూ.30 వేలు లీజు రూపంలో ఇస్తారు. ప్రతి రెండేళ్లకు 5 శాతం లీజు రుసుము కూడా పెరుగుతుంది. దశాబ్దాలుగా నీళ్లకు కటకటలాడిన దుర్భిక్ష ప్రాంతం రాయలసీమ రైతన్నలకు ఈ ప్రాజెక్టులతో మంచి జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇవి పర్యావరణానికి మేలు చేస్తాయి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర ఇంధన రంగానికి భద్రత చేకూరేలా మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుడుతూ చరిత్రాత్మక ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఒప్పందాలను శరవేగంగా కార్యాచరణలోకి తెస్తూ నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం వర్చువల్ విధానంలో భూమి పూజ నిర్వహించారు. మరో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల (పీఎస్పీ) ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో), కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) మధ్య ఒప్పందం కుదిరింది. ఈమేరకు సీఎం జగన్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఏపీ జెన్కో ఎండీ చక్రధరబాబు, ఎన్‌హెచ్‌పీసీ ఫైనాన్స్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ గోయల్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ రంగంలో అపార పెట్టుబడుల అవకాశాలపై సీఎం జగన్ శ్వేతపత్రాన్ని విడుదల చేసి మాట్లాడారు. భవిష్యత్తు గ్రీన్ ఎనర్జీదే ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ మనతో పాటు ఉన్న బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారత్, గ్రీన్కో, ఆర్సెలర్ మిట్టల్, ఎకోరన్ గ్రూపు యాజమాన్యాలకు, కంపెనీల ప్రతినిధులు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు ఇక్కడకు వచ్చిన ఎన్‌హెచ్‌పీసీ ఫైనాన్స్ డైరెక్టర్ గోయల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్‌కు ధన్యవాదాలు. ఇవాళ మూడు ప్రాజెక్టులకు శంకుస్ధాపన నిర్వహిస్తున్నాం. నాలుగో కార్యక్రమం కింద ఎన్‌హెచ్‌పీసీతో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంటున్నాం. మొదటి ప్రాజెక్టు గ్రీన్కో.. 2,300 మెగావాట్ల సౌర విద్యుత్తుకు సంబంధించి రూ.10,350 కోట్ల పెట్టుబడితో 2,300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగిస్తున్న ప్రాజెక్టు ఇది. ఇక పంప్డ్ స్టోరేజ్ అన్నది ఆర్టిఫీషియల్ బ్యాటరీ లాంటిది. పీక్ అవర్స్‌లో పవర్ జనరేట్ చేస్తాం. నాన్ పీక్ అవర్స్‌లో మళ్లీ నీళ్లని వెనక్కి పంప్ చేసి ఆ తరువాత, పీక్ అవర్స్‌లో పవర్‌ని జనరేట్ చేసేందుకు ఆర్టిఫీషియల్ బ్యాటరీ మాదిరిగా ఏర్పాట్లు ఉంటాయి. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు భవిష్యత్తులో పూర్తిగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తయ్యేలా దోహదం చేస్తాయి. దీనివల్ల బొగ్గు లాంటి శిలాజ ఇంధనాల మీద ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. పర్యావరణానికి మంచి జరగాలంటే రాబోయే రోజుల్లో పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. సోలార్ ప్రాజెక్టులు, విండ్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులతో మనం అనుసంధానమవుతున్న తీరు గ్రీన్ ఎనర్జీలో పెను మార్పులకు దారి తీస్తాయి. పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి. అదే సమయంలో విద్యుదుత్పత్తికి తోడ్పాటునివ్వడం ద్వారా గ్రీన్ ఎనర్జీలో ఒక విప్లవాత్మక మార్పు వస్తుంది. మరో 30 ఏళ్లు ఉచిత విద్యుత్తుకు ఢోకా లేకుండా.. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 8,998 మెగావాట్ల సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేస్తున్నాం. రైతులకు దీర్ఘకాలం పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు 16 వేల మిలియన్ యూనిట్లు అంటే దాదాపు 7,200 మెగావాట్లకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ)తో యూనిట్ రూ.2.49కే అందేలా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. తద్వారా మరో 25 నుంచి 30 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి పవర్ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులకు లోనుకాకుండా, ఒత్తిడి లేకుండా రైతులకు ఉచితంగా విద్యుత్ అందించే వెసులుబాటు లభిస్తుంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో రూ.2.49కే మరో 25 – 30 ఏళ్ల పాటు ఉచిత కరెంటుకు ఢోకా లేకుండా ఒప్పందం కుదుర్చుకుంది. ఇది గొప్ప అడుగు. 41 వేల మెగావాట్లు.. 37 ప్రాంతాలు ఒకవైపు ఇవన్నీ చేస్తూనే మరోవైపు పంప్డ్ స్టోరేజీని ప్రోత్సహించడంలో భాగంగా దాదాపు 41 వేల మెగావాట్లకు సంబంధించి 37 ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాం. ఇందులో 33,240 మెగావాట్లకు సంబంధించి 29 చోట్ల ప్రాజెక్టు ఫీజిబులిటీ పరిశీలన జరుగుతోంది. 20,900 మెగావాట్ల కెపాసిటీకి సంబంధించిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు కూడా పూర్తయ్యాయి. వీటిలో 16,180 మెగావాట్ల కెపాసిటీతో ఉత్పత్తి చేసేందుకు వివిధ కంపెనీలకు అలాట్మెంట్లు కూడా పూర్తయ్యాయి. ఇందులో భాగంగానే ఇవాళ ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం చేసుకుంటున్నాం. దీనిలో యాగంటిలో 1,000 మెగావాట్ల ప్రాజెక్టు, కమలపాడులో మరో 950 మెగావాట్లు కలిపి మొత్తంగా దాదాపు 2 వేల మెగావాట్ల ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌పీసీతో కలిసి నిర్మించనుంది. దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులకు ఫీజిబులిటీ స్డడీస్ పూర్తయ్యాయి. ఎన్‌హెచ్‌పీసీ, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం వాటాతో ప్రాజెక్టును అభివృద్ధిలా ఇవాళ ఎంవోఓయూ కుదుర్చుకున్నాం. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు.. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు, ఎన్ఆర్ఈడీసీఏపీ వీసీ, ఎండీ ఎస్.రమణారెడ్డి, బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్, డిప్యూటీ హెడ్ మిషన్ యూకే గవర్నమెంట్ వరుణ్ మాలి, యూకే గవర్నమెంట్ సీనియర్ అడ్వైజర్ నిషాంత్‌కుమార్ సింగ్, ఎన్‌హెచ్‌పీసీ ఫైనాన్స్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ గోయల్, గ్రీన్కో వైస్ ప్రెసిడెంట్ ఎన్.శేషగిరిరావు, ఏఎం గ్రీన్ ఎనర్జీ బిజినెస్ హెడ్ సమీర్ మాథుర్, ఎకోరన్ గ్రీన్ ఎనర్జీ సీఎండీ వై.లక్ష్మీ ప్రసాద్, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. మరో మూడు చోట్ల కూడా...! ఎన్‌హెచ్‌పీసీతో కలసి ఇంకా వేగంగా అడుగులు ముందుకువేసే కార్యక్రమంలో భాగంగా మరో 2,750 మెగావాట్లకు సంబంధించి 3 ప్రాంతాలలో ఫీజుబులిటీ స్డడీస్ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆ ప్రాజెక్టులను కూడా ఎన్‌హెచ్‌పీసీతో కలిసి సంయుక్తంగా చేపడతాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున సామర్ధ్యాన్ని పెంచుకుంటూనే మిగిలిన ప్రైవేట్ డెవలపర్స్‌కి కూడా అందుబాటులోకి తెచ్చి తద్వారా రాష్ట్రంతో పాటు దేశానికి కూడా మంచి చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. వీటన్నింటితో రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలవనుంది. ప్రపంచాన్ని శాసించే ఎనర్జీ దేవుడు గొప్పవాడు.. అందుకే మానవాళికి ఇంత చక్కటి వనరులను సృష్టించాడు. ఎండ బాగున్నప్పుడు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సోలార్ పవర్‌ని ఉత్ప త్తి చేస్తే సాయంత్రం 6 నుంచి ఉదయం వర కు విండ్ పవర్ ఉత్పత్తి అవుతుంది. పీక్ అ వర్స్‌లో నీళ్లతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను వాడుకోవచ్చు. ïపీక్ అవర్స్‌లో అవి ఆర్టిఫీషియల్ బ్యాటరీలా పనిచేస్తాయి. దీంతో ïపీక్ అవర్స్‌లో విద్యుదుత్పత్తి సాధ్యమవుతుంది. ఫలితంగా శిలాజ ఇంధనాల నుంచి బయటపడి పర్యావరణ హితమైన గ్రీన్ ఎనర్జీ లభిస్తుంది. ఇది ప్రపంచాన్ని శాసించ బోయే ఎన ర్జీగా నిలుస్తుంది. అందులో ఏపీ తొలిస్థానంలో నిలిచేలా అడుగులు పడుతున్నాయి. -
