వారం రోజుల్లో ఎన్‌హెచ్‌పీసీ బైబ్యాక్ | NHPC to buy back Rs.2,368 crore worth of shares | Sakshi
Sakshi News home page

వారం రోజుల్లో ఎన్‌హెచ్‌పీసీ బైబ్యాక్

Published Sat, Nov 23 2013 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM

NHPC to buy back Rs.2,368 crore worth of shares

న్యూఢిల్లీ: జల విద్యుత్ రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్‌హెచ్‌పీసీ తలపెట్టిన బైబ్యాక్ ఈ నెల 29నుంచి మొదలుకానుంది. బైబ్యాక్‌లో భాగంగా రూ. 10 ముఖ విలువగల 123 కోట్లకుపైగా సొంత షేర్లను కంపెనీ కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 2,368 కోట్లను వెచ్చించనుంది. షేరుకి రూ. 19.25 ధరలో చేపట్టనున్న బైబ్యాక్‌ను డిసెంబర్ 12వరకూ నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క ంపెనీలో ప్రభుత్వానికి 86.36% వాటా ఉంది. బైబ్యాక్‌లో భాగంగా ప్రభుత్వం కొంతమేర వాటాను విక్రయిం చే అవకాశముంది. దేశవ్యాప్తంగా ఉన్న 17 జల విద్యుత్ కేంద్రాల ద్వారా మొత్తం 5,702 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం కంపెనీ సొంతం. కాగా, బీఎస్‌ఈలో షేరు ధర 1.7% క్షీణించి రూ. 17.65 వద్ద ముగిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement