పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఏపీ ప్రభుత్వ లోపాలను జాతీయ జలవిద్యుదుత్పత్తి సంస్థ (ఎన్‌హెచ్‌పీసీ) కమిటీ ఎత్తిచూపింది. ‘స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. వాటిని పూర్తి చేయకుండా కాఫర్ డ్యామ్‌ను 41 మీటర్ల ఎత్తుతో నిర్మించడం ఎలా సాధ్యం? గ్రావిటీ ద్వారా నీటిని ఎలా సరఫరా చేస్తారు?’ అని కమిటీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.