పోలవరం డయాఫ్రమ్‌వాల్‌పై 28లోగా నివేదిక
సాక్షి, అమరావతి: టీడీపీ సర్కార్ పాపాల వల్ల.. గోదావరి వరదల ఉధృతికి దెబ్బతిన్న పోలవరం ప్రధాన డ్యామ్ డయాఫ్రమ్‌వాల్ (పునాది) భవితవ్యాన్ని తేల్చే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. డయాఫ్రమ్‌వాల్ సామర్థ్యాన్ని తేల్చేందుకు గతనెల 26 నుంచి ఈనెల 10వ తేదీ వరకూ ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిపుణుల బృందం హైరిజల్యూషన్ జియోఫిజికల్ రెసిస్టివిటీ ఇమేజింగ్, సీస్మిక్ టోమోగ్రఫీ విధానాలలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలను విశ్లేషించి.. ఈనెల 28లోగా రాష్ట్ర జలవనరుల శాఖ, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)లకు ఆ బృందం నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) రిటైర్డ్ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలోని డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్(డీడీఆర్పీ) బృందం పోలవరం ప్రధాన డ్యామ్ డయాఫ్రమ్‌వాల్‌ను మార్చి 4న క్షేత్ర స్థాయిలో పరిశీలించనుంది. డయాఫ్రమ్‌వాల్ సామర్థ్యం బాగున్నట్లు ఎన్‌హెచ్‌పీసీ నివేదిక ఇస్తే.. ప్రధాన డ్యామ్ పనులకు డీడీఆర్పీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఒకవేళ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఎన్‌హెచ్‌పీసీ తేల్చితే.. దాన్ని సరిదిద్దాలా? లేదంటే పాతదానికి సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్‌వాల్ నిర్మించాలా? అనే అంశాలపై సీడబ్ల్యూసీ, ఐఐటీ(ఢిల్లీ, తిరుపతి, హైదరాబాద్) ప్రొఫెసర్లతో మార్చి 5న డీడీఆర్పీ బృందం మేధోమథనం జరుపుతుంది. ఇందులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా డయాఫ్రమ్‌వాల్ భవితవ్యాన్ని తేల్చుతుంది. -
భూగర్భ జలాల పరిరక్షణలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: దేశంలో భూగర్భ జలాల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు(ఎన్హెచ్పీ) అమలులో దేశంలో రాష్ట్రానిది తొలిస్థానం. భూగర్భ జలవనరుల పరిరక్షణ కోసం దేశంలో మూడేళ్ల నుంచి ఎన్‌హెచ్‌పీని కేంద్రం అమలుచేస్తోంది. దేశవ్యాప్తంగా జలసంరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 13.09 లక్షల జల సంరక్షణ నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టంది. వాటి ద్వారా వర్షపు నీరు అధిక శాతం భూమిలోకి ఇంకి.. భూగర్భ జలమట్టం పెరగడానికి దోహదం చేసింది. డ్రిప్, స్ప్రింక్లర్లతో తగ్గిన నీటి వినియోగం రాష్ట్రంలో 15 లక్షల వ్యవసాయ బోరు, బావుల కింద 40 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేస్తున్నారు. ఈ బోరు బావులను ప్రభుత్వం జియో ట్యాగింగ్ చేసింది. ఈ బోరు బావుల కింద సుమారు 13 లక్షల మంది రైతులకు 34.58 లక్షల ఎకరాలలో సూక్ష్మనీటిపారుదల విధానంలో పంటల సాగుకు డ్రిప్, స్ప్రింక్లర్లను ప్రభుత్వం అందజేసింది. ఇది భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించేలా చేసింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 1,254 ఫిజియో మీటర్ల ద్వారా ఎప్పటికప్పుడు భూగర్భ జల మట్టాన్ని పర్యవేక్షిస్తూ భూగర్భ జలాలను పరిరక్షించింది. పుష్కలంగా భూగర్భ జలం ఇక గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన జలసంరక్షణ చర్యలతో భూగర్భ జలమట్టం పెరిగింది. 2017తో పోలిస్తే 2020 నుంచి రాష్ట్రంలో ఏటా భూగర్భ జలాల లభ్యత 208 టీఎంసీలు పెరిగిందని కేంద్రం తేల్చింది. అలాగే, భూగర్భజలాల వినియోగం ఏటా సగటున 48 టీఎంసీలు తగ్గిందని పేర్కొంది. దీంతో.. భూగర్భ జలాల లభ్యత ఏటా పెరగడం.. వినియోగం తగ్గడంతో దేశంలో భూగర్భ జలాల సంరక్షణలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5.65 మీటర్లలోనే భూగర్భ జలాలు లభ్యమవుతుండటం గమనార్హం. ఇలా భూగర్భ జలాల లభ్యత పెరగడంతో అటు సాగునీటికి.. ఇటు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా పోయాయి. -
డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం తేలుస్తాం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను రెండురోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో సమీక్షించిన నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) బృందం.. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం తేల్చే పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమేనని తెలిపింది. ఇందుకు మూడు పద్ధతులను ప్రతిపాదించింది. వాటిపై 15 రోజుల్లోగా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ), కేంద్ర జలసంఘం (సీడబ్యూసీ)లకు నివేదిక ఇస్తామని ఎన్‌హెచ్‌పీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.ఎల్.కపిల్ తెలిపారు. సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ ఎంపికచేసిన పద్ధతి ప్రకారం డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని పరీక్షించి నివేదిక ఇస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి కనీసం రెండునెలలు పడుతుందని చెప్పారు. తీస్తా జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలో ఇదేరీతిలో డయాఫ్రమ్ వాల్ కోతకు గురవడంతో దానికి మరమ్మతులు చేసి, పూర్వస్థితికి తెచ్చామని పేర్కొన్నారు. కేంద్ర జల్‌శక్తి శాఖ ఆదేశాల మేరకు పోలవరం డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చాలని ఎన్హెచ్పీసీకి రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ లేఖ రాశారు. దీంతో ఎన్‌హెచ్‌పీసీ ఈడీ ఎస్.ఎల్.కపిల్ నేతృత్వంలో నిపుణులు విపుల్సాగర్, ఎ.కె.భారతిలతో కూడిన బృందం మంగళవారం పోలవరం చేరుకుని డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించింది. బుధవారం కూడా మరోసారి డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. సామర్థ్యం తేల్చేందుకు సమగ్రంగా పరీక్షలు గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండానే పోలవరం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో 1,750 మీటర్ల పొడవున 1.5 మీటర్ల వెడల్పు, గరిష్టంగా 90 మీటర్ల లోతుతో డయాఫ్రమ్ వాల్ నిర్మించారు. దీంతో ఎగువ కాఫర్ డ్యామ్‌లో ఖాళీ ప్రదేశాల ద్వా రా అధిక ఉద్ధృతితో వరద ప్రవహించి 400 నుంచి 1,100 మీటర్ల వరకు మినహా కుడి, ఎడమ వైపున డయాఫ్రమ్ వాల్ కోతకు గురైంది. కోతకు గురైన ప్రాంతంతోపాటు కోతకు గురికాని ప్రాంతంలోను డయాఫ్రమ్ వాల్‌ను ఎన్‌హెచ్‌పీసీ బృందం పరి శీలించింది. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చడానికి మూడురకాల పద్ధతులను ప్రతిపాదించింది. ఎన్‌హెచ్‌పీసీ బృందం ప్రతిపాదించిన మూడు పద్ధతులు ► మొదటి పద్ధతి: కోతకు గురికాని ప్రాంతంతోపాటు కోతకు గురైన ప్రాంతంలోను ప్రతి మీటర్‌కు డయాఫ్రమ్ వాల్ మధ్యలో 20 ఎంఎం వ్యాసంతో ఒకటిన్నర అడుగుల లోతు రంధ్రం చేసి, దాంట్లోకి ఎలక్ట్రోడ్స్ పంపి సామర్థ్యాన్ని పరీక్షించడం. ► రెండో పద్ధతి: కోతకు గురికాని ప్రాంతంతోపాటు కోతకు గురైన ప్రాంతంలోను ప్రతి 40 మీటర్లకు ఒకచోట డయాఫ్రమ్ వాల్ మధ్యలో 20 ఎంఎం వ్యాసంతో ఆరుమీటర్ల వరకు రంధ్రం చేసి, దాంట్లోకి ఎలక్ట్రోడ్స్ పంపి సామర్థ్యాన్ని పరీక్షించడం. ఇందుకు డయాఫ్రమ్ వాల్ నిర్మించిన బావర్–ఎల్అండ్టీ సంస్థ అనుమతి తీసుకోవాలి. ► మూడో పద్ధతి: డయాఫ్రమ్ వాల్‌కు ఒక మీటర్ ఎగువన, ఒక మీటర్ దిగువన ప్రతి 40 మీటర్లకు ఒకచోట జిగ్‌జాగ్ విధానంలో 90 మీటర్ల లోతు వరకు బోర్లు తవ్వి, వాటిలోకి ఎలక్ట్రోడ్స్ పంపి సామర్థ్యాన్ని పరీక్షించడం. ఎన్‌హెచ్‌పీసీ నివేదికే కీలకం ప్రపంచంలో డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం తేల్చే పరీక్షలపై ఎన్హెచ్పీసీకి మినహా ఏ సంస్థకు అవగాహన లేదని నిపుణులు చెబుతున్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్‌పై పరీక్షలు చేసి ఎన్‌హెచ్‌పీసీ ఇచ్చే నివేదికే కీలకం. ఆ నివేదిక ఆధారంగానే డయాఫ్రమ్ వాల్‌పై సీడబ్ల్యూసీ తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం ఉన్న దానికి సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదంటే కోతకు గురైన ప్రాంతంలో మాత్రమే కొత్తగా నిర్మించి, ఇప్పుడున్న దానికి అనుసంధానం చేయాలా? అన్నది తేల్చనుంది. డయాఫ్రమ్ వాల్ భవితవ్యం తేలాక.. రాష్ట్ర ప్రభుత్వం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టనుంది. ఎన్‌హెచ్‌పీసీ బృందం వెంట పీపీఏ డిప్యూటీ డైరెక్టర్ ప్రవీణ్, ఐఐటీ నిపుణుడు సందీప్ తదితరులున్నారు. -
పోలవరంపై ఎన్‌హెచ్‌పీసీ కేంద్రనికి నివేదిక
-
పోలవరం ప్రాజెక్టుపై ఇదేనా మీ చిత్తశుద్ధి?
-
పోలవరం ప్రాజెక్టుపై ఇదేనా మీ చిత్తశుద్ధి?
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఏపీ ప్రభుత్వ లోపాలను జాతీయ జలవిద్యుదుత్పత్తి సంస్థ (ఎన్‌హెచ్‌పీసీ) కమిటీ ఎత్తిచూపింది. ‘స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. వాటిని పూర్తి చేయకుండా కాఫర్ డ్యామ్‌ను 41 మీటర్ల ఎత్తుతో నిర్మించడం ఎలా సాధ్యం? గ్రావిటీ ద్వారా నీటిని ఎలా సరఫరా చేస్తారు?’ అని కమిటీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. శుక్రవారం ఎన్‌హెచ్‌పీసీ కమిటీ సభ్యులు వైకే చౌబే, ఆర్సీ శర్మ, శంక్దీప్ చౌదరిలు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి.. రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూన్, 2018 నాటికి స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులను పూర్తి చేసేందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను అందిస్తే.. దాన్ని అధ్యయనం చేసి కాఫర్ డ్యామ్‌పై నిర్ణయం తీసుకుంటామని కమిటీ స్పష్టీకరించింది. స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనుల్లో ఇప్పటివరకూ 10 శాతం కాంక్రీట్ పనులను మాత్రమే చేశారని పేర్కొంది. మిగిలిన 30 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిని జూన్, 2018 నాటికి ఎలా పూర్తి చేస్తారని నిలదీసింది. కాంక్రీట్ పనులను పూర్తి చేయకుండానే.. కాఫర్ డ్యామ్‌ను 41 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని కోరడాన్ని తప్పుబట్టింది. జూన్, 2018 నాటికి కాంక్రీట్ పనులు పూర్తి చేసేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఇవ్వాలని జలవనరుల శాఖ అధికారులను కోరింది. కాఫర్ డ్యామ్‌తో సమాంతరంగా.. రుతుపవనాల ప్రభావం లేనప్పుడు గోదావరి నదికి ఎంత వరద వస్తుందని కమిటీ ఆరా తీసింది. వరద తక్కువగా ఉన్న భాగంలో కాఫర్ డ్యామ్‌తో సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌ను నిర్మించడం వల్ల అతి తక్కువ వ్యయంతో ప్రాజెక్టును పూర్తి చేయొచ్చని కమిటీ అభిప్రాయపడింది. దీనితో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు ఏకీభవించలేదు. దాంతో.. ముందు రుతుపవనాల ప్రభావం లేనప్పుడు గోదావరికి ఎంత వరద వస్తుంది.. రుతుపవనాల ప్రభావం ఉన్నప్పుడు ఎంత వరద వస్తుందన్న అంశాలపై 50 ఏళ్ల రికార్డులను ఇవ్వాలని కమిటీ సభ్యులు కోరారు. వరద తక్కువ ఉన్నప్పుడు కొంత భాగం చొప్పున దశల వారీగా దేశంలో ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేశారని.. పోలవరం ప్రాజెక్టును అతి తక్కువ ఖర్చుతో దశల వారీగా పూర్తి చేయొచ్చని కమిటీ వివరించింది. వరద రికార్డులను అందిస్తే అధ్యయనం చేసి.. కాఫర్ డ్యామ్‌ను 31 మీటర్ల ఎత్తుతో నిర్మించాలా? 41 మీటర్ల ఎత్తుతో నిర్మించాలా? కాఫర్ డ్యామ్‌తో సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌ను నిర్మించాలా? అనే అంశాలపై కేంద్రానికి నివేదిక ఇస్తామని పేర్కొంది. -
ఎన్‌హెచ్‌పీసీ వాటా విక్రయం సక్సెస్
ప్రభుత్వానికి రూ.2,700 కోట్లు న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తొలి డిజిన్వెస్ట్‌మెంట్, ఎన్‌హెచ్‌పీసీ వాటా విక్రయం విజయవంతమైంది. గురువారం రిటైల్ ఇన్వెస్టర్ల వాటా విక్రయానికి మంచి స్పందనే లభించింది. వాటా విక్రయంలో భాగంగా 125.76 కోట్లు(11.36 శాతం వాటా) షేర్లను ఒక్కో షేర్ రూ.21.75 బేస్ ధరపై ప్రభుత్వం విక్రయానికి పెట్టింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన 100.61 కోట్ల షేర్లకు గాను 156.79 కోట్ల షేర్లకు బిడ్లు, రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన 25.15 కోట్ల షేర్లకు గాను 41.45 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. సంస్థాగత వాటా ఇన్వెస్టర్ల విభాగం 1.58 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా విభాగం 1.65 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి. మొత్తం మీద ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.2,700 కోట్లు సమకూరాయి. ఎన్‌హెచ్‌పీసీలో ప్రభుత్వ వాటా 85.96 శాతం నుంచి 74.6 శాతానికి తగ్గుతుంది. ఫ్లోర్ ప్రైస్(రూ.21.75)లో రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ వాటా విక్రయం నేపథ్యంలో ఎన్‌హెచ్‌పీసీ షేర్ ధర బీఎస్ఈలో 1.8 శాతం క్షీణించి రూ.21.15 వద్ద ముగిసింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.56,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
ఎన్‌హెచ్‌పీసీ వాటా విక్రయానికి మంచి స్పందన
♦ నేడు రిటైల్ ఇన్వెస్టర్లకు విక్రయం ♦ కట్ ఆఫ్ ధర లో 5 శాతం డిస్కౌంట్ న్యూఢిల్లీ: ఎన్‌హెచ్‌పీసీ వాటా విక్రయానికి మంచి స్పందన లభించింది. ఈ ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి కంపెనీలో 11.36 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో ప్రభుత్వం విక్రయానికి పెట్టింది. వ్యవస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా షేర్లు మూడు గంటలలోనే ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి. వ్యవస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన 100.61 కోట్ల షేర్లకు గాను 1.58 రెట్లు అంటే 156.79 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. ఈ బిడ్స్ విలువ రూ.3,410 కోట్లు. అత్యధిక బిడ్లు ఎల్ఐసీ, మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చాయని సమాచారం. గురువారం మిగిలిన 25.15 కోట్ల షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు విక్రయిస్తారు. ఆఫర్‌కు ఫ్లోర్‌ప్రైస్ రూ. 21.75కాగా, రిటైల్ ఇన్వెస్టర్లకు కట్ ఆఫ్ ధరకు 5 శాతం డిస్కౌంట్‌ను ఇవ్వనున్నారు. కాగా ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.2,700 కోట్ల నిధులు లభిస్తాయని అంచనా. వాటా విక్రయ నేపథ్యంలో ఈ కంపెనీ షేర్ 5.8 శాతం నష్టపోయి రూ.21.70 వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం పీఎస్‌యూల్లో తొలి డిజిన్వెస్ట్‌మెంట్ ఇది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా రూ.56,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
ఇక సర్కారీ షేర్ల జాతర..!
న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా దిగ్గజ కంపెనీలు ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎన్హెచ్పీసీలలో వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) ఇందుకు ఓకే చెప్పింది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ మూడు కంపెనీలలో ప్రతిపాదిత ప్రభుత్వ వాటాలను విక్రయిస్తే రూ. 43,000 కోట్లకుపైగా నిధులు సమకూరనున్నాయి. కోల్ ఇండియాలో ప్రతిపాదిత 10% వాటాకు ప్రస్తుత ధరూ. 374 ప్రకారం రూ. 23,000 కోట్లు లభించనుండగా, ఓఎన్జీసీలో 5% వాటాకు ప్రస్తుత మార్కెట్ ధర రూ. 445 ప్రకారం రూ. 18,000 కోట్లు, ప్రస్తుత రూ. 22 ధర ప్రకారం ఎన్‌హెచ్‌పీసీలో 11.36% వాటాకుగాను రూ. 2,800 కోట్లు చొప్పున ప్రభుత్వానికి లభిస్తాయి. తద్వారా బడ్జెట్లో ప్రతిపాదించినమేరకు ప్రభుత్వం నిధులను సమీకరించగలుగుతుంది. కాగా, ఈ సంస్థలలో వాటాలను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ బాటలో ఇప్పటికే ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ను చేపట్టేందుకు మర్చంట్ బ్యాంకర్ల ఎంపిక ప్రక్రియను సైతం మొదలుపెట్టింది. ఈ నెలలో సెయిల్... డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా స్టీల్ రంగ దిగ్గజం సెయిల్‌లో 5% వాటాను విక్రయించేందుకు గత ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. సెయిల్ ఇష్యూని ప్రభుత్వం ఈ నెలలో చేపట్టే అవకాశమున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత మార్కెట్ ధర రూ. 81 ప్రకారం సెయిల్‌లో 5% వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 1,600 కోట్లవరకూ లభించవచ్చు. కాగా, వరుసగా గత ఐదేళ్లలో ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని చేరడంలో విఫలమవుతూనే వస్తోంది. నిజానికి ప్రతీ బడ్జెట్లో ప్రభుత్వం రూ. 40,000 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ 2010-11లో రూ. 22,144 కోట్లు, 2011-12లో రూ. 13,894 కోట్లు చొప్పున మాత్రమే సమీకరించగలిగింది. ఇక 2012-13లో లక్ష్యం రూ. 30,000 కోట్లుకాగా రూ. 23,956 కోట్లు సమకూర్చుకుంది. 2013-14లో రూ. 40,000 కోట్ల ల క్ష్యానికిగాను రూ. 16,027 కోట్లు మాత్రమే సమీకరించింది. -
వారం రోజుల్లో ఎన్‌హెచ్‌పీసీ బైబ్యాక్
న్యూఢిల్లీ: జల విద్యుత్ రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్‌హెచ్‌పీసీ తలపెట్టిన బైబ్యాక్ ఈ నెల 29నుంచి మొదలుకానుంది. బైబ్యాక్‌లో భాగంగా రూ. 10 ముఖ విలువగల 123 కోట్లకుపైగా సొంత షేర్లను కంపెనీ కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 2,368 కోట్లను వెచ్చించనుంది. షేరుకి రూ. 19.25 ధరలో చేపట్టనున్న బైబ్యాక్‌ను డిసెంబర్ 12వరకూ నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క ంపెనీలో ప్రభుత్వానికి 86.36% వాటా ఉంది. బైబ్యాక్‌లో భాగంగా ప్రభుత్వం కొంతమేర వాటాను విక్రయిం చే అవకాశముంది. దేశవ్యాప్తంగా ఉన్న 17 జల విద్యుత్ కేంద్రాల ద్వారా మొత్తం 5,702 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం కంపెనీ సొంతం. కాగా, బీఎస్ఈలో షేరు ధర 1.7% క్షీణించి రూ. 17.65 వద్ద ముగిసింది.